చిరంజీవికి ఆయన సతీమణి సురేఖకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? ఎవరు ఎంత పెద్ద అంటే.?

చిరంజీవికి ఆయన సతీమణి సురేఖకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? ఎవరు ఎంత పెద్ద అంటే.?

by kavitha

Ads

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డ్ ను ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి మరియు గవర్నర్, పలువురు మంత్రుల నుండి ప్రశంసలు అందుకున్నారు.

Video Advertisement

ఆదివారం నాడు ఆయన సతీమణి సురేఖ బర్త్ డే (ఫిబ్రవరి 18) ) సందర్భంగా ఆమెకు అందమైన కవితతో బర్త్‌ డే విషెస్‌ ను తెలుపుతూ, ఒక ఫోటో షేర్ చేశారు. ఆ పోస్ట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించిన వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలలో నటిస్తూ, అలరిస్తున్నారు. కొన్ని దశాబ్దాల నుండి తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోగా రాణిస్తూ, ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పర్చుకున్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగారు. చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న క్రమంలోనే లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అన్యోన్య దంపతులలో చిరంజీవి, సురేఖ దంపతులు తొలి వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఈ జంటకు ముగ్గురు సంతానం. కుమారుడు రామ్ చరణ్, ఇద్దరు అమ్మాయిలు సుస్మిత, శ్రీజ. సురేఖ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అయినప్పటికీ  మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎంత అభిమానిస్తారో, ఆయన సతీమణిని అంతే గౌరవిస్తారు. ఎక్కువగా బయట కనిపించని సురేఖ, అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలకు  హాజరవుతుంటారు.

తాజాగా ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్  గురించి సోషల్ మీడియాలోవైరల్ గా మారింది.  వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసుకోవడానికి  మెగా ఫ్యాన్స్ నెట్టింట్లో వెతికారట. వీరి వివాహం 1980లో జరిగింది. అప్పటికీ చిరంజీవి వయసు 25 ఏళ్ళు ఉండగా, సురేఖ ఏజ్ 22  సంవత్సరాలు. అంటే చిరంజీవి, సురేఖ ఏజ్ గ్యాప్ 3 ఏళ్ళు. చిరంజీవి 1955లో ఆగస్టు 22న జన్మించగా, సురేఖ 1958లో ఫిబ్రవరి 18న జన్మించారు. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read: “శాకుంతలం”లో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?


End of Article

You may also like