‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత తన కృషి, పట్టుదలతో క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలకు దూరమవుతుంటారు. కానీ సమంత పెళ్లి తర్వాత కూడా ప్రాధాన్యమున్న చిత్రాలు చేసింది. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సామ్.. ఆ తర్వాత తనకు మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందంటూ ప్రకటించి ఫాన్స్ ని షాక్ కి గురి చేసింది.
తాజాగా యశోద చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సామ్. త్వరలో ఖుషి, శాకుంతలం చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనుంది. తాజాగా విడుదలైన శాకుంతలం ట్రైలర్ తో సామ్ అందరి మనసులు గెలుచుకుంది. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సమంత మంచు వంటి తెల్లటి చీర ధరించి వచ్చారు. చాలా కాలం తర్వాత సామ్ బయటకు రావడం తో ఫాన్స్ హ్యాపీ గా ఫీల్ అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో సమంత చేతిలో ఉన్న తులసి జపమాల అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే సామ్ మయోసైటిస్ ట్రీట్మెంట్తో పాటు మానసిక ప్రశాంత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రోజు 10 ,008 శ్లోకాలు జపిస్తూ సమంత ప్రత్యేక జపం చేస్తోందట. అందుకే ఎక్కడికి వెళ్లిన వెంట జపమాల కంపల్సరిగా మారిందని తెలుస్తోంది. అలాగే మనశాంతి కోసం తెల్లటి దుస్తులే ధరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆహార్యంలోనే సమంత ఎయిర్పోర్ట్ లోను, ట్రైలర్ ఈవెంట్ లో కూడా కనిపించారు.
చైతో విడిపోయిన తరువాత తన స్నేహితులతో కలిసి ఆధ్మాత్మక యాత్రకు వెళ్లిన సమంత అప్పటి నుంచి హిందూ శ్లోకాలని పఠిస్తూ మనశ్శాంతిని ఆయురారోగ్యాలని ప్రసాదించమని జపం చేస్తున్నదని ఇన్ సైడ్ టాక్. ఆ కారణంగానే నిత్యం తన వెంట జపమాలని పెట్టుకుంటోందట. సాధారణంగా తులసిమాల వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనసు కూడా ప్రశాంతంగా అంటుందని చాలామంది నమ్ముతారు. దీంతో సమంత కూడా ఆ తులసి జపమాల ఆరోగ్యం కోసం, చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉండటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి, నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండటానికి చుట్టుకున్నట్టు తెలుస్తుంది.