మొట్టమొదటి ఐపీఎల్ లో విరాట్ ని RCB ఎంతకి కొనుగోలు చేసిందో తెలుసా..?

మొట్టమొదటి ఐపీఎల్ లో విరాట్ ని RCB ఎంతకి కొనుగోలు చేసిందో తెలుసా..?

by Megha Varna

Ads

విరాట్ కోహ్లీ కి ఉన్న క్రేజ్ గురించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విరాట్ కెరియర్ మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత కాస్త టీం లో ఎదిగాడు.

Video Advertisement

కొన్ని మైలురాళ్ళను కూడా అతను రీచ్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ విషయానికి వస్తే… మొట్టమొదటి ఐపీఎల్ లో చాలా తక్కువకు బెంగళూరు జట్టు యాజమాన్యం విరాట్ ని కొనుగోలు చేయడం జరిగింది.

ఇక విరాట్ కోహ్లీ ని ఎంతకు కొనుగోలు చేశారు అనేది చూస్తే… 2008వ సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు… విరాట్ కోహ్లీ మలేషియాలో జరిగిన ప్రపంచ కప్ లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే అప్పుడు బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ ని 13 లక్షలకు కొనుగోలు చేసింది.

ఇదిలా ఉంటే దీని గురించి కోహ్లీ చెప్తూ.. అండర్ 19 ప్రపంచ కప్ కోసం మలేషియా వెళ్లామని.. ఎంతకు మమ్మల్ని కొనుగోలు చేయాలి అనే దాని మీద ఆంక్షలు ఉన్నాయి అని చెప్పాడు. అయితే అప్పుడు అతన్ని కొనుగోలు చేసిన ధరని చూసి షాక్ అయ్యాను అని కూడా అన్నాడు విరాట్ కోహ్లీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కి కోహ్లీ 2013 నుండి 2021 వరకు కూడా కెప్టెన్ కింద బాధ్యత వహించాడు. కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఇచ్చింది ఈ జట్టు. అలానే గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలు చాలానే వున్నాయి.
అయితే విరాట్ ఈ మధ్యే కెప్టెన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక 2022 కోసం అతనిని 15 కోట్ల కి కొనుక్కుంది రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు.


End of Article

You may also like