గతంలో హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. హైదరాబాద్ కి వచ్చినవారు చాలా ఆసక్తిగా వాటిని చూసేవారు. ఆ బాస్ లో ప్రయాణించి ఆనందించే వారు. కాలక్రమంలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి.
అయితే డబుల్ డెక్కర్ బస్సులు ప్రస్తుతం హైదరాబాద్ లో తిరుగుతున్నాయి. అది కూడా ఉచితంగా ఈ బస్సులను తిప్పుతున్నారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. అందువల్ల ఈ బస్సులు ఏ రూట్లలో నడుస్తున్నాయో కూడా తెలియక ప్రజలు ఎక్కడం లేదు. మరి ఆ బస్సులు ఏ రూట్లలో నడుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు నడిచిన డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్లు కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా మినిస్టర్ కేటీఆర్ ని కోరారు. వారి రిక్వెస్ట్‌కు అంగీకరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ మాట ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సులను ఇటీవల తీసుకొచ్చారు. 12 కోట్ల రూపాయలు వెచ్చించి,హెచ్ఎండీఏ సహకారంతో 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు.
‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులను ఉచితంగా తిప్పుతున్నారు. ఫిబ్రవరి నుండి ఈ బస్సులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులను పంజగుట్ట నుండి హైటెక్ సిటీ వరకు నడుస్తాయి. ఈ రూట్ లో మూడు బస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. మరో బస్సు ట్యాంక్ బాండ్ రూట్ లో నడుస్తుందని, ఇంకో బస్సు , సాలార్జంగ్ మ్యూజియం రూట్ లో తిరుగుతుందని సమాచారం.
ఆరవ బస్సు అబిడ్స్ రూట్ లో నడుస్తుందని తెలుస్తోంది. ఈ ఆరు బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్రీ అని తెలియని చాలామంది ఈ బస్సుల రూపాన్ని చూసి, ఎంత టికెట్ ఉంటుందో అని, ఆ బస్సుల ఎప్పుడు వస్తాయో తెలియక కొంతమంది ఎక్కడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ బస్సుల్లో జర్నీ ఉచితం. టికెట్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు.
Also Read: TSPSC గ్రూప్-1 పరీక్షలు రెండోసారి కూడా ఎందుకు రద్దు చేశారు..? కారణం ఏంటంటే..?

చరిత్రకారుడు, రచయిత, అయిన రామచంద్ర గుహను ఒక ఇంటర్వ్యూలో గాంధీజీ ప్రేమించిన మహిళా గురించి అడుగగా, ఆయన మాట్లాడుతూ, సరళా దేవి చౌధురాణి విద్యావేత్త, అభ్యుదయవాది, రాజకీయ కార్యకర్త. ఆమె తన భర్తతో కలిసి లాహోర్‌లో నివసించింది. ఆమె చాలా నిష్ణాతురాలు, కవి, గాయని. ఆమె జాతీయవాద సమావేశాలలో బాగా పాడేది. గాంధీ ఆమె పాడటం విన్నారు, గాంధీజీ ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు. గాంధీజీ 1919లో లాహోర్ వెళ్ళిన సమయంలో సరళా దేవి ఇంట్లో గాంధీ బస చేశారు.
అయితే ఆమె భర్త స్వాతంత్ర్య, ఉద్యమకారుడు రామ్భుజ్ దత్త్ ఆ సమయంలో జైల్లో ఉన్నారు. గాంధీ, సరళల మధ్య చాలా సాన్నిహిత్యం ఉందని అన్నారు. వారిది ప్లాటోనిక్ ప్రేమగా తెలిపారు. అయితే సరళా దేవి రవీంద్రనాథ్ ఠాగూర్ కు మేనకోడలు, సోదరి కుమార్తె. ఉన్నత చదువు పూర్తి చేసింది. 1910 లో భారత స్త్రీ మహామండలాన్ని అలహాబాద్‌లో స్థాపించింది. ఇది ఇండియాలో తొలిమహిళా సంస్థ. స్త్రీ విద్యను ప్రోత్సహించడం ఈ సంస్థ లక్ష్యాలలో ఒకటి. ఈ సంస్థ దేశంలోని మహిళల స్థితిని మెరుగుపరచడం కోసం ఢిల్లీ, కరాచీ, హైదరాబాద్ వంటి అనేక ప్రాంతాలలో కార్యాలయాలను మొదలుపెట్టింది.
