గత కొన్ని రోజులుగా నరేష్, పవిత్ర పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో అనేక విషయాలు వైరల్ గా మారాయి. ఈ విషయంపై నరేష్ మూడో భార్య రమ్య నాకు విడాకులు ఇవ్వకుండా పవిత్రను ఎలా వివాహం చేసుకుంటాడు అని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చింది. రమ్య వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇదే విషయంపై స్పందిస్తూ నరేష్, రమ్య ఏ నాడు నాకు బార్యగా ప్రవర్తించలేదు. డబ్బు కోసం మాత్రమే నన్ను ఈ ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది అంటూ నరేష్ ఆరోపించారు. నేను దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించాను, అందులో ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించాను. ఏనాడైనా వాళ్లు నరేష్ మమ్మల్ని చీట్ చేసాడు అని చెప్పడం ఎక్కడైనా చూశారా.. అని ప్రశ్నించారు. కేవలం డబ్బు కోసమే రమ్య నాపై ఈ విధమైన ఆరోపణలు చేస్తుంది అంటూ రమ్యకి వ్యతిరేకంగా ఘాటైన రిప్లై ఇచ్చారు నరేష్.
నరేష్, పవిత్ర లోకేష్ కథ ఇలా సాగుతున్న సమయంలోనే వీరు మైసూర్ చేరడం చర్చనీయాంశంగా మారింది. పవిత్ర, నరేష్ హోటల్ లో ఉన్న విషయం తెలుసుకున్న రమ్య అక్కడ చేరుకొని కోపం ఆపుకోలేక పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది.
వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో పవిత్ర, నరేష్ మూడో భార్య రమ్య దాడి నుంచి తప్పించుకోగలిగారు. ఈ విషయం అంతా చూస్తున్న నరేష్ రమ్యని చూస్తూ విజిల్స్ వేస్తూ అక్కడి నుంచి లిఫ్ట్ లో వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Watch this video: