Ads
ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు.
Video Advertisement
అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.ఇక నామినేషన్స్ ప్రక్రియ ప్రతి సీజన్ నుంచి వస్తున్నదే. ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు.ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి ఎలిమినేషన్ లో భాగంగా సరయు ఇంటి నుండి బయటికి వెళ్లిపోయారు. రెండవ ఎలిమినేషన్ లో ఉమా దేవి, మూడవ ఎలిమినేషన్ లో లహరి ఎలిమినేట్ అయ్యారు. వీరి ముగ్గురి ఎలిమినేషన్ కూడా ఆడియన్స్ ఎవరూ ఊహించలేదు.
వీళ్ళ ముగ్గురు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. కాబట్టి ఇంకా చాలా వారాలు వీళ్లు ఇంట్లో ఉంటారు అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ వీళ్ళు ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ కి మాత్రమే కాకుండా హౌస్ మేట్స్ కి కూడా షాకింగ్ గా అనిపించింది. అయితే వీరు ముగ్గురు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కామన్ గా చెప్పిన విషయం ఒకటే. షణ్ముఖ్ జస్వంత్, సిరి చాలా క్లోజ్ గా ఉంటున్నారు అని, షణ్ముఖ్ తన ఆట తాను ఆడట్లేదు అని చెప్పారు.
మొన్న ఎలిమినేట్ అయిన లహరి కూడా, “సిరి నన్ను నామినేట్ చేసింది అని, నువ్వు నన్ను నామినేట్ చేసావని” షణ్ముఖ్ తో అన్నారు. అందుకు షణ్ముఖ్ “అందుకే నువ్వు అక్కడున్నావు. నేను ఇక్కడ ఉన్నాను” అని అన్నారు. ఇలా ముగ్గురు ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు ఒకటే మాట చెప్పడం గమనార్హం. జరిగేది అంతా ఎడిటింగ్ లో కట్ అయ్యి కొన్ని విషయాలు మాత్రమే మనకి టెలికాస్ట్ చేస్తున్న ఎపిసోడ్ లో చూపిస్తున్నారు. దాంతో మనకి టీవీలో ఇవన్నీ చూపించడం లేదు ఏంటి? ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు చెప్తున్న మాటలు నిజమేనా అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది.
End of Article