మీ నాలుక ఏ రంగులో ఉంది..? దాన్ని బట్టి మీ ఆరోగ్య సమస్య ఏంటో చెప్పేయచ్చు..!

మీ నాలుక ఏ రంగులో ఉంది..? దాన్ని బట్టి మీ ఆరోగ్య సమస్య ఏంటో చెప్పేయచ్చు..!

by Anudeep

Ads

మనకి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్ ఎం పి వైద్యుల వద్దకు వెళ్తూ ఉంటాం. వారు మనలని ప్రాధమికంగా పరీక్ష చేస్తారు. అలా చేసేటప్పుడు మన కళ్ళు, నాలుకని ముందుగా పరీక్షిస్తారు. మన శరీరంలో ఏదైనా ఇబ్బందులు ఉంటె మన నాలుకపై వచ్చిన తేడా ద్వారా అదేంటో గుర్తించవచ్చు.

Video Advertisement

అందుకే వైద్యులు ప్రాధమిక పరీక్షగా మన నాలుకని గమనిస్తారు. అయితే.. మన నాలుకని ఎలా పరీక్షిస్తే.. మనకి ఏ ఇబ్బంది ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం. మన నాలుక రంగుని బట్టి మన అనారోగ్య సమస్య ఏంటో గుర్తించవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

doctor

మీ నాలుక లేత గులాబీ రంగులో ఉంటె మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని అర్ధం. ఎక్కువగా బాధపడాల్సిన సమస్యలు మీకు లేవని అర్ధం. ఒకవేళ మీ నాలుక ఊదా రంగులోకి మారి కనిపించింది అంటే.. దాని అర్ధం మీకు రక్త ప్రసరణ సమస్యలు ఉన్నాయని అర్ధం. అంతే కాదు నాలుక ఊదా రంగులో కనిపిస్తే.. వారికి కొలెస్టిరాల్ స్థాయిలు కూడా అధికంగా ఉన్నాయని అర్ధం.

toungue 2

అదే మీ నాలుక పాలిపోయినట్లు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉందని అర్ధం. ఐరన్ లోపం ఉంటె అది రక్తహీనత సమస్య. మీరు వెంటనే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అదే మీ నాలుక ఎరుపు రంగులో పూసినట్లుగా ఉంటె విటమిన్ బి లోపం ఉందని అర్ధం. అలాగే చాలా మందిలో జ్వరం వచ్చినపుడు నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.

toungue 1

కొంతమంది ఎక్కువగా యాంటీ బయోటిక్ లను ఉపయోగిస్తూ ఉంటారు. వీరికి నాలుక నల్లగా మారి ఉంటుంది. కొంతమందికి నోటిలో ఎక్కువగా పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఉంటె వీరికి రోగనిరోధక శక్తీ తక్కువగా ఉందని అర్ధం. ఇందుకోసం విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ రోజుల పాటు నాలుకకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతుంటే వైద్యుడిని సంప్రదించాలి. ప్రతి రోజు ఉదయాన్నే బ్రష్ చేసుకున్నాక నాలుకని కూడా శుభ్రం చేసుకోవాలి.


End of Article

You may also like