గుడిలో దొంగతనం చేసారు.. ఆ తరువాత ఓ నోట్ రాసి అన్నీ ఇచ్చేసారు.. ఆ నోట్ లో ఏమి రాసారంటే?

గుడిలో దొంగతనం చేసారు.. ఆ తరువాత ఓ నోట్ రాసి అన్నీ ఇచ్చేసారు.. ఆ నోట్ లో ఏమి రాసారంటే?

by Anudeep

Ads

యూపీలోని చిత్రకూట్ జిల్లాలోని బాలాజీ ఆలయంలో వారం రోజుల క్రితమే ఓ చోరీ జరిగింది. కొందరు దుండగులు బాలాజీ ఆలయంలో అష్టధాతువుల విలువైన విగ్రహాలను దొంగతనం చేసారు. కానీ దొంగతనం చేసిన వెంటనే వారు గుణపాఠం నేర్చుకున్నారు. తిరిగి తీసుకొచ్చి ఆ విగ్రహాలను ఇచ్చేసారు.

Video Advertisement

ప్రస్తుతం వీరి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన విన్నాక కొందరు భక్తితో తన్మయత్వం పొందుతుంటే…. మరి కొందరు దేవుడితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అంటూ సెటైర్ లు వేస్తున్నారు.

idols 1

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని బాలాజీ ఆలయంలో వారం రోజుల క్రితం దొంగిలించిన ‘అష్టధాతువు’తో చేసిన విలువైన విగ్రహాలను గుర్తుతెలియని దొంగలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసారు. అయితే ఆ విగ్రహాలను తిరిగి ఇచ్చేస్తూ అందులో ఓ నోట్ ను కూడా పెట్టారు. ఈ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ నోట్ లో ఆ దొంగలు ఏమి రాసారంటే.. ” దొంగతనం జరిగినప్పటి నుండి తమను పీడకలలు వెంటాడుతున్నాయని, అందుకే క్షమించమని కోరుతూ విగ్రహాలను తిరిగి ఇస్తున్నామని” రాసుకొచ్చారు.

idols 2

తరౌహా పట్టణంలో (చిత్రకూట్ జిల్లా) జై దేవదాస్ అఖారా లోపల నిర్మించిన బాలాజీ ఆలయ పూజారి మహంత్ రామ్ బాలక్ దాస్ 5 కిలోల శ్రీరాముడి విగ్రహం సహా లక్షల విలువైన 16 విగ్రహాలు ఉన్నాయని, వాటి దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఈ విషయం బయటకు వచ్చింది. మే 9వ తేదీ ఉదయం పూజారి భార్య ఆలయానికి చేరుకోగా, ఆలయం తాళం పగులగొట్టి ఉంది. లోపల విగ్రహాలు కూడా కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గుర్తించారు. దొంగతనం జరిగిన వారం తర్వాత మహంత్ మహావీర్ నగర్‌లోని తన ఇంటి ముందు దొంగిలించబడిన విగ్రహాలతో ఉన్న సంచిని గమనించారు. ఆ సంచిలో విగ్రహాలతో పాటు దొంగలు రాసిన లేఖ కూడా ఉంది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట్లో వైరల్ అవుతోంది.


End of Article

You may also like