సివిల్స్ ఎగ్జామ్స్ ఎంత కఠినంగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. అయితే మెయిన్స్ పాస్ అయ్యాక ఉండే ఇంటర్వ్యూ అంతకంటే కఠినంగా ఉంటుంది. ఇంటర్వూ క్రాక్ చేయాలంటే కేవలం పుస్తక జ్ఞానం సరిపోదు. సివిల్స్ ఇంటర్వ్యూలో నాలెడ్జితో పాటు పర్సనాలిటీ, సమయస్ఫూర్తి వంటి అంశాల గురించి కూడా క్వషన్స్ అడుగుతారు.
అలాంటి సివిల్స్ ఇంటర్వ్యూకి హాజరు అయిన ఒక యువకుడిని ఇంగ్లీష్ రాదు అన్నారు. కానీ ఈ యువకుడు చెప్పిన జవాబుతో షాక్ అవడమే కాకుండా సెలెక్ట్ చేశారు. ఆ యువకుడు ఎవరో? ఏం సమాధానం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎస్ ఫైనల్ వరకు వచ్చిన ఒక యువకుడికి ఇంటర్వ్యూలో సరిగా ఇంగ్లీష్ మాట్లాడలేకపోయాడు. ఇంటర్వ్యూ చేసే అధికారి ఆ యువకుడిని, నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే ఐపీఎస్ అయిన తరువాత ఎలా మేనేజ్ చేస్తావని అడిగారు. అది విన్న తరువాత ఆ యువకుడు సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు ప్రశ్న అడిగిన అధికారి ఈ గ్లాస్ వాటర్ తాగి, జవాబు చెప్పమని అంటాడు. ఆ యువకుడు ఆ వాటర్ ను నేను తాగలేను సార్ అని అంటాడు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎందుకు అని అడుగుతాడు.
అప్పుడు ఆ యువకుడు, నేను స్టీల్ గ్లాస్ లో మాత్రమే వాటర్ తగుతాను. ఈ గ్లాస్ లో తాగను అని సమాధానం ఇస్తాడు. దాంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి కోపం వచ్చి, గ్లాస్ కి వాటర్ కి ఏం సంబంధం అని అడుగుతాడు. అదే సార్ నేను చెప్పేది, ఏ గ్లాస్ లో వాటర్ తాగుతున్నామనేది ముఖ్యం కాదు. వాటర్ మాత్రమే ముఖ్యం.
అదే విధంగా అన్నిటినీ మేనేజ్ చేయడానికి నా టాలెంట్ మాత్రమే ముఖ్యం, నేను మాట్లాడే భాష కాదు అని చెప్తాడు. ఈ సమాధానంతో ఆ యువకుడిని సెలెక్ట్ చేశారు. ఆ ఐపీఎస్ ఆఫీసర్ పేరు మనోజ్ శర్మ. 2005 లో మహారాష్ట్ర కేడర్ నుంచి ఐపీఎస్ అయ్యాడు. ప్రస్తుతం ముంబైలోని వెస్ట్ రీజియన్ అడిషనల్ కమిషనర్గా కొనసాగుతున్నారు.

M సింబల్ లైఫ్ లైన్(జీవిత రేఖ), హెడ్ లైన్(తల రేఖ), మరియు హార్ట్ లైన్(హృదయ రేఖ) వల్ల ఏర్పడుతుంది. లైఫ్ లైన్ మణికట్టు నుండి పైకి విస్తరించి, హెడ్ లైన్ దాటి హార్ట్ లైన్ కు చేరుకుంటుంది, జీవిత రేఖ, తల రేఖ మరియు హృదయ రేఖతో వాలుగా ఉండే M సింబల్ ను ఏర్పరుస్తుంది. అరచేతి పై ఉండే M సింబల్ డబ్బు మరియు ప్రేమ అదృష్టాన్ని సూచిస్తుంది.
M సింబల్ ఉన్న వ్యక్తులు సాధారణంగా ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉంటారు. తాము కన్న కలల కోసం కష్టపడి పని చేస్తారు. వారు అనుకుంటే తప్పక సాధిస్తారు. అందువల్ల, ఈ వ్యక్తులు తరచుగా విజయాన్ని సాధిస్తారు. అలాగే గుర్తింపును సంపాదించుకుంటారు. వీరు 40 ఏళ్ల లోపే పేరు ప్రతిష్టలను, డబ్బును పొందుతారు.
M గుర్తు ఉన్న వ్యక్తులు వ్యాపారంలో జన్మించిన మాస్టర్స్, వారు ఏమీ లేకుండా నిర్మించగలరు మరియు నాలుగు, ఐదు తరాలకు సరిపోయే గొప్ప సంపదను కూడబెట్టుకోగలరు మరియు మిలియనీర్స్ గా ఉంటారు. వీరు సహజంగా, ఉత్సాహంగా, కరుణతో, సృజనాత్మకంగా మరియు ఇతరులు విస్మరించిన సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటారు. వీరికి ఒక పనిని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.

















