మీరు ఎప్పుడైనా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తరువాత అవి నకిలీ నోట్లని తెలిస్తే ఏమి చేయాలో తెలుసా..?

మీరు ఎప్పుడైనా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తరువాత అవి నకిలీ నోట్లని తెలిస్తే ఏమి చేయాలో తెలుసా..?

by Anudeep

Ads

మనం ఏదైనా కిరాణా షాపు కు వెళ్లి ఒక ఐదొందల రూపాయల నోటు ఇస్తే.. ఆ షాపు అతను దానిని కనీసం రెండు, మూడు సార్లు అయినా అటు ఇటు తిప్పి చూసుకుని, అది నకిలీది కాదు అని తేలిన తరువాత మనకు ఇవ్వాల్సిన చిల్లరను ఇస్తాడు. మనం కూడా అంతే కదా.. ఎవరి వద్ద నుంచి అయినా ఎక్కువ మొత్తం లో డబ్బు తీసుకున్నప్పుడు.. వారు అపరిచితులు అయితే, ఆ నోట్లు అసలువేనా కాదా అని చెక్ చేసుకుంటాం.

Video Advertisement

fake note from atm 2

అదే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే.. అది వన్ వే ట్రాఫిక్ లాంటిది. వస్తే తీసుకోవడమే తప్ప… ఆ నోట్ ఎలా ఉన్నా.. ఇదేంటి అని అడగడానికి అక్కడ ఎవరు ఉండరు. ఎప్పుడైనా.. మీరు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకున్నాక, అవి నకిలీ నోట్లు అని తేలితే ఎలా..? అని డౌట్ వచ్చిందా..? అలా జరిగినపుడు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

fake note from atm 1

డబ్బులు డ్రా చేసాక, సరిచూసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ, నకిలీ నోట్లు వస్తే మీరు ఏటీఎం రూమ్ లోపల వున్న సెక్యూరిటీ కెమెరా వద్ద ఆ నోట్ ను చూపించండి. ఆ తరువాత, బయట సెక్యూరిటీ గార్డ్ ఉంటె.. ఆ విషయాన్నీ అతని దృష్టి కి తీసుకెళ్లండి. మీరు విత్ డ్రా చేసిన తరువాత వచ్చిన స్లిప్ తీసుకుని సమీపం లో ఉన్న బ్యాంకు బ్రాంచ్ వద్దకు వెళ్లి రాత పూర్వకం గా కంప్లైంట్ చేయండి. ఆ తరువాత వారి వద్ద నుంచి మీరు అక్నాలెడ్జిమెంట్ ను కూడా తీసుకోవాలి. విచారణ పూర్తి అయ్యాక, బ్యాంకు వారు మీ వద్ద ఉన్న నకిలీ నోట్ ను తీసుకుని.. మీకు కొత్త నోట్ ను ఇస్తారు.


End of Article

You may also like