Home Bigg Boss 5 telugu ఇలా కూడా గేమ్ ఆడతారా.? కావాలని రెచ్చగొట్టి మరీ.? ప్రియ స్ట్రాటజీ మామూలుగా లేదుగా..?

ఇలా కూడా గేమ్ ఆడతారా.? కావాలని రెచ్చగొట్టి మరీ.? ప్రియ స్ట్రాటజీ మామూలుగా లేదుగా..?

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి 5 వారాలు గడిచింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం.  అయితే ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ ఎపిసోడ్ చాలా ఘాటుగా జరిగింది. ఇందులో ప్రియ కొన్ని వింత కారణాలు చెప్పి ఇంటి సభ్యులను నామినేట్ చేయడం వల్ల చాలా చర్చలు జరిగాయి.

Fight between priya and sunny in bigg boss telugu 5

“రవి తడి టవల్ సోఫా మీద ఆరేస్తున్నారు అనే కారణంగా నామినేట్ చేశాను” అని ప్రియ అన్నారు. “అసలు నామినేట్ చేయడానికి ఇదొక కారణమా?” అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. ఇంకా మంగళవారం ఎపిసోడ్ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్ లో టాస్క్ జరిగింది. ఇందులో ప్రియ సన్నీతో మాట్లాడే విధానం రెచ్చగొట్టేలాగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. “దమ్ముంటే రా” అని అర్థం వచ్చేలా ప్రియా పలుసార్లు సన్నీతో మాట్లాడారు.

Fight between priya and sunny in bigg boss telugu 5

నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఇలాగే జరిగింది. ఇవాల్టి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో గమనిస్తే అందులో కూడా ప్రియ, సన్నీ మధ్య గొడవ జరుగుతుంది అని తెలుస్తోంది. ఇద్దరు మాట మాట అనుకుంటున్న క్లిప్ కూడా మనం ఈ ప్రోమోలో చూడొచ్చు. ఇంక మిగిలిన ఇంటి సభ్యుల విషయానికి వస్తే గ్రూప్ లాగా కాకుండా ఎవరి ఆట వాళ్లు ఆడాలి అని షణ్ముఖ్ జెస్సీతో అన్నారు.

watch video :

You may also like