గాయంతో బాధపడుతున్నా కూడా… “జోఫ్రా ఆర్చర్‌”ని MI కొనుగోలు చేయడానికి కారణం అదేనా..?

గాయంతో బాధపడుతున్నా కూడా… “జోఫ్రా ఆర్చర్‌”ని MI కొనుగోలు చేయడానికి కారణం అదేనా..?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్నక్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది. ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇటీవల ఐపీఎల్ ఆక్షన్ జరుగుతోంది.

Video Advertisement

ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్లని చాలా జట్లు బిడ్ చేశారు. డేవిడ్ వార్నర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తీసుకున్నారు. ఈ ఐపీఎల్ 2022 వేలంలో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్‌ని ముంబై ఇండియన్స్ జట్టు 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నారు.

reason behind mumbai indians choosing jofra archer

దాంతో, “గాయంతో బాధపడుతున్న ప్లేయర్‌కి అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనడం అవసరమా?” అని కామెంట్స్ మొదలయ్యాయి. ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ స్పందించారు. ఆకాశ్ అంబానీ ఈ విషయంపై మాట్లాడుతూ, “ఆర్చర్ గాయంతో బాధపడుతున్నారు అనే విషయం తెలుసు” అని అన్నారు. అలాగే, “ఒకసారి ఆర్చర్ గాయం నుండి కోలుకున్న తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన తర్వాత జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చూస్తూ ఉంటే వారిద్దరినీ ఎదుర్కోవడం ప్రత్యర్థులకి చాలా కష్టమవుతుంది. ఇదంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని” చెప్పారు.

reason behind mumbai indians choosing jofra archer

అంతే కాకుండా, సింగపూర్ ప్లేయర్ అయిన టిమ్ డేవిడ్ ని 8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేయడంపై కూడా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, “గత రెండు సంవత్సరాలుగా టిమ్ డేవిడ్ గురించి చర్చిస్తున్నాం. అతని ఆటతీరును గమనిస్తున్నాం. ఐసిసి సభ్యదేశాల జట్లపై డేవిడ్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించారు. గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున కూడా ఆడారు. అతని నైపుణ్యం పై మాకు ఎటువంటి సందేహం లేదు. హార్దిక్ పాండ్యా మా జట్టులో లేకపోవడంతో అతని ఎవరో ఒకరు భర్తీ చేయవలసి ఉంది, అందుకే ఆ స్థానంలో టిమ్ డేవిడ్ సరిపోతారు అని భావించాం” అని అన్నారు.


End of Article

You may also like