భారతదేశపు చరిత్రలో రాజుల గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. వారి సాహసాల గురించి, లేదా వారి ప్రేమ కథల గురించి చెప్పుకుంటారు. కానీ రాణుల గురించి మాత్రం చాలా తక్కువగా చెప్తారు. కాబట్టి మన దేశంలో ఉన్న రాణుల గురించి ఎక్కువగా తెలియదు. వారిలో ఈ పిఠాపురం రాణి కూడా ఒకరు. బీబీసీ తెలుగు కథనం ప్రకారం, పిఠాపురం చరిత్ర అనే ఒక పుస్తకాన్ని ర్యాలీ ప్రసాద్ అనే ఒక రచయిత రాశారు. అందులో రాణి సీతాదేవి గురించి కొన్ని వివరాలు రాశారు. 1935 లో రాణి సీతాదేవికి ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేకా వెంకయ్యప్పారావుతో వివాహం జరిగింది. వాళ్లకి ఒక కొడుకు ఉన్నాడు.
తన భర్తతో కలిసి సీతాదేవి రేస్ లకి వెళ్లేవారు. మరొక పక్క ప్రతాప్ సింగ్ గైక్వాడ్ బరోడాకి చెందిన మహారాజా. అప్పట్లో దేశంలో ఉన్న అత్యంత ధనవంతులలో ఆయన కూడా ఒకరు. గుర్రపు పందాలు అంటే ఎంతో ఇష్టం ఉన్న ప్రతాప్ సింగ్ గైక్వాడ్, ఒకసారి మద్రాస్ కి వెళ్లారు. అక్కడ ఒక రేస్ క్లబ్ దగ్గర సీతాదేవిని చూసి ప్రేమించారు. అప్పటికే సీతాదేవికి పెళ్లి జరిగి 7 సంవత్సరాలు అయ్యింది. అయినా కూడా ప్రతాప్ సింగ్ ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. రాణి సీతాదేవి కూడా ప్రతాప్ సింగ్ ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అక్కడే సమస్యలు మొదలు అయ్యాయి. రాజ్యంలోని నిబంధనలు వారి పెళ్లికి అడ్డుగా మారాయి. బరోడా సంస్థానం కట్టుబాట్ల ప్రకారం, మహారాజుల కుటుంబంలో రెండో వివాహం చేసుకోకూడదు.
అప్పటికే సీతాదేవికి మొదటి పెళ్లి అయ్యి ఉంది. దాంతో ప్రతాప్ సింగ్, సీతాదేవి మార్గాన్ని వెతకడం మొదలు పెట్టారు. ఏదో ఒకటి చేసి తమ పెళ్లి జరిగి తీరాలి అని అనుకున్నారు. అందుకే బరోడాలో పాటిస్తున్న హిందూ వివాహ చట్టం పరిధి నుండి తప్పించుకోవడానికి మతం మార్పిడి మాత్రమే ఒక మార్గం అని నిర్ణయించుకున్నారు. బరోడాలో ఉన్న న్యాయ నిపుణుల సహాయం తీసుకొని మతం మార్చుకోవాలి అనుకున్నారు. సీతాదేవి ఇస్లాం మతం స్వీకరించి, ఉయ్యూరు రాజావారి నుండి విడాకులు తీసుకొని, ఆ తర్వాత మళ్లీ హిందూ మతాన్ని స్వీకరించి, 1943 లో ప్రతాప్ సింగ్ ని పెళ్లి చేసుకున్నారు.
