ప్రత్యేక గురుపౌర్ణమి.. నేడు, రేపు ఆకాశం లో అద్భుతం.. అస్సలు మిస్ కాకుండా చంద్రుడిని చూడండి..!

ప్రత్యేక గురుపౌర్ణమి.. నేడు, రేపు ఆకాశం లో అద్భుతం.. అస్సలు మిస్ కాకుండా చంద్రుడిని చూడండి..!

by Anudeep

Ads

నేడు పౌర్ణమి. ఈ పౌర్ణమి ఎంతో ప్రత్యేకం గా నిలవబోతోంది. ఈరోజు, రేపు ఆకాశం లో ఖగోళ అద్భుతం జరగబోతోంది. ఈరోజు తప్పకుండా ఆకాశం లో చంద్రుడిని చూడండి. ఎందుకంటే.. మిగతా పౌర్ణమి రోజులతో పోలిస్తే.. ఈరోజు ఆకాశం లో చంద్రుడి మరింత ప్రకాశవంతం గా కనిపించనున్నాడు. అది ఎందుకో తెలుసుకుందాం.

Video Advertisement

moon 1

ఈరోజున తిధి పౌర్ణమి. అంటే చంద్రుడు నిండుగా కనిపించే రోజు. అంతే కాదు.. ఈరోజు ఆకాశం లో చంద్రుడు శని గ్రహానికి దగ్గరగా జరగనున్నది. అలాగే.. రేపు గురు గ్రహానికి దగ్గరిగా వెళ్లనున్నాడు. సైంటిఫిక్ గా చెప్పాలంటే.. ఈరోజు భూమి, సూర్యుడు, చంద్రుడు సరైన రేఖలోకి వస్తారు. అయితే.. చంద్రుడు ఒక ఐదు డిగ్రీలు పక్కకు జరగడం వలన సూర్యుని కాంతి నేరుగా చంద్రునిపై పడుతుంది.

moon 2

ఫలితం గా చంద్రుడు మాములు పౌర్ణమి రోజులలో కంటే ఎంతో ప్రత్యేకం గా కాంతివంతం గా కనిపిస్తారు. ఇలాంటి చంద్రుడిని బక్ మూన్ లేదా థండర్ మూన్ అని పిలుస్తారు. మామూలుగానే జులై నెలలో వచ్చే పౌర్ణమికి కాంతి ఎక్కువ. జులై నెలలోనే మగ జింకలకు కొమ్ములు బాగా పెరుగుతాయి. పాత కొమ్ములు పోయి కొత్తవి వస్తూ ఉంటాయని చెబుతుంటారు.

moon 3

అలాంటి జులై నెలలోనే.. చంద్రుడు కొద్ది గా పక్కకు జరగడం వలన సూర్యకాంతి నేరుగా పడి మరింత కాంతివంతం గా కనిపించనున్నారు. అలాగే.. ఈరోజు కనిపించే చందమామ రంగు కూడా ఎప్పటిలాగా కాకుండా, కొంత ఎరుపు, నారింజ రంగుల కలబోత గా కనిపించనుంది. తప్పకుండ ఈరోజు చంద్రుడిని చూసి ఆనందించండి.


End of Article

You may also like