పెళ్లి ఖర్చులు తగ్గించడానికి ఈ జంట ఏం చేశారో తెలిస్తే…హ్యాట్సాఫ్ అనాల్సిందే.!

పెళ్లి ఖర్చులు తగ్గించడానికి ఈ జంట ఏం చేశారో తెలిస్తే…హ్యాట్సాఫ్ అనాల్సిందే.!

by Mohana Priya

Ads

సాధారణంగా మన భారతదేశంలో పెళ్లిళ్లు అంటే ఎంత ఖర్చు పెడతారో మనందరికీ తెలుసు. పెళ్లి మండపం అని, లేదా వాళ్ళు ధరించే బట్టలకి కానీ, నగలకు కానీ, ఇంకా ఇతర ఏర్పాట్లకు కానీ చాలా ఖర్చవుతుంది. కొంత మంది కోట్లు ఖర్చు చేస్తే, కొంత మంది లక్షల్లో ఖర్చు చేస్తారు. చాలా మంది అయితే అప్పు చేసి అయినా సరే పెళ్లి చేసుకుంటారు. కానీ కొంత మంది మాత్రం ఇందుకు భిన్నంగా అసలు ఎక్కువ ఖర్చు పెట్టకుండా పెళ్లి చేసుకుంటారు.

Video Advertisement

couple got married with 500 rupees

 

వారు “ఎప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి ఈవెంట్ కి అంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా?” అని అనుకుంటారు. అయితే ఇటీవల ఒక జంట ఇలాగే చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. “అందులో పెద్ద వింతేముంది?” అని అనుకోకండి. వారు కేవలం 500 రూపాయలతో పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని ధార్ సిటీ మెజిస్ట్రేట్ శివాంగీ జోషి అలాగే లడక్ లో పనిచేస్తున్న ఇండియన్ ఆర్మీ మేజర్ అంకిత్ చతుర్వేది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.

couple got married with 500 rupees

 

శివాంగీ జోషి కోవిడ్ బాధ్యతల్లో ఉండటం వల్ల పెళ్లి వాయిదా పడింది. దాంతో వారిద్దరూ సింపుల్ గా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇలా ఎలాంటి హంగులు లేకుండా పెళ్లి చేసుకొని ప్రజలందరికీ ఒక సందేశం ఇవ్వాలి అనేది వారి ఉద్దేశం. దాంతో వాళ్ళిద్దరూ సోమవారం కోర్టులో 500 రూపాయలు డిపాజిట్ చేసి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు.

couple got married with 500 rupees

వారి పెళ్లికి వారి ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ ఆలోక్ కుమార్ సింగ్, ఏడిఎం సలోని సిదానా, తదితర సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాంగీ మాట్లాడుతూ, వారికి పెళ్లి కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేదు అని, అందుకే ఇలా పెళ్లి చేసుకున్నారు అని చెప్పారు.

అంతే కాకుండా పెళ్లి ఖర్చులు అమ్మాయి కుటుంబాన్ని ఎంత ఒత్తిడికి గురి చేస్తాయో తెలుసు అని, అంతే కాకుండా ఇలా డబ్బులు ఖర్చు చేస్తే కష్టపడి సంపాదించిన డబ్బుని అనవసర ఖర్చులకు ఉపయోగించినట్టు అవుతుంది అని అన్నారు. తర్వాత వీరిద్దరూ ధారేశ్వర ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నారు.


End of Article

You may also like