సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతుండడం తెలిసిందే. అయితే వీరితో పాటు ప్రముఖ క్రికెటర్ల చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత స్టార్ క్రికెటర్ చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మైదానంలోని ఆటకు మాత్రమే కాకుండా అతని వ్యక్తిత్వానికి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్ క్రికెటర్ గా ఎదిగారు. ఫార్మాట్ ఏదైనా సరే ఇంటర్నేషనల్ క్రికెట్లో పరుగులు వర్షం కురిపిస్తాడు. తన పరుగులతో రికార్డులను కొల్లగొట్టేస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తరువాత ఆ రేంజ్ లో పరుగులు చేస్తూ, సెంచరీలు కొడుతూ, అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆటలోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ తనకు తానే సాటి. ఈ క్రికెటర్ కి సామాజిక మధ్యమాలలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు. అభిమానులు ప్రేమగా కింగ్ కోహ్లీ అని పిలుచుకునే విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ 1988లో నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ హిందూ ఫ్యామిలిలో జన్మించాడు. తండ్రి పేరు ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్, తల్లి సరోజ్ కోహ్లి గృహిణి. విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. కోహ్లీ మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే క్రికెట్ పట్ల ఆసక్తిని ప్రదర్శించాడని తెలుస్తోంది. విరాట్ తండ్రి తన కుమారుడి ఆసక్తిని గమనించి, 1998 లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్చాడు. శిక్షణ పొందిన కోహ్లీ పట్టుదలతో అండర్-15 ఢిల్లీ జట్టులోకి ప్రవేశించాడు.
కోహ్లీ జూనియర్ క్రికెట్ కెరీర్ అక్టోబర్ 2002లో లుహ్ను క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన పాలీ ఉమ్రిగర్ మ్యాచ్‌లో ప్రారంభమైంది. అరంగేట్రం మ్యాచ్‌లో కోహ్లి మొత్తం పదిహేను పరుగులు చేయగలిగాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో, బీసీసీఐ నిర్వహించిన గేమ్‌లో 119 స్కోరుతో కోహ్లీ తన తొలి సెంచరీని సాధించాడు. ఆ సీజన్ ముగిసే సమయానికి, కోహ్లీ 78 సగటుతో మొత్తం 390 పరుగులు చేశాడు. అలా మొదలై, రన్‌మెషిన్ గా పేరుతెచ్చుకున్న కోహ్లీ తనదైన శైలిలో అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడు.
Also Read: కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

బుధవారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 76 పరుగులు సమర్పించుకున్నాడు. వరుసగా రెండవ గేమ్‌లో పవర్‌ప్లేలో వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. 9 ఓవర్లు బౌలింగ్‌లో చేసినప్పటికీ, ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాంతో మహ్మద్ షమీని, పక్కన పెట్టి మహ్మద్ సిరాజ్‌ను జట్టుకు సెలెక్ట్ చేసి, జట్టు మేనేజ్మెంట్ తప్పుచేసిందని సామాజిక మధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదే విషయం పై భారత మాజీ బౌలర్ శ్రీశాంత్ ఒక స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, “మ్యాచ్‌కు ముందు, అందరూ శార్దూల్ ఎందుకు ఆడుతున్నారు? అని అనడం మొదలుపెట్టారు. ఇక మ్యాచ్ ప్రారంభం అయిన తరువాత సిరాజ్ పరుగులిస్తుంటే, ఎందుకు సిరాజ్ ను ఆడిస్తున్నారు ? అని విమర్శలు చేస్తున్నారు. వీళ్ళంతా టోపీ మాస్టర్లు” అని అన్నారు.
అది మాత్రమే కాకుండా “కెమెరాలు మళ్ళీ మళ్ళీ మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ లపై ఫోకస్ చేసి, చూపిస్తూనే ఉండటం అనేది దేనిని సూచిస్తోంది. మన మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసిన జట్టుకు మనం అందరూ అండగా నిలవాలి కదా’’ అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఒక మార్పుతో ఆడిన విషయం తెలిసిందే.


















ప్రపంచకప్ 2023 మెగాటోర్నీలో రెండవ విజయాన్ని సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసింది. 345 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాక్, ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి, 6 వికెట్ల తేడాతో అవలీలగా విజయభేరి మోగించింది. దీంతో 48 సంవత్సరాల వన్డే ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పాకిస్థాన్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు ఇంతకుముందు ఐర్లాండ్ జట్టు పేరు మీద ఉండేది.
అయితే ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ అయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి ఈ మ్యాచ్ లో దారుణ ప్రదర్శన కంటిన్యూ చేశాడు. ఈ టోర్నీ ప్రారంభం కాకముందు బాబర్ టాప్ స్కోరర్ గా నిలిస్తాడని కామెంట్లు వినిపించాయి. అయితే వన్డే ప్రపంచకప్-2023లో నెదర్లాండ్స్ బాబర్ పై 5 రన్స్ మాత్రమే చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గత నాలుగు మ్యాచ్‌ల నుండి బాబర్ సరిగ్గా ఆడలేదు. గత 5 మ్యాచ్‌ల్లో బాబర్ 71 పరుగులు మాత్రమే చేశాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బాబర్ ప్రదర్శన పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. “వార్మప్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడటం కాదు. ముఖ్యమైన టోర్నీలో ఆడాలని” కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో కెప్టెన్ బాబర్ చెలరేగి ఆడాడు. అయితే మెగా టోర్నీలో దానికి భిన్నంగా ఉంది.




