ఏరోప్లేన్స్ లో స్మోకింగ్ నిషేధం అయినా యాష్ ట్రే ని ఎందుకు ఉంచుతారు..? అసలు కారణం ఇదే..!

ఏరోప్లేన్స్ లో స్మోకింగ్ నిషేధం అయినా యాష్ ట్రే ని ఎందుకు ఉంచుతారు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

పబ్లిక్ ప్రదేశాలలో, ప్రయాణ సాధనలలో మద్యం, పొగ త్రాగడం అనేవి నిషేధం. మన దేశం లో అన్ని చోట్ల ఈ నిషేధాన్ని కఠినంగా అమలుపరుస్తారు. ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటారు. విమానంలో కూడా ఫైర్ ని కలిగించే సాధనాలను అనుమతించరు. విమానాలలో కూడా పొగ త్రాగడం పై నిషేధం ఉంది. మరి రెస్ట్ రూమ్స్, లావెటరీ వంటి చోట్ల యాష్ ట్రే లను ఎందుకు ఉంచుతారు..?

Video Advertisement

No smoking in aeroplanes

ఈ విషయాన్నీ ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. మీరు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా వాష్ రూమ్ ని గమనించారా? అందులో ఓ చోట యాష్ ట్రే ని కూడా ఏర్పాటు చేసి ఉంచుతారు. నిజానికి విమాన ప్రయాణాల్లో పొగ త్రాగడం నిషేధం. కానీ చట్ట బద్ధమైన రూల్స్ వల్ల విమానాల్లో కూడా యాష్ ట్రే లను ఏర్పాటు చేస్తారు. ఈ రూల్స్ ఎందుకు పెడతారు అంటే.. కొంతమంది నిరంతరం హెచ్చరికలు చేస్తున్నా కూడా ధూమపానం చేయడాన్ని వదిలిపెట్టరు.

No smoking in aeroplanes

అందుకే ఏ విమాన సంస్థ అయినా తమ విమానాలను యాష్ ట్రే లేకుండా నడపదు. అమెరికా లో విమానం లో పొగ త్రాగడానికి అనుమతి ఉన్నా లేకపోయినా.. రెస్ట్ రూమ్స్ లో డోర్ కు వెనుక భాగంలో మాత్రం విధిగా యాష్ ట్రే ను ఉంచాలి అన్న నియమం ఉంది. అలాగే.. 72 గంటల్లోపు ఈ యాష్ ట్రే ను ఖాళీ చేసి..క్లీన్ చేసి ఉంచాలి. ఇక.. ఈ యాష్ ట్రే ఉండాలి అన్న చట్టపరమైన నియమం ఎందుకు ఉందొ ఇప్పుడు చూద్దాం.

No smoking in aeroplanes

చాలా మంది ప్రయాణికులు నియమాలకు వ్యతిరేకంగా స్మోకింగ్ చేస్తూ ఉంటారు. ఆ సమయాల్లో సేఫ్టీ కూడా ముఖ్యమే కాబట్టి విమాన సంస్థలు తప్పనిసరిగా రెస్ట్ రూమ్ డోర్ కి సమీపంలో యాష్ ట్రే లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. కేవలం ధూమానం వల్ల వచ్చే బూడిదని మాత్రమే కాదు.. ఇతర ఫైర్ సంబంధిత వ్యర్ధాలను కూడా ఇందులో పడవేస్తుంటారు. గతంలో కొన్ని సంఘటనలు కొన్ని అనుభవాలని నేర్పాయి. కొందరు తమ సిగరెట్లను డిస్పోజ్ చేయడానికి లావెటరీ పేపర్ ను ఉపయోగించారు. దీనివల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. అందుకే విమాన సంస్థలు విధిగా యాష్ ట్రే ను ఏర్పాటు చేస్తాయి.


End of Article

You may also like