కానీ సీతాదేవి వివాహం మీద బ్రిటిష్ వైస్రాయ్ కూడా తమ అభ్యంతరాలని వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం మొదటి వివాహం రద్దు చేశారు. కాబట్టి రెండో వివాహానికి అడ్డంకులు ఉండవు. కానీ రాజులకి మాత్రం ఈ చట్టం వర్తించదు అని అన్నారు. ప్రతాప్ సింగ్ కి కూడా శాంతాదేవితో పెళ్లి జరిగి ఉంది. శాంతాదేవి ప్రతాప్ సింగ్ కి మొదటి భార్య. ఆ రాజ్యానికి వారసుడు ప్రతాప్ సింగ్ మొదటి భార్య కొడుకు అవుతాడు అనే ఒక నియమాన్ని పెట్టి, ఇదే షరతు మీద వారి రెండవ వివాహానికి అంగీకరించారు. కానీ సీతాదేవిని మహారాణి స్థానంలో గుర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఇష్టపడలేదు. అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఆ రాజ్యానికి మహారాణిని హర్ హైనెస్ అని పిలిచేవారు. కానీ సీతాదేవిని అలా పిలవకూడదు అనే ఒక నిర్ణయాన్ని జారీ చేశారు.
కానీ మరొక పక్క, సీతాదేవి గైక్వాడ్ కుటుంబంలోకి అడుగు పెట్టిన తర్వాత, ప్రతాప్ సింగ్ మొదటి భార్య శాంతాదేవికి, సీతాదేవికి పడలేదు అని అంటారు. ఇద్దరు మహారాణులు వేరు వేరు భవనాల్లో ఉండేవారు. శాంతాదేవి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో ఉండగా, సీతాదేవి మకరపుర ప్యాలెస్ లో నివసించారు. 1945 లో సీతాదేవికి, ప్రతాప్ సింగ్ కి ఒక కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయికి శాయాజీరావు గైక్వాడ్ అనే పేరు పెట్టారు. ఆ సంవత్సరంలోనే సీతాదేవి మొనాకోలో ఉన్న మోంటేకార్లోకి వలసకి వెళ్లారు. అక్కడ ఉన్నవారందరికీ విలాసవంతమైన జీవితం ఉండేది. ఆ తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో ఉన్న సంస్థానాలను ప్రభుత్వం విలీనం చేసుకుంది.
దాంతో సీతాదేవి అక్కడే ఉండిపోయారు. బరోడా సంస్థానం నుండి ఎన్నో నగలు, డబ్బు కూడా తీసుకొని వెళ్ళాడు. అయితే, ప్రతాప్ సింగ్ గైక్వాడ్ కూడా అక్కడే స్థిరపడ్డారు. అక్కడ విలాసవంతమైన జీవితం గడిపారు. 1951 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రతాప్ సింగ్ ని సంస్థానాధిపతి హోదా నుండి తొలగించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు ఆయన మొదటి భార్య అయిన శాంతాదేవి సంతానానికి దక్కుతాయి అని ఆదేశాలు జారీ చేశారు. దాంతో భారతదేశానికి రావాలి అని ప్రతాప్ సింగ్ నిర్ణయించుకున్నారు. అప్పుడు సీతాదేవితో విభేదాలు వచ్చాయి. దాంతో 1956 లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు.
సీతాదేవి ఇక్కడి నుండి మోనాకోకి డబ్బు, ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయారు. అందులో ఎన్నో విలువైన వజ్రాలు, ఆభరణాలు ఉన్నాయి. కానీ అవన్నీ భారతదేశానికి దక్కాల్సినవి. అవన్నీ సీతాదేవి తీసుకెళ్లిపోవడం వల్ల ఇండియాకి రావడం మీద సీతాదేవికి నియమాలు విధించారు. ఆ తర్వాత సీతాదేవి పారిస్ లో స్థిరపడ్డారు. తల్లితోనే ఉన్న శాయాజీరావు గైక్వాడ్ 1985 లో చనిపోయారు. తన ప్రాణాలు తనే తీసుకున్నారు. దాంతో సీతాదేవి బాధలోకి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 15వ తేదీ, 1989 లో సీతాదేవి చనిపోయారు. అలా అప్పట్లో సీతాదేవి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు.
ALSO READ : 39 ఏళ్ళ రామ్ చరణ్ కి తల్లిగా… 37 ఏళ్ళ హీరోయిన్..! ఇదెలా సాధ్యం..?