సివిల్స్ సర్వీసెస్ కు ఎంపిక కావడానికి మూడు పరీక్షలను ఎదుర్కోవాలి. వాటిలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అభ్యర్థుల అకడమిక్ మరియు జనరల్ అవేర్నెస్ను మరియు విభిన్న అంశాలను పరీక్షించడం కోసం నిర్వహిస్తారు. ఇంటర్వ్యూను సివిల్ సర్వీసెస్ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం మరియు స్వభావానికి సంబంధించిన పరీక్ష అని చెప్పవచ్చు. సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉంటుందో, ఆ పరీక్ష పాస్ అయిన తరువాత అత్యంత క్లిష్టమైన ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రతి సంవత్సరం వేలాది మంది సివిల్స్ ఎగ్జామ్ రాస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే ఎంపిక అవుతుంటారు. దానికి ఎందుకంటే ఇంటర్వ్యూలోఆ దిగే ప్రశ్నలకు తర్కంతో ఆలోచిస్తే తప్ప జవాబులు చెప్పలేము. ఊహించని ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. ఈ క్రమంలోనే సివిల్స్ ఇంటర్వ్యూలో ఒక యువకుడిని అడిగిన ప్రశ్న టాప్ ఐఏఎస్ ప్రశ్నల్లో ఒకటిగా నిలిచింది.
అది ఏమిటంటే, నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఆమెకు చెవులు, కళ్ళు, నోరు పనిచేయవు. ఆమెను తాకకుండా ఎలా ప్రపోజ్ చేస్తావు? అని అడిగారు. ఇది లాజిక్ ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం, ఆ అబ్బాయి అంధుడు, చెవిటివాడు మరియు మూగవాడు కాదు కాబట్టి ప్రపోజ్ చేయగలడు. అయితే అతని ప్రతిపాదనను అమ్మాయి అర్థం చేసుకోవాలని చెప్పలేదు అని ఆ యువకుడు చెప్పాడు.



అరచేతిలో గీతాలు రకరకాలుగా ఉంటాయి. వీటితో పాటు గుర్తులు కూడా ఉంటాయి. అయితే అర చేతిలో రేఖల మధ్య ‘ఎక్స్’ (X) ఆకారంలో గుర్తు ఉంటే వారికి లైఫ్ లో తిరుగు ఉండదంట. ఇలాంటి గుర్తు ప్రపంచం మొత్తంలో 5 శాతం మందికి మాత్రమే ఉంటుందట. అరచేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండడం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం..
అర చేతిలో ఎక్స్ గుర్తు ఉన్నవారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. ఆ వ్యక్తి సక్సెస్ బాటలో నడవడమే కాక ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపిస్తారట. ఈ గుర్తు కలిగిన వ్యక్తులు ప్రపంచాన్ని కూడా జయిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అర చేతిలో ఈ ఎక్స్ గుర్తు ఉండేదట. అలాగే అలెగ్జాండర్ తన అరచేతి రేఖలను బలంగా నమ్మేవారంట. మాస్కోలో ఉండే హెచ్టీఐ యూనివర్సిటి సైంటిస్టులు చాలా మంది చేతి రేఖల పై పరిశోధనలు చేశారు.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు అర చేతిలో ఎక్స్ గుర్తు ఉండేదని సైంటిస్టులు తెలియజేశారు. పరిశోధనల ప్రకారం రెండు అర చేతుల్లో ఎక్స్ గుర్తు ఉంటే వారు జీనియస్ అని, బలవంతులుగా ఉండడంతోపాటు ఇతర వ్యక్తులను తేలికగా అంచనా వేయగలరట. అలాగే వీరిని మోసం చేయడం చాలా కష్టం. ఎక్స్ గుర్తు ఉన్నవారు శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా ఉంటారట. ఈ వ్యక్తులు పేరు ప్రతిష్టలు, సమాజంలో చాలా గౌరవం ఉంటుందని సదరు పరిశోధకులు చెబుతున్నారు.