“ఇదెక్కడి మాస్ COMEBACK” అంటూ…ఆస్ట్రేలియాపై ఇండియా టెస్ట్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“ఇదెక్కడి మాస్ COMEBACK” అంటూ…ఆస్ట్రేలియాపై ఇండియా టెస్ట్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(5), సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా(3) స్కోర్ చేశారు. వీరిద్దరూ 19 పరుగుల వద్ద అవుట్ అవడంతో టెన్షన్ నెలకొంది. తర్వాత వచ్చిన కెప్టెన్‌ అజింక్య రహానె(27; 40 బంతుల్లో 3×4), ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(35; 36 బంతుల్లో 7×4) బాధ్యతాయుతంగా ఆడడంతో 15.5 ఓవర్లలో టీమిండియా విజయాన్ని అందుకుంది. 133/6 ఓవర్ ‌నైట్ స్కోర్ తో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ 67 పరుగులు సాధించి చివరి 4 వికెట్లు కోల్పోయింది. కామరూన్‌ గ్రీన్‌(45; 146 బంతుల్లో 5×4) స్కోర్ తో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచారు.

Video Advertisement

పాట్‌ కమిన్స్‌(22; 103 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. సోమవారం 99 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఓటమి ఎదుర్కొనేలా కనిపించింది. కానీ టెయిలెండర్ల ఆటతో జట్టు స్కోర్ 200 కి చేరింది. గ్రీన్‌, కమిన్స్‌ బరిలోకి దిగిన తర్వాత చివరి నాలుగు వికెట్ల లో ఆసీస్‌ 101 పరుగులు సాధించింది. బుమ్రా బౌలింగ్‌లో కమిన్స్‌ మయాంక్‌ చేతికి చిక్కడంతో ఆస్ట్రేలియా జట్టు మంగళవారం మొదటి వికెట్ కోల్పోయింది. 21 పరుగుల తర్వాత సిరాజ్‌ బౌలింగ్ ‌లో గ్రీన్‌ జడేజా చేతికి చిక్కారు. అప్పటికి ఆసీస్‌ ‌ 177/8 స్కోర్ చేసింది.

సిరాజ్‌ బౌలింగ్‌ లో లైయన్‌(3) అవుట్ అయ్యారు. చివరిలో హేజిల్‌వుడ్‌(10), మిచెల్‌ స్టార్క్‌(14) స్కోర్ చేశారు. చివరి ఓవర్‌ లో అశ్విన్‌ హేజిల్ ‌వుడ్‌ను బౌల్డ్‌ చేయడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 69 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్‌ మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లు‌, జడేజా రెండు వికెట్లు, ఉమేశ్‌ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13


End of Article

You may also like