మీరు వాడే బియ్యం నిజమైనవా ? నకిలీవా? తెలుసుకోండిలా..!

మీరు వాడే బియ్యం నిజమైనవా ? నకిలీవా? తెలుసుకోండిలా..!

by Megha Varna

Ads

మనం ప్రతి రోజూ అన్నం వండుకుంటూ ఉంటాం. అయితే మనం వండుకునే బియ్యం నిజమైనవా..? లేదా కల్తీవా అనేది ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలా ఆహారపదార్ధాలని కల్తీ చేస్తున్నారు. అటువంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Video Advertisement

అందుకని కల్తీ వాటిని గుర్తించడం పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒక టిప్ ని చెప్పింది. దీనిని ఉపయోగించి మనం బియ్యం కల్తీవా కాదా అనేది తెలుసుకోవచ్చు. కల్తీ బియ్యాన్ని బియ్యం ఆకారంలో చెక్కిన బంగాళదుంపతో తయారు చేస్తారు. ఆ తర్వాత దానిని ఏదైనా చౌకైన ప్లాస్టిక్ షీట్ తో పూతలా వేస్తారు.

ఇక కల్తీ బియ్యాన్ని ఎలా కనుక్కోవాలి అనే విషయానికి వస్తే..  బియ్యం తీసుకోండి. దానికి నానబెట్టిన సున్నాన్ని కొద్దిగా వేయండి. ఒకవేళ బియ్యం కల్తీ కానట్లయితే నానబెట్టిన సున్నం రంగు లో కానీ బియ్యంలో కానీ ఏ మార్పు రాదు. ఒకవేళ కనుక బియ్యం కల్తీ అయితే బియ్యం ఎరుపు రంగులోకి మారిపోతాయి. ఇలా ఇంట్లో సులభంగా బియ్యం మంచివా కాదా అనేది తెలుసుకోచ్చు.


End of Article

You may also like