ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు లేవని తేల్చి చెప్పేశారు.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..

రాయదుర్గం టిక్కెట్ తనకు ఇవ్వలేమని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే తాను ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. వైసిపిని నమ్మి వచ్చినందుకు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోశారు అని అన్నారు. తన భార్య కాని కొడుకు కానీ రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని, తాను మాత్రం కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఐదేళ్లు తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను కలిసేందుకు కూడా సీఎం జగన్ ఇష్టపడకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరో చేసిన సర్వేల పేరుతో టిక్కెట్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.

ఉదయం నుంచి తాను వేచి ఉన్నప్పటికీ ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి ఈసారి టిక్కెట్ ఇవ్వలేమని చెప్పారు. తనను జగన్ నమ్మించి గొంతు కోశారని ఆయన మండి పడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నమ్మినందుకు తనకు మోసం చేశారనీ బాధ పడ్డారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు ముందు టిక్కెట్టు దక్కని మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఉంటున్నా

















రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్‌పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆమె రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము 25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న జార్ఖండ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్‌గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.
