మహమ్మారి కారణంగా డాక్టర్ మరణం చివరి సారిగా ఆమె పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ చూస్తే కన్నీళ్లు ఆగవు

మహమ్మారి కారణంగా డాక్టర్ మరణం చివరి సారిగా ఆమె పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ చూస్తే కన్నీళ్లు ఆగవు

by Mohana Priya

Ads

కరోనా కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా వైద్య రంగంలో ఉండే వారు, ముఖ్యంగా డాక్టర్లు కూడా కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల ఒక డాక్టర్ కరోనా వల్ల తన ప్రాణాలను కోల్పోయారు.

Video Advertisement

వివరాల్లోకి వెళితే 51 సంవత్సరాల మనీషా జాదవ్, సెవ్రీ టీబీ హాస్పిటల్ లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా చేస్తున్నారు. అయితే గత ఆదివారం మనీషా తన ఫేస్ బుక్ టైం లైన్ మీద ఒక నోట్ పోస్ట్ చేశారు. అందులో “బహుశా తనకి అది చివరి మార్నింగ్ అని, మళ్లీ ఫేస్ బుక్ అనే ప్లాట్ ఫామ్ మీద తను అందరినీ కలవలేకపోవచ్చు అని, అందరినీ జాగ్రత్తగా ఉండమని, శరీరం కి చావు ఉంటుంది కానీ ఆత్మకి కాదు. ఆత్మకి చావు వుండదు” అని అర్థం వచ్చేలాగా రాశారు.

ఈ పోస్ట్ చేసిన 36 గంటల తర్వాత గత సోమవారం నాడు మనీషా జాదవ్ మరణించారు. ప్రస్తుతం మనీషా యాదవ్ ఫేస్ బుక్ లో చేసిన ఈ పోస్ట్ చర్చలో ఉంది. కరోనా వైరస్ విషయానికొస్తే ప్రస్తుతం మళ్లీ కరోనా వ్యాప్తి ఎక్కువ అవడంతో చాలా చోట్ల లాక్ డౌన్ విధించారు. అలాగే చాలా చోట్ల “ఇలాంటి సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఏంటి?” అనే విషయం కూడా చెప్పారు. ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని ఆర్డర్ జారీ చేశారు.


End of Article

You may also like