లంకెబిందెలు దొరికితే అరిష్టమా..? అవి తెరిస్తే రక్తం కక్కుకుని చనిపోతారు అన్న విషయం నిజమేనా..?

లంకెబిందెలు దొరికితే అరిష్టమా..? అవి తెరిస్తే రక్తం కక్కుకుని చనిపోతారు అన్న విషయం నిజమేనా..?

by Anudeep

Ads

లంకెబిందెలు దొరకగానే అదృష్టం తలుపు తట్టింది అని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే.. చాలా వరకు లంకెబిందెల్లో సంపద ఉంటుంది. పూర్వకాలపు రోజుల్లో.. ఎక్కువ గా సంపాదన ఉన్నపుడు .. ఆ బంగారాన్ని లంకె బిందెల్లో ఓ చోట గుర్తుగా తవ్వి పాతిపెట్టేవారు. అవి ఎప్పుడైనా తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి. అయితే.. లంకెబిందెలు దొరకగానే అది అరిష్టం అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

lanke bindelu 1

లంకెబిందెలు చాలా కాలం క్రితం వాడుకలో ఉండేవి. వీటిల్లో విలువైన సంపదనను ఉంచి దాచిపెట్టేవారు. చాలా కాలం వరకు అవి ఎలాంటి గాలి సోకకుండా ఉంటాయి. అందుకే వాటిని ఒక్కసారిగా ఓపెన్ చేసేసరికి.. ఎక్కడలేని దుర్వాసన వస్తూ ఉంటుంది. అంతటి ఘాటైన వాసనలను ఒక్కసారిగా పీల్చడం వలన శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కొంతమంది వీటిని భరించినప్పటికీ.. చాలా మంది ఈ వాసనలను పడలేరు.

lanke bindelu 4

దీనితో వారికి ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, వాంతులు అవుతుండడం వంటి లక్షణాలు ఎదురవుతూ ఉంటాయి. కొందరికి నోరు, ముక్కులోంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. కొందరికి ఆనందం పట్టలేక బీపీ పెరగడం, హార్ట్ ఎటాక్ కూడా వస్తుంది. ఐతే.. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది.

lanke bindelu 3

అందుకే.. లంకెబిందెలు దొరకడం అరిష్టమని.. రక్తం కక్కుకుని చనిపోతున్నారని చెప్పడం మొదలైంది. క్రమం గా కొందరు దానిని మూఢనమ్మకం గా భావించేస్తున్నారు. వాస్తవానికి బిందెలను తీయడం అరిష్టమేమి కాదు.. కానీ.. తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే లంకెబిందెలు లోహాలతో తయారు చేస్తారు. అందులో ఉండే నాణేలు కూడా లోహాలతోనే తయారు చేస్తారు.

lanke bindelu 2

ఇవి ఎక్కువకాలం పాటు గాలి సోకకుండా భూమికి అడుగున ఉంటాయి. దీనివలన అవి క్షయానికి గురి అయ్యి దుర్వాసనను కలుగచేస్తాయి. లోపల విష వాయువు తయారవుతుంది. ఒక్కసారి గా వాటిని తెరవడం వలన ఈ విషవాయువుల కారణం గా అస్వస్థత కలుగుతూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


End of Article

You may also like