గాంధీజీ లాహోర్ వెళ్ళిన సందర్భంలో సరళాదేవితో సానిహిత్యం ఏర్పడింది. కానీ వారి సాన్నిహిత్యం లాహోర్‌లో చర్చనీయాంశం అయ్యింది. గాంధీజీ ఆమె రాసిన రచనలను, కవితలను తన ప్రసంగాలలో, పలు పత్రికలలో వినియోగించాడు. ఖాదీ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి గాంధీజీతో కలిసి సరళ దేవి భారత్‌లో పర్యటించారు. దూరంగా ఉన్నప్పుడు ఇద్దరు తరచూ ఉత్తరాల ద్వారా సంప్రదించుకునేవారు.
రవీంద్రభారతి యూనివర్సిటీ ఉప కులపతి, సభ్యసాచి బాసు రే చౌదరి చెప్పిన ప్రకారం, ఇద్దరి మధ్య సన్నిహితమైన బంధం ఉన్నప్పటికీ, అది పరస్పరం మెచ్చుకోవడం మాత్రమే అని తెలుస్తోంది. సరళా దేవి కుమారుడు దీపక్, గాంధీజీ మనవరాలు అయిన రాధను పెళ్లి చేసుకున్నాడు. గాంధీజీ, సరళాదేవి బంధం గురించి గాంధీజీ సన్నిహితులకు సైతం తెలుసు. అయితే, కొంత కాలం అనంతరం సరళను గాంధీజీ దూరం పెట్టారు. ఆ తరువాత కొన్నాళ్లకు సరళాదేవి హిమాలయాల్లో ఏకాంతగా గడుపుతూ అక్కడే కన్నుమూసారని తెలుస్తోంది.

రిడిల్స్ అంటే పిల్లలు దగ్గర నుండి పెద్దవారి వరకు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఒక రిడీల్ ఎలా ఉండాలనే దాని గురించి ఎటువంటి రూల్స్ లేవు. అవి ఒక లైన్ వలె చిన్నగా ఉండవచ్చు. లేదా పెద్ద పేరా రూపంలో కూడా కావచ్చు. కొన్ని రిడిల్స్ రైమ్ లా కూడా ఉంటాయి. మరి కొన్ని కవితల రూపంలో కూడా ఉండవచ్చు.
అయితే ఇప్పుడు ఒక డిటెక్టివ్ రిడిల్ గురించి చూద్దాం. ఒక రైలు పట్టా మీద మీ సోదరుడు ఉన్నాడు. మరో రైలు పట్టా సోదరి ఉంది. వీళ్ళిద్దరూ భయంతో కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు. కానీ మీరు ఒక్కరినే కాపాడగలరు. అయితే వీళ్లిద్దరిలో మీరు ఎవరిని కాపాడుతారు. ఈ రిడీల్ కి పది సెకన్లలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ రిడిల్ కి సమాధానం ఏమిటంటే మీరు బాగా గమనించినట్లయితే మీ సోదరుడి వైపు రెడ్ సిగ్నల్ పడింది. అంటే ట్రైన్ మూవ్ కాదు. మీ సోదరి వైపు చూస్తే గ్రీన్ సిగ్నల్ పడింది. అంటే ట్రైన్ మూవ్ అవుతుంది. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ముందుగా మీ సోదరిని కాపాడాలి.
వినికిడి లోపం ఉన్న లాయర్ల కోసం సంకేత భాష ద్వారా ఒక కేసు యొక్క విచారణను అనువదించడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. రీసెంట్ గా సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ సంచిత సీజేఐ డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని బధిర లాయర్ సారా సన్నీ సైగల సహాయంతో వికలాంగుల హక్కులకు చెందిన కేసును వాదించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరింది. సీజేఐ అనుమతించారు. దాంతో ఇండియాలో మొట్టమొదట, వినికిడి లోపం ఉన్న న్యాయవాది సారా సన్నీ, సంకేత భాషల సహాయంతో సుప్రీంకోర్టులో కేసును సమర్పించారు.
