ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఓటమికి భారత జట్టు బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యమే కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ ముందు భారత జట్టుకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్ మెన్ కె.ఎల్. రాహుల్ ఆల్ రౌండర్ జడేజా కూడా గాయాలు కారణంగా టీం కి దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో వైజాగ్ లో జరిగే మ్యాచ్ కి సర్ఫరాజ్ ఖాన్,సౌరభ్ తివారి, వాషింగ్టన్ సుందర్ లకు పిలుపు వచ్చింది. అయితే భారత మేనేజ్మెంట్ ఆఖరి మూడు మ్యాచ్‌లు కూడా టీం ను ప్రకటించే ఆలోచనలో ఉంది.
అయితే ఈ నేపథ్యంలో ఆఖరి మూడు మ్యాచ్‌లకు కింగ్ కోహ్లీ రీయంట్రీ ఇస్తాడా లేదా అనేది సందేహంగా మారింది. టీంలో ఎంపికైనప్పటికీ తొలి రెండు మ్యాచ్‌లకి కోహ్లీ వ్యక్తిగత కారణాలవల్ల దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే కొందరు రోహిత్ తో విభేదాలు కారణంగానే టీం కి దూరమయ్యాడు అని అంటుంటే బీసీసీఐ వాటిని కొట్టి పడేసింది. మరో పక్క తన భార్య అనుష్కకి అనారోగ్యం కారణంగా తన వద్ద ఉండేందుకే కోహ్లీ విరామం తీసుకున్నాడని అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆఖరి మూడు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులోకి రాకపోతే భారత టీమ్ కి తిప్పలు తప్పవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.