తాను ఒకటి తెలిస్తే పాపం దైవం మరొకటి తలచిందా అన్నట్లు మారింది సమంత పరిస్థితి. ఏదో ఊహించేసుకుని చేసేద్దామని విడాకులు తీసుకుంటే అది కాస్త రివర్స్ అయింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత లైఫ్ ఎలా అప్ అండ్ డౌన్స్ మధ్య నలిగిపోతుందో అందరూ చూస్తూనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలో విడాకులు తర్వాత ఆమె హిట్ కొట్టింది లేదు.
రీసెంట్ గా వచ్చిన ఖుషి తప్పిస్తే విడాకులు తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే. స్టార్ హీరోయిన్ స్టేటస్ నుండి ఇప్పుడు డోన్ ఫాల్ లోకి సమంత కెరీర్ వచ్చేసింది.మరోపక్క సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య మాత్రం తన కెరీర్ పైన దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నారు. సమంత గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పని తాను చేసుకోబోతున్నారు.

అయితే మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలా అవస్థలు పడిన సమంత చేతిలోకి ఇప్పలు సినిమాలు వచ్చిన అవి వచ్చినట్లే వచ్చి చేయి జారిపోయాయి. రీసెంట్ గా అలాంటి ఒక సినిమానే ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక మందన హీరోయిన్ గా గీత ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాని అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాలో మొదటగా సమంత హీరోయిన్ గా అనుకున్నారట ఆమె కూడా ఈ కథను ఓకే చేసింది. అయితే ఆరోగ్యం బాలేదని కారణంగా ఎక్కువ కాలం పోస్ట్ పోన్ చేస్తూ రావడంతో ఆ ప్లేస్ లోకి రష్మిక మందనాన్ని తీసుకున్నారు. దీంతో ఈ న్యూస్ కాస్త వైరల్ అయింది.

ఈ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అతని భార్య చిన్మయి సమంతకు క్లోజ్ ఫ్రెండ్స్. ఆఖరికి వాళ్ళు కూడా సమంత కోసం టైం కేటాయించలేకపోతున్నారని వేరే వారికి ఛాన్స్ ఇస్తారా అంటూ సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.సమంత మళ్ళీ త్వరగా కోలుకుని ఆరోగ్యంతో తిరిగి వచ్చే సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read:రెమ్యూనరేషన్ పెంచేసిన మీనాక్షి చౌదరి… అన్ని కోట్ల?

యశోద ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మయోసైటిస్‌తో అనే దీర్ఘకాలిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత ఈ సినిమాలో ఫైట్స్ చేసింది. సమంత చేసిన కొన్ని స్టంట్స్ అందర్నీ ఆశ్చర్యపర్చాయి. థియేటర్ల నుండి వెళ్లిపోయిన యశోద సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇటీవల ఈ మూవీ పై ఇవా హాస్పటల్ పరువు నష్టం దావా వేసింది. ఈ మూవీ పై ఈవా పేరుతో ఉన్న సరోగసీ సెంటర్లో నేరం చేసినట్లుగా చూపించారని, ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ ఆపేయాలని ఇవా హాస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
అయితే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో విడుదల చేసే వెర్షన్లో హాస్పటల్ బ్లర్ చేస్తామని చెప్పారు. దీంతో ఓటీటీ రిలీజ్‌కి అడ్డంకి తొలిగింది. డిసెంబరు 9న స్ట్రీమింగ్ అవబోతునట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్లాప్ సినిమాలనే త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.కానీ యశోద సినిమా హిట్ అయ్యింది. అయిన కూడా ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో అని అంటున్నారు.
అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేచురల్ స్టార్ నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఒక జర్నలిస్ట్ హిట్ సిరీస్ మూవీస్ లో సమంత లాంటి స్ట్రాంగ్ ఫిమేల్ విలన్ గా చేస్తే బావుంటుండి అని ట్వీట్ చేసాడు. అయితే దీనిని అడవి శేషు రీ ట్వీట్ చేయడమే కాక, ఇది అద్భుతమైన ఆలోచన సమంత ఏమంటావ్ అని సమంతను అడిగాడు. దానికి సమంత సమాధానంగా బాడ్ యాస్ కాప్,ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంది అని కామెంట్ పెట్టింది.
అంతేకాక నీ సినిమా హిట్టు అయినందుకు కంగ్రాట్స్, నిన్ను ఎప్పటికీ చీర్ చేస్తూనే ఉంటా అని కామెంట్ చేసింది. అయితే సమంత హిట్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చేసింది. ఇంకో వైపు సమంత అభిమానులు ఆమె ట్వీట్ చేసిందంటే అనారోగ్యంతో లేదని, బాగానే ఉందని సంతోషపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, హిట్ సిరీస్‌ను 8 భాగాలుగా రూపొందించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. హిట్ 2 ప్రమోషన్స్ లోనే 3వ పార్ట్ గురించి తెలిపారు. అయితే హిట్ 3 లో నాని హీరోగా, కీలక పాత్రలో అడివి శేష్ నటిస్తాడని తెలిపారు.











ఎప్పుడు భిన్నమైన పోస్టులు, కొటేషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఆమె తాజాగా “డెడ్ ” అనే పోస్ట్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. ఎందుకు చేసిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి 4వ మూవీ “థోర్ “.. లవ్ మరియు తండర్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
అయితే ముందుగా సమంత డెడ్ అని ఎందుకు రాసింది, మళ్లీ ఎందుకు డిలీట్ చేసింది అనేది ఎవరికీ తెలియలేదు. అయితే కొంతమంది ఆమెకు సినిమా ట్రైలర్ నచ్చలేదని అందుకే డెడ్ అని రాసిందని, కానీ ఇది వైరల్ అవ్వటంతో, సినిమాపై నెగిటివ్ స్ప్రెడ్ చేసినట్లు అవుతుందని సమంత మళ్లీ డిలీట్ చేసింది అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా సమంత అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులతో అభిమానులకు షాక్ లు ఇస్తూ, వైరల్ గా మారుతుంది.

