మెగాస్టార్ కి కూడా నచ్చిన “సుద్దాల అశోక్ తేజ” గారి పాట “ఇంద్ర” నుండి ఎందుకు తీసేసారు.? కానీ తర్వాత అదే సూపర్ హిట్.!

మెగాస్టార్ కి కూడా నచ్చిన “సుద్దాల అశోక్ తేజ” గారి పాట “ఇంద్ర” నుండి ఎందుకు తీసేసారు.? కానీ తర్వాత అదే సూపర్ హిట్.!

by Anudeep

Ads

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలుగువారికి సుపరిచితుడే. దాదాపు రెండు వేల పాటలకు పైగా రాసి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటం లో ప్రజలను చైతన్యవంతులను చేసిన ప్రజా కవి హనుమంతు గుర్తున్నాడు కదా. సుద్దాల అశోక్ తేజ ఆయన తనయుడు. సుద్దాల అశోక్ తేజ నల్గొండ జిల్లా లో జన్మించాడు. చిన్నతనం నుంచే ఆయనకు పాటలు రాసే అలవాటు ఉండేదట.

Video Advertisement

suddala

ఆయన చదువు పై కూడా శ్రద్ధ గా ఉండేవారు. ఉన్నత చదువు లు చదివి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఓ సారి తనికెళ్ళ భరణి గారు ఈయనను సినిమాల వైపుకు రావాల్సింది గా ప్రోత్సహిస్తే.. సినిమాల్లోకి వచ్చారు. అలా మొదట్లో విప్లవాత్మక పాటలు రాసినప్పటికీ, క్రమం గా సినీ గేయాలు రాయడం ప్రారంభిచారు. “నేను సైతం ప్రపంచాగ్ని కి సమిధనొక్కటి ఆహుతిచ్చానూ” అన్న పాట వింటే చాలు అశోక్ తేజ కలానికి పదునెంత ఉందొ తెలుస్తుంది.

suddala ashok teja indra

ఆయన ఎక్కువ పాటలు కృష్ణ వంశి సినిమాలకే రాసారు. ఒసే రాములమ్మ, నిన్నే పెళ్లాడుతా సినిమాలు అశోక్ తేజ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలా.. కలానికి పదును పెట్టి దాదాపు పన్నెండొందల చిత్రాలలో, రెండు వేలకు పైగా పాటలు రాసారు. ఈ క్రమం లో ఇంద్ర సినిమా కు కూడా సుద్దాల అశోక్ తేజ గారు ఓ పాట రాసారు. “నెమలి కన్నులొడ, నమిలే చూపోడా..” అంటూ సాగే ఈ పాట నిర్మాత తో సహా, హీరో కి, సంగీత దర్శకుని కి నచ్చింది. కానీ, ఈ సినిమా కి దర్శకత్వం వహించిన బి.గోపాల్ మాత్రం ఈ పాటను తీసేసారు.

indra okato number kurradu

తానూ గతం లో తీసిన సినిమాలకు కూడా ఇలాంటి పాటలు ఉన్నాయని, ఈ పాటను పక్కన పెట్టేసారు. అయితే, ఈ విషయం సుద్దాల అశోక్ తేజ కు తెలియదు. సినిమా విడుదలయ్యాక ఆయన కొంత బాధపడ్డారు.

watch video:

ఆ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు “ఒకటో నెంబర్ కుర్రాడు” సినిమా తీస్తున్న సమయం లో ఓ సారి సుద్దాల అశోక్ తేజ ను కలిశారు. మాటల మధ్యలో నువ్వు రాసిన పాట ఏదైనా పక్కన పెట్టేస్తే చెప్పు.. “ఒకటో నెంబర్ కుర్రోడు” సినిమాలో పెట్టేద్దామా అంటూ చెప్పేసరికి.. ఈ పాట గురించి చెప్పారట. అలా.. ఇంద్ర సినిమా కోసం రాసిన పాటను “ఒకటో నెంబర్ కుర్రోడు” సినిమా లో పెట్టేసారు.

watch video:

 


End of Article

You may also like