కలలను సాకారం చేసుకోవడానికి శరీరంలోని లోపం అడ్డుకాదని, నిరూపిస్తూ సారా సన్నీ సుప్రీంకోర్టులో వాదించి, భారత దేశ చరిత్రలో, మొదటిసారిగా వినికిడి లోపం ఉన్న న్యాయవాదిగా నిలిచింది. సారా సన్నీ సుప్రీంకోర్టులో న్యాయ విచారణకు హాజరయ్యారు. సౌరభ్ రాయ్ సాయంతో కోర్టులో సైగలతో సారా సన్నీ మొదటిసారి వాదనలు వినిపించారు. కేరళలోని కొట్టాయం నుండి వచ్చిన సారా బెంగుళూరుకు చెందిన వినికిడి లోపం ఉన్న లాయర్.
ఆమె ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ మరియు హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్‌లో యాక్టివ్ మెంబర్. సన్నీకి మరియ అనే కవల సోదరి కూడా ఉంది. ఇద్దరూ అక్కడే జ్యోతినివాస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. మరియ తన తండ్రి కెరీర్‌ను ఎంచుకుని, చార్టర్డ్ అకౌంటెంట్ వైపు వెళ్ళగా, సారా లాయర్ అయ్యింది. కేసు వాదించిన అనంతరం సుప్రీంకోర్టులో వాదించడం తన కల అని, అది ఇంత త్వరగా నిజం అవుతుందని ఉహించలేదని కోర్టులో తెలిపింది.
1970 లో మదన్ మోహన్ సిద్దిపేట ఉప ఎన్నికలతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1967లో సిద్దిపేట ఎమ్మెల్యే వల్లూరి బసవరాజు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దాంతో ఆ సీటు ఖాళీ అయింది. 1970లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలెక్షన్స్ జరిగాయి. ఆ ఎలెక్షన్స్ లలో మదన్ మోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పీవీ రాజేశ్వరరావు పై మదన్ మోహన్ 31,633 ఓట్లతో గెలిచారు. ఆ తరువాత 1972, 1979 ఎలెక్షన్స్ లో కూడా అనంతుల మదన్ మోహన్ గెలుపు సాధించారు.
తెలుగుదేశం పార్టీ 1983 ఎలెక్షన్స్ లో 200కి పైగా సీట్లు సాధించి, ఎన్టీఆర్ సీఎం అయ్యి, గవర్నమెంట్ ను ఏర్పాటు చేయగా, మదన్ మోహన్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తరువాత వచ్చిన 1985 ఎలెక్షన్స్ లో మదన్ మోహన్ పోటీ చేయలేదు. అనంతరం 1989, 1994 ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి సిద్దిపేటలోనే పోటీ చేయగా, రెండు సార్లు కూడా కేసీఆర్ చేతిలో పరాజయం పొందారు. ఆ తరువాత రాజకీయంగా కనుమరుగయ్యారు. 2004లో అనంతుల మదన్ మోహన్ కన్నుమూశారు.
భారత అత్యన్నత రా ఏజెంట్ గుర్తింపు పొందిన ఆ వ్యక్తి వ్యక్తి పేరు రవీందర్ కౌశిక్. ఆయన 1952లో ఏప్రిల్ 11న హర్యానాలో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుండే దేశభక్తి ఉంది. రవీందర్ 23 సంవత్సరాల వయసులో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ లో చేరారు. అయితే పాకిస్తాన్ కు “అండర్ కవర్” ఏజెంట్ గా వెళ్లేందుకు అందరూ వెనకడుగు వేయగా, తాను వెళ్ళతానని రవీందర్ ముందుకు వచ్చారు. ఆయన పాకిస్థాన్ వెళ్ళే ముందు ఉర్ధూ నేర్చుకుని, ముస్లిం మతం కూడా మార్చుకున్నారు.
అహమ్మద్ షాకీర్ పేరు పెట్టుకుని, పాకిస్థాన్ కు 1975 లో వెళ్ళారు. అక్కడి వారికి సందేహం రాకుండా ఉండేందుకు కరాచి యూనివర్శిటీలో ఎల్ఎల్బి చేశారు. ఆ తరువాత పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నత పదవిలో చేరారు. పాక్ మహిళ అమానత్ ను పెళ్లి చేసుకున్నారు. 1979 – 1983 వరకు విలువైన సమాచారాన్ని రా, మరియు ఇండియన్ ఆర్మీకి పంపించేవారు. పాకిస్థాన్ ఇండియాను దెబ్బ కొట్టాలనుకున్న ప్రతిసారి దేశానికి ముందుగా ఆ సమాచారం అందించి రక్షించేవారు.
