బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ జశ్వంత్ అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆఖరి వరకు కూడా ఉండి అలరించాడు. షన్ను, దీప్తి సునైనా తో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది.
అదే విధంగా సిరి శ్రీహాన్ తో రిలేషన్ షిప్ లో ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇద్దరు హౌస్ లో ఎంతో క్లోజ్ గా ఉన్నారు. అయితే షన్ను, సిరి బాగా క్లోజ్ గా ఉండడం వల్ల దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మధ్య బ్రేకప్ జరిగేటట్టు కనబడుతోంది.

షణ్ముఖ్ బాగా ఎమోషనల్ గా సిరి తో కనెక్ట్ అవ్వడం, ఎక్కువగా హగ్స్ ఇచ్చుకోవడం గురించి తెలిసిందే. అయితే వీటన్నిటినీ ఉద్దేశించి కొద్ది రోజుల నుండి దీప్తి సునైనా వరుసగా పోస్టులు చేస్తోంది. అవి నెట్టింట వైరల్ గా మారాయి. హౌస్ నుండి వచ్చిన తర్వాత దీప్తి తనని బ్లాక్ చేసింది అని చెప్పాడు షన్ను. షణ్ముఖ్ పై దీప్తి కోపంగా ఉన్నట్లు ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇటీవల షణ్ముఖ గురించి దీప్తి సునయన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేసింది. ఇక దాని గురించి చూస్తే.. ”మారడం అసౌకర్యంగా ఉంది కానీ తప్పదు” (Change is uncomfortable but necessary) అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది దీప్తి. ఇది చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
https://www.facebook.com/photo.php?fbid=477791167049063&set=a.275858450575670&type=3
