ఉన్నట్లుండి చెమటలు ఎక్కువగా పడుతున్నాయా..? అది దేనికి సంకేతమో తెలుసా..?

ఉన్నట్లుండి చెమటలు ఎక్కువగా పడుతున్నాయా..? అది దేనికి సంకేతమో తెలుసా..?

by Anudeep

Ads

చెమట పట్టడం అనేది సర్వ సాధారణం. అయితే.. మాములుగా పట్టే చెమటల కంటే ఎక్కువగా మితిమీరి చెమటలు పడుతుంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. చిన్నపిల్లలు, పెద్ద వాళ్ళ సంగతి పక్కన పెడితే.. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నవారికి ఎక్కువగా చెమటలు పట్టడం మనం గమనించవచ్చు.

Video Advertisement

చాలా మంది టీనేజర్లలో వారు వేసుకున్న దుస్తులు తడిచిపోయేలా చెమటలు పడుతూ ఉంటాయి. కొంతమంది చెమట పట్టడం ఆరోగ్యానికి మంచిదే అని భావించి అంతగా పట్టించుకోరు. కానీ, విపరీతంగా చెమటలు పడుతుంటే మాత్రం శరీరం మనకు ఏమైనా సంకేతాలను పంపిస్తోందేమో గమనించుకోవాలి.

sweat 1

ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాత, pitta, కఫ దోషాలు ఉంటాయి. శరీరం లో పిత్త ఎక్కువగా ఎలివేట్ అయినప్పుడు శరీరంపై చెమట ఎక్కువగా పడుతుంటుంది. పిత్త కారణంగా శరీరంలో ఎక్కువగా వేడిమి పెరిగి ఫలితంగా ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి. చెమట ఎక్కువగా పడుతున్నా, లేక తక్కువగా పడుతున్న ప్రాబ్లెమ్ అవుతుంది. శరీరంలో ఫాట్ బర్నింగ్ జరిగినప్పుడు చెమటలు పడుతుంటాయి. అందుకే మనం వ్యాయాయం చేస్తున్నప్పుడు, జాగింగ్, రన్నింగ్ లాంటివి చేస్తున్నపుడు ఎక్కువగా చెమటలు పడతాయి.

sweat 2

ఇలాంటి సమయంలో ఎంత ఎక్కువ చెమట పడితే.. అంత ఎక్కువగా టాక్సిన్స్ మన శరీరం నుంచి బయటకు పోతాయి. కొంతమందిలో అసలు చెమట పట్టదు. వారి స్కిన్ ని గమనించి చూస్తే.. అది మొద్దుబారిపోయినట్లు ఉంటుంది. అందుకే శరీరానికి చెమట పట్టే విధంగా చూసుకోవాలి. కానీ.. అతిగా చెమటలు పడుతున్నాయంటే మాత్రం అది హార్మోనల్ ఇంబ్యాలన్సు వలనే అవుతోందని గుర్తించాలి. అయితే వీరు ఎప్పటికప్పుడు స్నానం చేస్తూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే చర్మ వ్యాధులు వస్తాయి. వీరు మజ్జిగ ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఉదయం సాయంత్రం ఉసిరి పొడిలో బెల్లం, నెయ్యి కలిపి తినడం వలన కూడా ఎక్కువగా పట్టే చెమట కంట్రోల్ అయ్యి.. ఆ చెమట దుర్వాసన రాకుండా ఉంటుంది.


End of Article

You may also like