నిద్ర లో మీ గుండెలపై ఏదో కూర్చున్నట్లు మీకెప్పుడైనా అనిపించిందా..? దానికి అసలు కారణం ఇదే..!

నిద్ర లో మీ గుండెలపై ఏదో కూర్చున్నట్లు మీకెప్పుడైనా అనిపించిందా..? దానికి అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

మనం గాఢ నిద్ర లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన గుండెల మీద ఏదో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మనం కళ్ళు తెరవలేకపోతాము.. అలా అని కనీసం కదలలేక పోతూ ఉంటాము. ఒక్కోసారి మనపైన ఏమైనా దెయ్యం కూర్చుందేమో అని మనకు భయం కూడా వేస్తూ ఉంటుంది. ఆ సమయం లో ఒక్కొక్కసారి పీడకలలు కూడా ఎక్కువ గా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది దెయ్యాలు పీడిస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు.

Video Advertisement

sleep paralysis 3

కానీ ఇది నిజానికి దెయ్యాలు కావు. ఇది కేవలం ఆరోగ్య పరం గా వచ్చే సమస్యే. ఈ సమస్యని స్లీప్ పెరాల్సిస్ అని పిలుస్తారు. ఈ సమయం లో గుండెపై బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. స్పృహ ఉన్నప్పటికీ.. పైకి లేవలేకపోవడం, కళ్ళు తెరవలేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత లెక్కలను బట్టి మనుషులకు ఉండే 75 సంవత్సరాల ఆయుర్దాయం లో ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటుంది.

sleep paralysis 2

అయితే.. ఇది ఎందుకు వస్తుంది అని చెప్పడానికి కారణాలు లేవు. ఇలాంటి పరిస్థితి ఒక సగటు మనిషికి కనీసం 80 సెకండ్ల వరకు ఉండొచ్చట. కానీ.. కచ్చితమైన కారణం ఏంటి అనేదానిని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. కొందరు మాత్రం.. దెయ్యాలంటే ఎక్కువ గా భయపడేవారికి ఇలా జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలా జరిగినప్పుడు మాత్రం చాలా మందికి మెలకువ వచ్చేస్తూ ఉంటుంది.


End of Article

You may also like