IPL 2022 ఆక్షన్‌లో “షకీబ్ అల్ హసన్”ని అందుకే తీసుకోలేదా.? అలా చేస్తే దేశ ద్రోహి అనేవారా.?

IPL 2022 ఆక్షన్‌లో “షకీబ్ అల్ హసన్”ని అందుకే తీసుకోలేదా.? అలా చేస్తే దేశ ద్రోహి అనేవారా.?

by Mohana Priya

Ads

బెంగళూరు వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ టీమ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కొనుగోలు అవ్వలేదు. ఐపీఎల్ ఆక్షన్ లో షకీబ్ అల్ హసన్ బేస్ ధర 2 కోట్లు కాగా, అదే ధరతో ఈ ఆక్షన్ లో 12 మంది ప్లేయర్లు ఉన్నారు. వారిలో షకీబ్ అల్ హసన్ కూడా ఉన్నారు.

Video Advertisement

అద్భుతమైన బ్యాటింగ్ మరియు స్పిన్ బౌలింగ్ నైపుణ్యంతోపాటు ఎంతో అనుభవం ఉన్న షకీబ్‌ని ఎంపిక చేయకపోవడం చాలా మంది అభిమానులకు చర్చనీయాంశమైన అంశంగా మారింది.

shakib al hasan wife responds on ipl 2022 auction

ఇప్పటివరకు షకీబ్ అల్ హసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆడిన 71 మ్యాచ్ లలో, 19.8 యావరేజ్ తో, 124.5 స్ట్రైక్ రేట్‌తో 793 పరుగులు చేశారు. అలాగే 7.43 ఎకానమీతో 29.2 యావరేజ్ తో 63 ఐపీఎల్ వికెట్లు తీశారు. ఈ విషయంపై షకీబ్ అల్ హసన్ భార్య స్పందించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన షకీబ్ అల్ హసన్ భార్య ఉమ్మె అహ్మద్ శిశిర్ ఈ విధంగా అన్నారు.

shakib al hasan wife responds on ipl 2022 auction

 

ఉమ్మె అహ్మద్ శిశిర్ రాసిన పోస్ట్ లో “షకీబ్ అల్ హసన్ పూర్తి సీజన్‌కి అందుబాటులో ఉండగలిగితే, రెండు జట్లు తనని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాయి. కానీ శ్రీలంక సిరీస్ కారణంగా పూర్తి సీజన్ అందుబాటులో ఉండలేరు. దాంతో ఇలా జరిగింది. ఇది ఏమి ముగిసిపోయినట్టు కాదు. వచ్చే సంవత్సరం మళ్లీ ఆడతారు. ఒకవేళ షకీబ్ అల్ హసన్ ఐపీఎల్ లో ఆడాలి అంటే శ్రీలంక సిరీస్‌ని దాటి వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే చేసి ఉంటే మీరు ఈ పాటికి మీరు దేశద్రోహి అని నిందలు వేసేవారు కదా” అని అన్నారు


End of Article

You may also like