ఆస్ట్రేలియాతో ఆదివారం నాడు జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆరంభంలోనే వరుసగా ముగ్గురు పరుగులు ఏమి చేయకుండానే అవుట్ అయ్యారు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లి 85 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 97 నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన రాహుల్, మూడు పరుగుల తేడాతో శతకాన్ని చేసే ఛాన్స్ ను కోల్పోయాడు.
విన్నింగ్ షాట్ తరువాత ఒక్కసారిగా రాహుల్ కింద కూర్చున్నాడు. ఫోర్ వెళ్తుందనుకున్న షాట్, సిక్స్ వెళ్లడంతో తనలో తానే నవ్వుకున్నాడు. అదే సమయంలో రాహుల్ ఫేస్ లో సెంచరీ కోల్పోయాను అనే బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ తరువాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకునే సందర్భంగా రాహుల్ సెంచరీ మిస్ అవడం పై మాట్లాడుతూ, నిజానికి సెంచరీ తన ప్రణాళికలో ఉందని, సెంచరీని పూర్తి ఎలా చేయాలనేది ఆలోచించాను.
ముందు బౌండరీ, ఆ తరువాత సిక్సర్‌తో సెంచరీ సాధ్యపడుతుందని భావించానని, అయితే మొదటిదే సిక్సర్‌గా వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ కావడానికి కారణం హార్దిక్ పాండ్యా అని నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ సిక్స్ కొట్టకకుండా ఉంటే రాహుల్ సులభంగా సెంచరీ చేసేవాడని కామెంట్స్ చేస్తున్నారు. పాండ్యా మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు తిలక్ వర్మ విషయంలో కూడా ఇలానే చేశాడని, ఐపీఎల్లో ఇలాంటివి చాలాసార్లు చేశాడని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇండియన్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పేరు గరిమా భరద్వాజ్. ఆమె ప్రముఖ జర్నలిస్ట్ మరియు న్యూస్ యాంకర్. యశస్వి జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత గరిమా వైరల్‌గా మారింది. దాంతో ఆమె ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె ప్రస్తుతం ‘ది లలన్‌టాప్’ అనే పాపులర్ షోలో పని చేస్తుంది.
ఆమె సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. అంతకు ముందు దైనిక్ జాగరణ్, పాఠక్ పత్రిక, ఇండియా న్యూస్‌లతో పాటు అనేక మీడియా సంస్థలకు పనిచేసింది. గరిమా భరద్వాజ్ 1998లో ఢిల్లీలో జన్మించింది. అక్కడే పెరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమె మోతీ రామ్ మెమోరియల్ గ్రిల్స్ సీనియర్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఆమె బాచిలర్స్ ఇన్ జర్నలిజంని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో చేశారు. ఆ తర్వాత జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టింది.
డిల్లీలో నివసిస్తున్న గరిమా భరద్వాజ్ 2021 ఆగస్ట్ నుండి ‘ది లలన్‌టాప్’ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గరిమా భరద్వాజ్ యశస్వీ జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగారు. ప్రస్తుతం ఆమెను 50 వేలకు పైగా ఫాలో అవుతున్నారు.


13వ ఎడిషన్ వన్డే ప్రపంచ కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు కొందరు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. మిగతా ఆటగాళ్లు బుధవారం రానున్నారు. వీసాలు ఆలస్యం కావడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రపంచ కప్ లో పాల్గొనడానికి వచ్చే జట్లకు కావాల్సిన వసతిని బీసీసీఐ అధికారులు ఏర్పాటు చేశారు.
వన్డే ప్రపంచ కప్ టోర్నీలో 10 జట్లు పోటీపడబోతున్నాయి. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు వారి జట్లని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీల విశేషాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలా 2011 వరల్డ్ కప్ లో 2 సార్లు టాస్ వేసారనే విషయం వార్తల్లో నిలిచింది.
2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంకను ఓడించి రెండవ వన్డే వరల్డ్ కప్ ను సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అయితే ఫైనల్ మ్యాచ్ కి రిఫరీగా ఉన్న జెఫ్ క్రోనీ, టాస్ వేసే సమయంలో శ్రీలంక సారధి సంగర్కర హెడ్ అని చెప్పగా, ఫ్యాన్స్ అరుపుల వల్ల అది వినలేకపోయాడు. హెడ్ పడడంతో టాస్ గెలిచిన సంగర్కర, బ్యాటింగ్ ఎంచుకుంటానని అన్నారట.
కానీ రిఫరీ జెఫ్ క్రోనీ, సంగర్కర చెప్పింది వినబడలేదని, రెండవసారి టాస్ వేయాల్సిందిగా చెప్పారంట. అందుకు భారత కెప్టెన్ ధోనీ కూడా అంగీకరించడంతో రెండోసారి టాస్ వేశారు. అప్పుడు కూడా సంగర్కర హెడ్ అని చెప్పగా, హెడ్ పడడంతో శ్రీలంక టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంకను ఓడించి, 28 సంవత్సరాల తర్వాత వన్డే ప్రపంచ కప్ సాధించింది.