గుళ్ళల్లో ఎర్ర దారాలు ఎందుకు కడతారు..? దీని వెనుక ఇంత కథ ఉందా?

గుళ్ళల్లో ఎర్ర దారాలు ఎందుకు కడతారు..? దీని వెనుక ఇంత కథ ఉందా?

by Anudeep

Ads

మనం ప్రశాంతత కోసం గుడికి వెళ్తూ ఉంటాం.. ఎప్పుడైనా వీలు చూసుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఇలా మనం ఏదైనా ప్రత్యేక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ గుడి బయట ఇచ్చే దారాలను కొనుక్కుంటాం. దాదాపు అని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల బయటా ఇలా తాయత్తులు, ఎర్ర దారాలను అమ్ముతూ ఉంటాము.

Video Advertisement

mouli thread

అసలు వీటిని ఏమంటారో తెలుసా? ఇవి ఎందుకు కట్టుకుంటారో.. దీని వెనుక కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణం గా ఈ దారాలు ఎరుపు, నారింజ, పసుపు రంగులు కలగలిపి ఉంటాయి. వీటిని “మౌళి” అని పిలుస్తారట. ఈ దారాలను మౌళి అని ఎందుకు పిలుస్తారో తెలియాలంటే పురాణాల్లో బలి చక్రవర్తి గురించి, ఆయన దాన ధర్మాల గురించి తెలియాలి.

mouli thread 3

బలి చక్రవర్తి తన వద్దకు వచ్చిన వారిని అడిగింది లేదనకుండా దానం చేసేవాడు. తద్వారా ఎనలేని కీర్తి ప్రఖ్యాతలు గడించాడు. అయితే బలి దానవ రాజు. బలిని అంతమొందించాలన్న ఉద్దేశ్యం తో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. బ్రాహ్మణ రూపం ధరించి బలి వద్దకు వెళ్తాడు. తనకు మూడు అడుగుల నేల దానంగా కావాలని అడుగుతాడు. బలి ఇస్తాను అని చెప్పగానే.. వామనుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. ఒక అడుగు నేలపైన, ఒక అడుగు ఆకాశం పైన పెడతాడు.

mouli thread 1

మరొక అడుగు ఎక్కడ పెట్టాలని అడుగగా.. బలి చక్రవర్తి తన శిరస్సుపైన ఉంచమని శిరస్సుని చూపిస్తాడు. అలా శ్రీ మహా విష్ణువు మూడవ అడుగుని బలి చక్రవర్తి శిరస్సుపైన ఉంచి పాతాళానికి నెట్టేస్తాడు. అయితే.. ప్రాణాలను పణంగా పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బలిపై శ్రీమహా విష్ణువు అభిమానం పెట్టుకుంటాడు. బలికి మృత్యుంజయుడిగా వరం ఇస్తూ.. మౌళి దారాన్ని బలి చేతికి కడతాడు.

mouli thread 4

ఈ మౌళి దారం మూడు రంగులతో ఉంటుంది. ఎరుపు, పసుపు, నారింజ రంగుల దారాలు కలగలిపి ఉండే ఈ మౌళి దారం కట్టుకోవడం వలన గ్రహపీడలు తొలగి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. ఈ దారాలు కంకణంలా ధరించడం వల్ల ఆర్ధిక ఇక్కట్లు రావని… ఈ మూడు రంగులు బుధుడు, కుజుడు, సూర్యుడులను ప్రతిబింబిస్తాయని.. ఈ దారాన్ని ధరిస్తే వారి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు.


End of Article

You may also like