“నెం. 1 యారి” షో చూసేటప్పుడు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా.? అలా గొంతు ఎందుకు మారిపోతుంది.?

“నెం. 1 యారి” షో చూసేటప్పుడు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా.? అలా గొంతు ఎందుకు మారిపోతుంది.?

by Megha Varna

Ads

గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి వీకెండ్ లో మనల్ని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ లో ఒకటి నెంబర్ 1 యారి. రానా దగ్గుబాటి హోస్ట్ గా ఉన్న ఈ ప్రోగ్రాంకి ఎంతో మంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చి వారి జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్తారు. అయితే ఈ ప్రోగ్రాంలో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ హీలియం బెలూన్ ఊది డైలాగ్ చెప్పడం.

Video Advertisement

Why does voice change after breathing helium

సెలబ్రిటీలు ఒక బెలూన్ తీసుకొని అందులో ఉన్న హీలియం ని పీల్చి ఏదో ఒక డైలాగ్ చెబుతారు. హీలియం పీల్చిన తర్వాత వారి గొంతు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. అయితే అలా హీలియం పీల్చిన తర్వాత గొంతు ఎందుకు అలా మారిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.అసలు ముందు వాయిస్ ఎలా వస్తుందో తెలుసుకుందాం.

Why does voice change after breathing helium

ప్రతి ఒక్కరి గొంతులో వాయిస్ ఉత్పత్తి చేసే ఒక చిన్న భాగం ఉంటుంది. దానిని ల్యారింక్స్ లేదా వాయిస్ బాక్స్ అని అంటారు. ఈ వాయిస్ బాక్స్ లో వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఆ వోకల్ కార్డ్స్ రబ్బర్ బ్యాండ్ లాగా సాగుతాయి. గిటార్ స్ట్రింగ్స్ లాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. మనం మాట్లాడేటప్పుడు గాలి ఈ వోకల్ కార్డ్స్ నుండి బయటకు వస్తుంది.

Why does voice change after breathing helium

ఆ సమయంలో వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతూ మన వాయిస్ బయటికి వస్తుంది. ఇలా బయటికి వచ్చే గాలిలో 78 శాతం నైట్రోజన్ 20 శాతం ఆక్సిజన్ అలాగే ఇంకో 2 శాతం వేరే గ్యాసెస్ ఉంటాయి. అయితే ఈ గ్యాస్ లతో పోలిస్తే హీలియం గాలి చాలా తొందరగా వెళుతుంది.

Why does voice change after breathing helium

మనం హీలియం గ్యాస్ లోపలికి పీల్చుకున్నప్పుడు బయటికి వచ్చే గాలి చాలా వేగంగా వస్తుంది. ఆ సమయంలో వోకల్ కార్డ్స్ చాలా వేగంగా వైబ్రేట్ అవుతాయి. ఈ కారణంగా మన గొంతు కొంచెం డిఫరెంట్ గా, కామెడీగా ఉంటుంది. అయితే ఈ హీలియం గ్యాస్ చాలా తక్కువగా పీల్చాలి. ఎక్కువగా మాట్లాడొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ హీలియం లోపలికి పీల్చుకుంటే మెదడు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

watch video:

https://youtu.be/y7VPS4JpuH0


End of Article

You may also like