ఐపీఎల్ మ్యాచ్‌లు అన్నీ కూడా హోరాహోరీగా జరుగుతూ ఉంటాయి. అభిమానులు కూడా తమకి నచ్చిన టీం ని ప్రోత్సహిస్తూ ఉంటారు. పైగా ఐపీఎల్ మ్యాచ్ వస్తే సమయమే తెలియదు. అంతా టీవీ ముందే కూర్చుంటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ కోసం అన్ని టీములు కూడా తయారవుతున్నాయి.
అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పలు విషయాలపై ఇప్పటి నుంచి ఆలోచన చేస్తోంది. ప్లేయింగ్ 11 లో ఎవరెవరు తీసుకోవాలి..? అనే దాని మీద దృష్టి పెట్టింది.
దీనికోసం హెడ్ కోచ్ హెస్సెన్ ఒక సెషన్ ని కూడా ఏర్పాటు చేశారు. దీనిలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఇచ్చారు. అలానే ఈసారి జట్టు బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా చర్చించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పదవి నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎవరికి కెప్టెన్సీ బాధ్యత ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
దీనికి సంబంధించిన ఒక వీడియోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే జట్టు కెప్టెన్ గా డుప్లెసిస్‌ను నియమించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. థింక్ ట్యాంక్స్ అందరూ కూడా డుప్లెసిస్ కెప్టెన్ గా ఉంటే మంచిదని అంటున్నారు. అలాగే అతని ఎక్స్పీరియన్స్ కూడా జట్టు కి ఉపయోగపడుతుందని చెప్పారు.
విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, మహమ్మద్ సిరాజ్ తో పాటు ఎనిమిది మంది ప్లేయర్స్ ని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఆడిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ డుప్లెసిస్‌ను ఈ టీం లోకి తీసుకున్నారు. అయితే టీ20, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఎక్స్పీరియన్స్ డుప్లెసిస్ కి ఉంది కాబట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బాధ్యతలు ఈ ఆటగాడికి అప్పగించాలని అనుకుంటున్నారు.