Ads
జూన్ ఏడో తేదీన ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లిన భారత క్రికెటర్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈసారి ఎలాగైనా సరే టైటిల్ గెలవాలనే పట్టుదలతో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగుతోంది.
Video Advertisement
పుజారా ముందే ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీల్లో ఆడుతూ.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాడు. మిగతా క్రికెటర్లు ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసిన దగ్గర్నుంచి దశల వారీగా ఇంగ్లాండ్ చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.ప్రస్తుతం టీమిండియా ఇప్పుడు యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ ఇదే పంథా కొనసాగిస్తున్నారు. అయితే పలువురు సీనియర్ క్రికెటర్లు డబ్ల్యూటీసీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
#1 ఇషాంత్ శర్మ
టీమిండియా జట్టులో ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ ఇంకా మరికొందరు యువ పేసర్లు కూడా స్థానం కోసం చూస్తున్నారు. వీరందరిని దాటుకొని ఇషాంత్ జట్టులోకి పునరాగమనం అనుమానమే. అందువల్ల అతను ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తర్వాత వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
#2 వృద్ధిమాన్ సాహా
ఎంఎస్ ధోని రిటైర్మెంట్ తర్వాత.. వృద్ధిమాన్ సాహా జట్టుకు ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు. అయితే రిషబ్ పంత్ జట్టులోకి వచ్చిన తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేశాడు. ఇప్పుడు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ కూడా జట్టులోకి వచ్చారు. దీంతో సాహా రిటైర్మెంట్ దాదాపు ఖాయమైనట్టే.
#3 ఉమేష్ యాదవ్
ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఉమేష్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే మరోసారి ఎంపిక కావడం అనుమానమే. సిరాజ్, శార్దూల్‌లు జట్టులో ఉండడంతో ఉమేష్ రిటైర్‌మెంట్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది.
#4 మయాంక్ అగర్వాల్
2022 తర్వాత అగర్వాల్ ఏ టెస్టు మ్యాచ్‌కి ఎంపిక కాలేదు. ఇప్పటికే టీమ్ ఇండియా జట్టులో ఓపెనర్ల స్థానం కోసం శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లైన్ లో ఉన్నారు. దీంతో ఇతడి స్థానం కూడా కష్టమే.
Also read: WTC కి “విరాట్ కోహ్లీ” తీసుకెళ్తున్న బ్యాగ్ గమనించారా.? ఇలా మర్చిపోతే ఎలా.?
End of Article