ముదురుతున్న “హ్యుండాయ్” వివాదం.. సారీ చెప్పినా కూడా..? కొత్తగా మరో ట్విస్ట్.. అసలేం జరుగుతోంది..?

ముదురుతున్న “హ్యుండాయ్” వివాదం.. సారీ చెప్పినా కూడా..? కొత్తగా మరో ట్విస్ట్.. అసలేం జరుగుతోంది..?

by Anudeep

Ads

హ్యుండాయ్ మోటర్స్ కు భారత్ లో ఎంత గిరాకీ ఉందొ తెలిసిందే. అయితే.. ఇటీవల ఈ కంపెనీ సోషల్ మీడియా పోర్టల్ ట్విట్టర్ లో పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదమైంది. కాశ్మిర్ విషయంలో పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ సదరు కంపెనీ ఓ పోస్ట్ పెట్టింది. దీనితో భారతీయులందరు భగ్గుమన్నారు.

Video Advertisement

హ్యుండాయ్ కంపెనీ వస్తువులను కొనడానికి వీలు లేదని, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ని బహిష్కరించాలని సోషల్ మీడియాలో నినాదాలు చేస్తున్నారు.

hyundai 2

కాశ్మిర్ విషయంలో పాకిస్థాన్ చేసింది త్యాగం అయితే.. మరి సంవత్సరాల తరబడి భారత్ చేసిందో ఏంటో చెప్పాలని కొందరు నెటిజన్లు హ్యుండాయ్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కొరియన్ కు చెందిన కార్ల కంపెనీ హ్యుండాయ్ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పింది. హ్యుండాయ్ కు చెందిన పాకిస్థాన్ సోషల్ మీడియా విభాగం పాకిస్థాన్ కు అనుకూలంగా చేసిన ఈ పోస్ట్ ను ఎప్పటికీ సమర్ధించబోమని చెప్పింది.

hyundai 1

జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల తత్వానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. మరో వైపు ఈ విషయమై రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. దీనితో ఈ అంశం లో రాజకీయ వేడి రాజుకుంది. హ్యుండాయ్ క్షమాపణలు చెప్పినప్పటికీ… శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది హ్యుందాయ్ తీరుని తప్పుబట్టారు. సదరు కంపెనీ పోస్ట్ చేసిన ట్వీట్ అంతా అవసరం లేదని.. ఒక్క క్షమాపణలు చెప్తే చాలని చురక అంటించారు.

hyundai 3

ఇది ఇలా ఉంటె.. మరో వైపు హ్యుండాయ్ పాకిస్థాన్ హేండిల్ ఈ పోస్ట్ లు అన్నిటిని డిలీట్ చేసేసింది. కానీ ఈలోపే నష్టం వాటిల్లింది. ఆ పోస్ట్ లను స్క్రీన్ షాట్స్ తీసుకున్న వ్యక్తులు వాటిని యథేచ్ఛగా పోస్ట్ చేస్తున్నారు. దీనితో ఈ వివాదం మరింత ముదురుతోంది. భారత్ లో మారుతి సుజుకి తరువాత రెండవ అతి పెద్ద కార్ల కంపెనీగా పేరు తెచ్చుకున్న హ్యుండాయ్ ప్రస్తుతం ఈ వివాదానికి ముగింపు పలకాలని భావిస్తోంది.

 

 


End of Article

You may also like