ఐపీఎల్-2024 సీజన్ టీం ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వేలానికి ముందే ట్రేడింగ్ సంచలనంగా మారాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ ను 15 కోట్ల ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మరొక ప్లేయర్ తాజాగా ఫ్రాంచైజీ మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్లేయర్ మరెవరో కాదు దక్షిణాఫ్రికాను వికెట్ కీపర్కం బెటర్.. లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెన్ అయిన క్వింటన్ డికాక్.
డికాక్ ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి సన్‌రైజర్స్ కు ట్రేడ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్ కనబరచడంతో పాటు ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో దుమ్మురేపి తన సత్తా చాటాడు. మరొక సన్‌రైజర్స్ కు గత కొన్ని సీజన్ ల నుంచి సరియైన ఓపెనింగ్ పార్ట్నర్ లేకపోవడంతో ఈ స్టార్ ఓపెనర్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోందని సమాచారం.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో డికాక్ ను లక్నో 6.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ కి కూడా అతని రిటైన్ చేసుకుంటుంది.డికాక్.. ఇప్పటివరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా.. 20097 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతను టెస్ట్ , వన్డే మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2024 సంబంధించిన వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేడుకగా జరుగుతుంది. ఇందులో ఎందరు ఎన్ని స్థానాలు మారుతారో చూడాలి.