Ads
ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. మొదటి వీక్ నామినేషన్స్ లో భాగంగా సరయు హౌస్ లో నుండి బయటికి వెళ్లిపోయారు.
Video Advertisement
మొదటి ఎపిసోడ్ చాలా గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. కంటెస్టెంట్స్ ఇంట్రడక్షన్ డాన్స్ పర్ఫార్మెన్స్ లు, బిగ్ బాస్ హౌస్ చూపించడం, ఇలా మొదటి ఎపిసోడ్ లో చాలా జరిగాయి. ఇంత ఆకర్షణీయమైన ఎపిసోడ్ కి ఖర్చు కూడా అంతే అయ్యింది. ప్రీమియర్ ఎపిసోడ్ కి మాత్రమే అయిన ఖర్చు దాదాపు 2.5 కోట్లు. కంటెస్టెంట్స్ డ్రెస్సింగ్ కి, మేకోవర్ కి, క్వారంటైన్ ఖర్చులకి అంతా కలిపి 2.5 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. గత సీజన్లతో పోలిస్తే ఈ ప్రీమియర్ ఎపిసోడ్ కి ఎక్కువ మొత్తంలోనే డబ్బులు ఖర్చు చేశారు.
కానీ ప్రీమియర్ ఎపిసోడ్ టీఆర్పీ మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. మొదటి సీజన్ కి 16.8, రెండవ సీజన్ కి 15.05, మూడవ సీజన్ కి 17.92, నాలుగో సీజన్ కి 18.5 రేటింగ్ వచ్చింది. కానీ 5వ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ కి మాత్రం 15.7 రేటింగ్ వచ్చింది. అలా అనుకున్న స్థాయిలో టీఆర్పీ రాలేదనే చెప్పాలి. ఏదేమైనా కానీ, సీజన్ ముందుకు వెళ్ళే కొద్దీ టీఆర్పీ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటుంది. ఇంక వీకెండ్ ఎపిసోడ్స్ కి అయితే టాప్ స్థాయి టీఆర్పీ వస్తుంది.
End of Article