ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 6 టైటిల్స్..! అవి ఏంటో తెలుసా..?

ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 6 టైటిల్స్..! అవి ఏంటో తెలుసా..?

by kavitha

Ads

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు మూవీ నుండి అప్ డేట్ వస్తుందంటే తెలుగు ఇండస్ట్రీలో సంద‌డి ఎలా ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స‌ర్కారు వారి పాట తరువాత మ‌హేష్ నుండి ఇప్పటివరకు కొత్త మూవీ రాలేదు.

Video Advertisement

మహేష్ బాబు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో వ‌స్తోన్న మ‌హేష్ 28వ చిత్రం షూటింగ్ మొదలయ్యి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. గత కొద్ది రోజుల నుండి ఈ మూవీ టైటిల్స్ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ సినిమా గురించి నెల రోజులుగా సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. మ‌హేష్ బాబు తండ్రి సూప‌ర్‌ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారని టాక్. మే 31న ఈ మూవీ నుండి అప్‌డేట్ వ‌స్తుంద‌ని మ‌హేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
సూప‌ర్‌ స్టార్ కృష్ణ మరణించిన తరువాత వస్తున్న మొదటి జయంతి కావడంతో ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులకు మూవీ అప్‌డేట్ తో సంతోషం కలిగించాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడ‌తార‌న్న‌ది ఇంకా  ఫైనల్ కాక‌పోయినా 6 టైటిల్స్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి ఏమిటంటే..
1. అయోధ్యలో అర్జునుడు:

అ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ  ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు గత ఏడాది ఒక వార్త వినిపించింది. అయోధ్య అంటే రాముడు గుర్తుకు వస్తాడు. అయితే రామాయణ, మహాభారతాలను కలుపుతూ త్రివిక్రమ్ ‘అయోధ్యలో అర్జునుడు’ అనే వెరైటీ టైటిల్ పెట్టారని టాక్.
2. అమ్మకథ:

ఆ మధ్య ఈమూవీకి ‘అమ్మకథ’ అనే టైటిల్‌ను పెట్టినట్లుగా సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. ఈ టైటిల్‌ కాస్త డీఫెరెంట్ గా ఉందనే టాక్ వచ్చింది. ‘అ’ సెంటిమెంట్‌ను ఇక్కడా వదలవా అని మహేష్‌ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై కామెంట్స్ చేశారు.
3. అమరావతికి అటు ఇటు:

ఇక టైటిల్స్‌ అన్నింటిలోకి  ‘అమరావతికి అటుఇటు’ అనే దాని పైనే ఎక్కువగా చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాకుండా  త్రివిక్ర‌మ్ సినిమాల టైటిల్స్ లో ‘అ’ అనే అక్ష‌రంతో మొదలవుతాయనే  విషయం తెలిసిందే. అది త్రివిక్ర‌మ్ సెంటిమెంట్.
4. గుంటూరు కారం:

ఇక అమరావతికి అటుఇటు తరువాత ‘గుంటూరు కారం’ అనే టైటిల్ కు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
mahesh-babu-rare-record25. ఊరికి మొనగాడు:
మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా టైటిల్ ఊరికి మొనగాడు. ఈమూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది.
6. పల్నాడు పోటుగాడు:

తాజాగా మరో టైటిల్ వినిపిస్తోంది. ‘పల్నాడు పోటుగాడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని వినిపిస్తోంది.ఈ మూవీ కథ పల్నాడు బ్యాగ్‌డ్రాప్‌తో సాగుతుందట. దాంతో ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్‌ అని భావిస్తున్నారంట.

Also Read: “ప్రభాస్” తో పాటు… “త్రిష” తో 3 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన 7 హీరోలు..!


End of Article

You may also like