“ప్యూరిఫైయర్” లలో ఉండే RO, UV, UF కి మధ్య తేడాలు ఏంటి..? వీటిలో ఏ నీళ్లు తాగితే మంచిది..?

“ప్యూరిఫైయర్” లలో ఉండే RO, UV, UF కి మధ్య తేడాలు ఏంటి..? వీటిలో ఏ నీళ్లు తాగితే మంచిది..?

by kavitha

Ads

మన శరీరానికి గాలి, ఆహారం అనేవి ఎంత ముఖ్యమో తాగే నీరు అంతే ముఖ్యం అని చెప్పవచ్చు. కానీ పర్యావరణ కాలుష్యం, సహజ వనరుల క్షీణత వల్ల స్వచ్ఛమైన నీరు దొరకడం కష్టంగా మారింది. అందుకే స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రస్తుతం చాలా మంది తమ ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫైయర్‌లను వినియోగిస్తున్నారు. వాటర్ ప్యూరిఫైయర్ అనేది ప్రస్తుతం అనివార్యంగా మరిందని చెప్పవచ్చు.

Video Advertisement

ఈ వాటర్ ప్యూరిఫైయర్లలో కూడా RO, UV మరియు UF వంటి చాలా రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అసలు RO, UV మరియు UF వాటర్ ప్యూరిఫైయర్లు అంటే ఏమిటి? వీటిలో ఏ వాటర్ ప్యూరిఫైయర్ నీరు తాగితే మంచిది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
RO వాటర్ ప్యూరిఫైయర్:

దీనిలో మొదట నీటిని ro ఛాంబర్లోకి పంపిస్తారు. ఈ ఛాంబర్లో ఉండే మెంబ్రేన్ ఫిల్టర్స్ లోకి నీటిని హై ప్రెజర్ తో పంపిస్తారు. స్వచ్చమైన నీరు మాత్రమే మెంబ్రేన్ ఫిల్టర్స్ నుండి బయటకు వస్తుంది. నీటిలో ఉండే బాక్టీరియా మరియు వైరస్ లు, క్లోరిన్, ఫ్లోరైడ్ లాంటి కెమికల్స్ ఈ మెంబ్రేన్ దగ్గరే ఆగిపోయి, స్వచ్చమైన నీరు మాత్రమే బయటికి వస్తుంది. ఇలా నీటిలో ఉన్న కెమికల్స్ ను, సాల్ట్స్ ను కేవలం RO టెక్నాలజీ మాత్రమే తొలగించగలదు.ఈ RO వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా వచ్చే నీరు ఎలాంటి స్మెల్, బాక్టీరియా మరియు వైరస్ లు లేకుండా 99% స్వచ్చంగా ఉంటుంది.
UV వాటర్ ప్యూరిఫైయర్:

ఈ ప్యూరిఫైయర్ నీటిని శుభ్రపరచడానికి UV రేడియేషన్ ఉపయోగిస్తారు. దీనిలో కూడా RO మాదిరిగానే UV ఛాంబర్ ఉంటుంది. ఈ ఛాంబర్ కి రెండు హోల్స్ ఉంటాయి. నీరు ఒక హోల్ నుండి ఛాంబర్ లోకి వెళ్ళగానే uv లైట్ UV కిరణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. నీటిలో ఉన్న బాక్టీరియా, మరియు వైరస్ లను UV కిరణాలను చంపేస్తాయి. ఈ టెక్నాలజీ వల్ల 99% బాక్టీరియా, వైరస్ లు చనిపోతాయి. కానీ నీటిలోని కెమికల్స్ ను, సాల్ట్స్ ను తొలగించలేదు. అలాగే నీటిలోని మినరల్స్ ను కూడా తొలగించలేదు.UF వాటర్ ప్యూరిఫైయర్:

ఈ వాటర్ ప్యూరిఫైయర్ కి కరెంట్ అవసరం లేదు. ఈ ప్యూరిఫైయర్ లో చిన్న చిన్న మెంబ్రేన్స్ ఉంటాయి. వీటికి ఉండే హోల్స్ వెంట్రుక కన్నా 30 రేట్లు చిన్నగా ఉంటాయి. అందువల్ల బాక్టీరియా, వైరస్ లు బయటికి వెళ్లలేవు. కానీ బాక్టీరియా, వైరస్ కంటే చిన్నవిగా ఉండే సాల్ట్స్, కొన్ని రకాల కెమికల్స్, బాక్టీరియా యొక్క గుడ్లను మాత్రం ఆపలేవు.ఇక వీటిలో ఏది ఉపయోగించాలి అనేది మనం వాడే వాటర్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలో తెలుసుకోవాలంటే మీ వాటర్ యొక్క TDS అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలీడ్స్ యొక్క వాల్యూని తెలుసుకోవాలి. మీ వాటర్ TDS 100 – 300 ఉంటే UV, UF వాటర్ ప్యూరిఫైయర్ వాడొచ్చు. TDS 300 – 500 ఉంటే UV, UF వాటర్ ప్యూరిఫైయర్ వాడొచ్చు. ఇక TDS  500- 2000 ఉంటే తప్పనిసరిగా RO వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

watch video: 

Also Read: భారతదేశపు మొదటి AC రైలు చూశారా..? ఇందులో చల్లదనం రావడానికి ఏం చేసేవారో తెలుసా..?


End of Article

You may also like