Round పిజ్జా Square బాక్స్ లో ఎందుకు ప్యాక్ చేస్తారు.? వెనకున్న 4 కారణాలు ఇవే.!

Round పిజ్జా Square బాక్స్ లో ఎందుకు ప్యాక్ చేస్తారు.? వెనకున్న 4 కారణాలు ఇవే.!

by Sainath Gopi

Ads

సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండేవి ఫాస్ట్ ఫుడ్స్. కాలం ఏదైనా, వాతావరణం ఎలా ఉన్నా, ఏ సమయం అయినా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో జనాలు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు బయటికి వెళ్లడం కష్టం. అయినా సరే ఆన్లైన్ ద్వారా ఫుడ్ తెప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో పిజ్జా కి ప్రత్యేక స్థానం ఉంది. పానీపూరి తర్వాత అంత క్రేజ్ ఉన్నది బహుశా పిజ్జా కే ఏమో. పిజ్జా ఒక ఇటాలియన్ ఫుడ్ ఐటమ్. కానీ దానికి ఎన్నో ఫ్లేవర్స్ తో వివిధ ప్రాంతాల టచ్ యాడ్ చేస్తున్నారు.

Video Advertisement

అందుకే పిజ్జా కి ప్రపంచ మొత్తంలో ఏ ప్రాంతంలో అయినా సరే చాలా క్రేజ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా? పిజ్జా రౌండ్ గా ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ పిజ్జా ప్యాక్ చేసే బాక్స్ మాత్రం స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఇది కూడా అందరికీ తెలుసు. కానీ అలా ఎందుకు ఉంటుందో తెలుసా? పిజ్జా ప్యాక్ చేసే బాక్స్ స్క్వేర్ షేప్ ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.

 

# స్క్వేర్ షేప్ లో ఉన్న బాక్స్ తయారుచేయడం చాలా సులభం. అంటే ఒక కార్డ్ బోర్డ్ ని స్క్వేర్ షేప్ లో కట్ చేయడం సులభం. అదే సర్కిల్ షేప్ లో కట్ చేయాలంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు మిషన్ అవసరం కూడా పడుతుంది.

# స్క్వేర్ షేప్ లో ఉన్న బాక్స్‌లు ఎరేంజ్ చేసినప్పుడు కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. స్టాక్స్‌ మధ్యలో గ్యాప్స్ ఉండవు. అదే సర్కిల్ షేప్ లో ఉన్న బాక్స్ అంత ఈజీగా ఎరేంజ్ అవ్వదు. అసెంబుల్ చేయడానికి చాలా టైం పడుతుంది. దీని వల్ల రెస్టారెంట్ వాళ్లకి, ఒక పిజ్జా ఆర్డర్ సిద్ధం చేయడానికి ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది.

# ఒకవేళ పిజ్జా బాక్స్ సర్కిల్ షేప్ లో ఉంటే బాక్స్ లో నుంచి పిజ్జా స్లైస్ తీసుకోవడం కష్టమవుతుంది. స్క్వేర్ బాక్స్ అయితే సైడ్స్ వెడల్పుగా ఉంటాయి కాబట్టి బాక్స్ లో నుంచి పిజ్జా స్లైస్ సులభంగా తీసుకోవచ్చు.

# ఇవన్నీ కాకుండా స్క్వేర్ షేప్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. ఎందుకంటే ఒక స్క్వేర్ బాక్స్ తయారుచేయడానికి ఒక్క కార్డ్ బోర్డ్ షీట్ అయితే సరిపోతుంది. అదే ఒకవేళ సర్కిల్ షేప్ బాక్స్ తయారు చేయాలి అంటే ఎక్కువ సైడ్స్ కట్ చేయాలి. అలా చేస్తే ఎక్కువ కార్డ్ బోర్డ్ కూడా కావాల్సి వస్తుంది.


End of Article

You may also like