అయితే మరొక రా ఏజెంట్ ఇన్యత్ మసిహా, పాకిస్తాన్ ఆర్మీ విచారణలో రవీందర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. దాంతో రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడ్డారు. అప్పటి నుంచి 16 ఏళ్ళ పాటు భారత్ సీక్రెట్స్ చెప్పమని రవీందర్ కౌశిక్ ను దారుణంగా హింసించారు. కాళ్ళకు, చేతులకు ఉన్న గోళ్ళను తొలగించి రక్తాలు వచ్చేలా సూదులతో గుచ్చేవారు. పళ్ళను రాయితో పగులగొట్టారు. ఇనుప శూలాలతో శరీరంలోని వివిధ భాగాలలో గ్రుచ్చి ఆయనకు నరకం చూపించారు.
ఎన్ని విధాలుగా హింసించినా దేశ భక్తుడైన రవీందర్ కౌశిక్ దేశ రహస్యం ఒక్కటి కూడా చెప్పలేదట. ఎప్పటికైనా భారత ప్రభుత్వం రక్షిస్తుందని ఎదురు చూసిన రవీందర్ కు క్షయ వ్యాధి వచ్చి, 1999లో జూలై 26న కన్నుమూశారు. ఆయనని ఆ జైలు వెనుక ఖననం చేసారని తెలుస్తోంది. ఆయన అందించిన సేవలకు గాను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా బ్లాక్ టైగర్ అని బిరుదును ఇచ్చింది.
బంగాళదుంపలతో ఫ్యాక్టరీలో చిప్స్ తయారు చేసే ప్రాసెస్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మార్కెట్ నుంచి తెచ్చిన బంగాళదుంపల సంచులు ఓపెన్ చేయడం నుంచి, చిప్స్ ప్యాకింగ్ వరకు మొత్తం ప్రాసెస్ ను చూపించారు. అనికైత్ లూత్రా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కార్మికులు బంగాళాదుంపల సంచులను మెషిన్లలో వేస్తుంటారు. అక్కడి నుంచి మరో మెషీన్ లోకి వెళ్లిన బంగాళాదుంపలు, నీటిలో శుభ్రమవుతాయి. ఆ తరువాత మరో మెషీన్ లోకి వెళ్లడంతో అక్కడ దుంపల తొక్కలు తొలగిపోతాయి. ఆ తరువాత చిప్స్ ఆకారంలో బంగాళాదుంపలను కట్ చేసి మరుగుతున్న వేడి నూనెలో వేస్తారు.
ఇలా రెడీ అయిన చిప్స్ ను చివరకు ప్యాకింగ్ దగ్గరకు వెళ్తాయి. అక్కడున్నవారు ఆ చిప్స్ ను ప్యాక్ చేసి, బాక్సులలో పెట్టి, షాప్స్ కు పంపించడానికి సిద్ధం చేస్తారు. ఈ వీడియో పై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో 6లక్షలకు పైగా లైక్‌లను పొందింది.
స్వాతంత్ర్య సమరంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ సహచరులను లాహోర్ కుట్రకేసులో ఈ జైలుకు ఖైదీలుగా తరలించారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం వివిధ ఉద్యమాలకు లీడర్ గా ఉన్నవారిని కూడా ఈ జైలులో ఖైదీలుగా ఉంచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వైశాల్యం పరంగా దేశంలో 4వ పెద్ద జైలు. ఇది 212 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 39.02 ఎకరాల్లో జైలు నిర్మించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విధంగా సెంట్రల్ జైలును నిర్మించారు.
ఈ జైలులో దాదాపు 3 వేల మంది ఖైదీలను ఉంచడానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. 2015లో ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలుని ఆధునీకరించారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడుతో ములాఖత్‌కు వెళ్ళిన ఆయన సతీమణి భువనేశ్వరి బయటికి వచ్చిన తరువాత ‘‘ఆయన నిర్మించిన బ్లాకులోనే ఆయనను ఖైదీగా ఉంచారు’’ అని వాపోయారు.
ఇక ఈ జైలులో చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖైదీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ జైలులో కొంతకాలం ఉన్నారు. అయితే, ఆయన సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఈ జైలులో కొద్ది రోజులు ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆదేశాలను ధిక్కరించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. ప్రకాశం పంతులు కూడా సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు.
