కళ్ళజోడు వాడే వారందరు చేసే తప్పులు ఇవే.. ఇలా అస్సలు చేయకండి..!

కళ్ళజోడు వాడే వారందరు చేసే తప్పులు ఇవే.. ఇలా అస్సలు చేయకండి..!

by Mounika Singaluri

Ads

దృష్టి సరిగా లేనపుడు కళ్ళ పెట్టుకోవడం అనేది సహజమే. ఈ మధ్య కాలం లో చాలా మంది కళ్ళ జోళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే.. కళ్ళ జోడు పెట్టుకునే వారికి కొన్ని అదనపు బాధ్యతలు ఉంటాయి. ఎక్కడకి వెళ్లినా.. వారు తమతో పాటు కళ్ళ జోడులను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Video Advertisement

spects 4

అలాగే.. వాటిని ధరించే ముందు మెత్తని క్లాత్ తో శుభ్రం చేసుకోవాలి. అంతే కాదు.. దానికోసం ప్రత్యేకం గా క్లాత్ ని ఉంచుకోవాలి. చాలా మంది తమ డ్రెస్ కి లేదా దుపట్టా కి.. అబ్బాయిలయితే షర్ట్ కి తుడిచేసి పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన వాటిపై ఉండే కంటికి కనిపించని దుమ్ము ధూళి గ్లాసెస్ పైకి చేరే అవకాశం ఉంటుంది.

spects 3

అలా.. మనకు తెలియకుండానే ఈ దుమ్ము ధూళి కంట్లోకి చేరతాయి. మరికొందరేమో చాలా సేపు తుడుస్తూ ఉంటారు. ఈ అతిజాగ్రత్త కూడా అవసరం లేదు. కనీసం ఇరవై సెకెన్ల పాటు తుడిస్తే సరిపోతుంది. అలాగే.. కళ్ళద్దాలను ఉపయోగించే ముందు చేతులని శుభ్రపరుచుకోవాలి. అప్పుడు చేతులపై సూక్ష్మ కణాలు అద్దాలపై చేరకుండా ఉంటాయి.

spects 4

ఎప్పుడైనా అద్దాలకు దుమ్ము పట్టి వదలకపోతే.. తడిగుడ్డతో తుడవడం కాకుండా.. గోరువెచ్చని నీటిని అద్దాలపై పోయాలి. ఆ తరువాత పొడిగా ఉన్న మెత్తని మైక్రో ఫైబర్ క్లాత్ తో తుడవాలి. కేవలం అద్దాలపైనే ఫోకస్ చేయడం కాకుండా.. ఫ్రేమ్ పై కూడా శ్రద్ధ వహించాలి. లేదంటే అవి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కొందరు కళ్లద్దాలు శుభ్రం చేసేందుకు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగిస్తూ ఉంటారు.

spects 1

ఇది అస్సలు చేయకూడదు. ఎందుకంటే.. నెయిల్ పోలిష్ రిమూవర్ లో అసిటోన్ ఉంటుంది. ఇది లెన్స్ లను పాడుచేస్తుంది. దీనిపెట్టి క్లీన్ చేసిన అద్దాలను ఉపయోగించడం వలన కళ్ళు స్ట్రైన్ అవుతాయి తప్ప ఉపయోగం ఉండదు. చాలా మంది కళ్ళద్దాలను జేబులోను, టేబుల్స్ పైన ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. వాటికోసం ప్రత్యేకం గా కేటాయించిన బాక్స్ లలో మాత్రమే వాటిని ఉంచాలి. ఇలా కళ్ళద్దాల పట్ల శ్రద్ధ వహిస్తేనే.. మన కళ్ళు పదిలం గా ఉంటాయి.

 


End of Article

You may also like