IPL 2022 “ఆక్షన్”లో SRH మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద తప్పు ఇదేనా..?

IPL 2022 “ఆక్షన్”లో SRH మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద తప్పు ఇదేనా..?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్నక్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది. ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇటీవల ఐపీఎల్ ఆక్షన్ జరుగుతోంది.

Video Advertisement

ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్లని చాలా జట్లు బిడ్ చేశారు. డేవిడ్ వార్నర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తీసుకున్నారు. డేవిడ్ వార్నర్ చెన్నై సూపర్ కింగ్స్ కి కానీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కానీ కొనుగోలు చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి వార్నర్ ఆడబోతున్నారు.

mistake by srh management in ipl 2022 mega auction

ఇదిలా ఉండగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారిలో కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, రొమార్కో జాన్స్‌ఫెండ్, రొమార్కో జాన్‌సెండ్ అబాట్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ ఉన్నారు.

mistake by srh management in ipl 2022 mega auction

మొదటి రోజు చేసిన తప్పులని జట్టు యాజమాన్యం రెండో రోజు సరిదిద్దుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ రెండో రోజు వేలంలో కూడా అలాంటి పొరపాట్లే మళ్లీ చేశారు. మేనేజ్‌మెంట్ సెలెక్ట్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది బౌలర్లు ఉన్నారు. విలియమ్సన్, మాక్రమ్‌ తప్ప అంత పెద్ద చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ ఎవరు జట్టులో లేరు. దాంతో ఈసారి కూడా జట్టు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేటట్టు ఉంది అని అంటూ సోషల్ మీడియాలో యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తున్నారు.


End of Article

You may also like