Ads
ప్రపంచ కప్ జట్టు నుంచి తొలగించి 24 గంటలకు ముందే అక్షర పటేల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కారణంగా హాట్ డిస్కషన్ కు కారణం అయ్యాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్ తో భారత్ తలపడిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ గాయానికి గురి అయ్యాడు.
Video Advertisement
ఈ కారణంగానే అతను ఫైనల్ మ్యాచ్ లో కూడా పాల్గొనలేకపోయాడు. అయితే ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు అనే కారణంతో జరగబోయే ప్రపంచ కప్ టీం ఇండియా జట్టు నుంచి అతని తప్పించి అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ని తీసుకోవడం జరిగింది.
పాపం దీని కారణంగా ప్రపంచకప్ ఆడాలి అనుకున్న అతని కల…కలగానే మిగిలిపోయింది.. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అక్షర్ పటేల్ షేర్ చేసుకున్న ఒక పోస్ట్ వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద డిస్కషన్ కు తెరలేపింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అంటే…‘కామర్స్ బదులు సైన్స్ తీసుకుని ఉండాల్సింది. బెటర్ పీఆర్ ను హైర్ చేసుకుని ఉండాల్సింది’అని పోస్ట్ పెట్టి వెంటనే కాసేపటికి దాన్ని డిలీట్ చేసాడు.
అయితే అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది.. అభిమానులు ఆ పోస్ట్ చూడడమే కాకుండా కొందరు వాటిని స్క్రీన్ షాట్స్ తీసి మరి పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కావాలని గాయాల నుంచి కోల్కున్నప్పటికీ అక్షర్ పటేల్ ను టీం నుంచి తప్పించి రవిచంద్రన్ అశ్విన్ ని తీసుకున్నారు అని కొందరు అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి ప్రపంచ కప్ టీం అనౌన్స్ చేసినప్పుడు.. ప్రపంచ వన్ డే కప్ జట్టుకి అశ్విన్ ను ఎంపిక చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో హల్చల్ జరిగింది.
ఈ ఇన్సిడెంట్ ని తిరిగి గుర్తు చేస్తూ తను కూడా ఒక మంచి పిఆర్ ని పెట్టుకుని ఉంటే బాగుండేది అనే వెర్షన్ లో అక్షర్ పటేల్ ఈ పోస్ట్ పెట్టాడా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోపక్క దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్ లో ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ చేతికి ఫ్రాక్చర్ అయింది. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది అన్నప్పటికీ ఆసీస్ అతన్ని ప్రపంచ కప్ టీం లో అలాగే ఉంచింది. మరి ఇండియన్ టీం మాత్రం మూడు వారాలలో కోలుకునే అక్షర్ పటేల్ కోసం ఆ మాత్రం చేయలేకపోయింది అని నెటిజన్స్ భావిస్తున్నారు.
ALSO READ : సుప్రీం కోర్ట్ లోనే మొదటిసారి ఇలా… అసలు విషయం తెలిస్తే ఆమెకి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!
End of Article