ప్రతి ఆదివారం సాయంత్రం ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ స్వరాభిషేకం. ఈ ప్రోగ్రాంలో ఎంతో మంది గాయకులు వచ్చి వాళ్లు పాడిన పాటలు మాత్రమే కాకుండా ఇతర గాయకులు పాడిన పాటలని కూడా పాడతారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి వారం ఒక దర్శకుడు, లేదా సంగీత దర్శకులు, లేదా నిర్మాత, హీరో, హీరోయిన్ గాయకులు, ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన పాటలను పాడతారు.
స్వరాభిషేకం ప్రోగ్రాంలో మనకి ఎక్కువగా కనిపించే సింగర్స్ హేమచంద్ర, కారుణ్య, రమ్య బెహరా, సత్య యామిని, సాహితి చాగంటి, ఎస్పీ చరణ్, సునీత, చిత్ర, దీపు. అయితే స్వరాభిషేకంలో వచ్చే ఆదివారం రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని ఈటీవీ వాళ్ళు యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో సింగర్స్ అందరూ దర్శకుడు బి.గోపాల్ గారి పాటలు పాడుతున్నారు.
అయితే ఎస్పీ చరణ్, సునీత కలిసి బి.గోపాల్ గారి దర్శకత్వంలో వచ్చిన వెంకటేష్, దివ్య భారతి కలిసి నటించిన, బొబ్బిలి రాజా సినిమాలోని “కన్యాకుమారి కనబడదా దారి” పాట పాడుతున్నారు. అయితే ఈ పాట పాడుతున్నప్పుడు మధ్యలో ఒక చోట ఎస్పీ చరణ్ “సునీతా..!” అని గట్టిగా అన్నారు.
అలా సీరియస్ గా పాట పాడుతూ మధ్యలో అలా గట్టిగా అనేటప్పటికి ఎస్పీ చరణ్ తో కలిసి పాట పాడుతున్న సునీత తో పాటు, ప్రేక్షకుల్లో కూర్చొని చూస్తున్న సింగర్ కల్పన గారు, ఇంకా చిత్ర గారు కూడా గట్టిగా నవ్వేశారు. ఇలా జరగడం స్వరాభిషేకంలో చాలా అరుదు. అయితే ఈ ఎపిసోడ్ లో బలపం పట్టి భామ వొళ్ళో, తో పాటు, స్వాతి ముత్య మాల, బాలయ్య బాలయ్య, గురువా గురువా తో పాటు ఇంకా కొన్ని పాటలను పాడుతున్నట్టు మనకి ప్రోమోలో కనిపిస్తుంది.
watch video:
To play the video, please click on “WATCH ON YOUTUBE”