ప్రస్తుతం ఈ సంవత్సరం ఐపీఎల్ నడుస్తోంది. కప్ ఏ జట్టు గెలుస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, గుజరాత్ టైటాన్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరుగుతోంది.
ఇదిలా ఉండగా డాట్ బాల్స్ చూపిస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఒక గ్రీన్ కలర్ ఓ (O) అక్షరం కనిపిస్తోంది. అలాగే డాట్ బాల్స్ చూపించేటప్పుడు బాల్స్ బదులు చెట్టు సింబల్ చూపిస్తున్నారు. ఇది చూసిన చాలా మంది దీని వెనుక కథ ఏంటి అనుకుంటున్నారు.

అసలు విషయం ఏంటంటే బీసీసీఐ సంస్థ ఈ సంవత్సరం జరిగే ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లలో బౌల్ చేసిన ఒక్కొక్క డాట్ బాల్ కి 500 చెట్లని నాటుతోంది. అందుకే దానికి సంకేతంగా ఇలా చెట్టు బొమ్మని చూపిస్తున్నారు. ఇది తెలుసుకున్న చాలామంది బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో 15 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.

మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 172 పరుగులు చేసింది. ఆ తర్వాత గుజరాత్ జట్టు 157 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. గుజరాత్ జట్టుని చెన్నై ఓడించడం ఇదే మొదటి సారి. గతంలో గుజరాత్ చేతిలో చెన్నై మూడుసార్లు ఓడిపోయింది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఓడిపోయినా కూడా ఫైనల్ కి చేరెందుకు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడడం ద్వారా మరొక ఛాన్స్ దక్కించుకుంది.

అయితే ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ పై ఎన్నో రకమైన విమర్శలు కూడా వస్తున్నాయి. ధోనికి, అంపైర్లకి మధ్య జరిగిన చర్చ గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ చర్చ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వైరల్ టాపిక్ గా మారింది. కొంత మంది ధోనికి మద్దతుగా మాట్లాడుతుంటే, కొంత మంది అలా ఎందుకు జరిగింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఇవాళ లక్నో సూపర్ జైయింట్స్ జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరగబోతోంది.































ప్రతి సీజన్ లాగే ఈ ఐపీఎల్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఒకరు యశస్వి జైస్వాల్. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. యశస్వి తన బ్యాటింగ్ తో సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బక్క పల్చగా ఉండే యశస్వి కొడుతున్న సిక్సర్లు చూసి ఆడియెన్స్ అవాక్కవుతున్నారని చెప్పవచ్చు. ఆడే ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ గా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. దేశవాళి క్రికెట్ లో వలె ఐపీఎల్ లో కూడా తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను, మాజీ క్రికెటర్లను ఆకర్షించాడు. రీసెంట్ గా ఆడిన మ్యాచ్లో 98 రన్స్ చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో అతను వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి, తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే అది క్రికెట్కు సంబంధించిన విషయంలో కాదు.
యశస్వి జైస్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ సినిమాలోని బాలనటుడిని పోలి ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విక్రమార్కుడు సినిమాలో ఒక బాల నటుడు హీరో రవితేజతో కలిసి ఒక సన్నివేశంలో నటించాడు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.




