జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రామ మందిరం నిర్మాణ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల నుండి 7000 మంది విశిష్ట అతిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే దేశం మొత్తం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో మునిగిపోయి ఉంది. జనవరి 22వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సంస్థల అందరికీ కూడా ఒక పూట సెలవు ప్రకటించారు.
దేశంలోని హిందువులందరూ ఆ రోజు పండుగ రోజుగా జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రామనామస్మరణతో పూజలు మొదలయ్యాయి. అయితే రామ మందిరం నిర్మాణ ట్రస్టు స్వయంగా వెళ్లి చాలామంది అతిధులకు ఆహ్వానాల అందించగా చాలా మంది ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి రావడానికి సుముఖత చూపించారు.అయితే వీరిలో కొందరైతే మందిర ప్రారంభోత్సవాన్ని తిరస్కరించారు. ఒకసారి ఆహ్వానాన్ని తిరస్కరించిన వారి లిస్టును పరిశీలిస్తే.
1. రాహుల్ గాంధీ:
జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా ఆయన రావడానికి సుముఖత చూపించలేదని తెలిసింది.

2. శరధ్ పవర్:
దేశ రాజకీయాల్లో కీలక నేతైన శరధ్ పవర్ కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత దర్శనానికి వెళ్తానని తెలియజేశారు.

3. లాలూ ప్రసాద్ యాదవ్:
ఆర్ జె డి పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన వారిలో ఉన్నారు.

4. మల్లికార్జున్ ఖర్గే:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదు.

5. సీతారాం ఏచూరి:
సిపిఐ నాయకుడు సీతారాం ఏచూరి కూడా రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం తిరస్కరించిన వారిలో ఉన్నారు.

6.అఖిలేష్ యాదవ్:
సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని తెలిపారు.

7. శంకరాచార్య:
ప్రముఖ ఆచార్యులు దిశంకరాచార్య కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని తెలిపారు.


2010 ఏప్రిల్‌లో షోయబ్ మాలిక్, సానియా మీర్జాల పెళ్లి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఆ సమయంలో వీరి వివాహం పై పెద్ద ఎత్తున్న చర్చలు జరిగాయి. ఈ జంటకు కుమారుడు ఇజాన్ 2018లో జన్మించారు. సానియా, మాలిక్ మధ్య విభేదాలు వచ్చినట్టు రెండు సంవత్సరాలుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇజాన్ సానియా దగ్గరే దుబాయ్ లో ఉండగా, షోయబ్ మాలిక్ ఎక్కువగా పాక్ లో ఉంటున్నాడు. విడాకుల పై ఇద్దరు బహిరంగంగా మాట్లాడలేదు.
కానీ నెట్టింట్లో క్రిప్టిక్ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే విడాకులు ఇంకా కష్టం అంటూ సానియా పోస్ట్ షేర్ చేసింది. దాంతో విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. సనా జావేద్‌ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.
ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్‌లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకుంది. 2023లో నవంబర్ 28న అతనికి విడాకులు ఇచ్చింది. తాజాగా షోయబ్ మాలిక్‌ని రెండవ సారి పెళ్లి చేసుకుంది. మాలిక్, సనా జావేద్ రిలేషన్ లో ఉన్నారని గత ఏడాది నుండి రూమర్లు వస్తున్నాయి.
బాలీవుడ్ లో గోల్మాల్, సింగమ్ సిరీస్, సింబ, సూర్యవంశీ వంటి సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించాడు. వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి, నికితిన్ ధీర్, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విహాయనికి వస్తే, దేశరాజధాని డిల్లీలో వరుసగా బాంబు పేలుళ్లు జరగడంతో ఢిల్లీ పోలీసులు షాక్ అవుతారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగానికి చెందిన కమిషనర్ అయిన విక్రమ్ బక్షి (వివేక్ ఒబెరాయ్), డిప్యూటీ కమిషనర్ అయిన కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా) లకు పేలుళ్లకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకునే బాధ్యతను అప్పగిస్తారు. గుజరాత్ ఏటీఎస్ చీఫ్ అయిన తారా శెట్టి (శిల్పా శెట్టి) టెర్రరిస్టులను పట్టుకోవడంలో కబీర్ మరియు విక్రమ్ బక్షికి సహాయం చేస్తుంది. అసలు బాంబు పేలుళ్ల వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? జరార్ హైదర్ (మాయాంక్ టాండన్) కు పేలుళ్లకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ కేసును కబీర్, విక్రమ్ ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ.
రోహిత్ శెట్టి చిత్రాలలోని హీరోల తరహాలోనే సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ పాత్రలు ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్ శిల్పా శెట్టి పాత్ర కూడా అలానే ఉంటుంది. నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్స్ మరియు ఛేజింగ్ సీన్స్ చక్కగా రూపొందించబడ్డాయి.














శాంతా దేవీ ఎవరో కాదు. శ్రీరాముడి అక్క. ఈ విషయం చాలా మందికి తెలియదు. దశరథ మహారాజు, కౌసల్యల కుమార్తె శాంత దేవి. శాంతా దేవీకి ప్రత్యేకమైన జ్ఞానం కల అందమైన స్త్రీ. పురాణాల ప్రకారం, దశరథ మహారాజు శాంత దేవిని అంగదేశ మహారాజు రోమపాదకు దత్తత ఇచ్చాడు. రోమపాదుడు ఒకసారి దశరథుడిని కలవడానికి, భార్యతో పాటు అయోధ్యకు వచ్చాడు. అక్కడ దశరథుడి కుమార్తెను చూసిన రోమపాదుడు తమకు పిల్లలు లేరని బాధపడుతుండడం చూసిన దశరథుడు తన ఒక్కగానొక్క కుమార్తె శాంతను వారికి దత్తత ఇస్తాడు.
అలా అంగ దేశానికి శాంతా దేవీ యువరాణి అవుతుంది. ఒకసారి రోమపాదుడు తన కుమార్తె శాంతా దేవీతో మాట్లాడుతున్న సమయంలో ఓ బ్రాహ్మణ యువకుడు రాజు దగ్గరికి వర్షాకాల పంటను పండించడానికి సాయం అడగడానికి వచ్చాడు. అయితే రాజు ఆ యువకుడి విన్నపాలను పట్టించుకోడు. రాజు శ్యామ్ కోసం ఎదురుచూసిన ఆ యువకుడు అక్కడి నుండి వెళ్లిపోతాడు. తన భక్తుడిని రాజు పట్టించుకొకపోవడంతో వర్ష దేవత ఇంద్రాదేవి ఆగ్రహిస్తుంది. దాంతో రాజ్యంలో వర్షాలు కురవకపోవడంతో ప్రజలంతా ఇబ్బంది పడతారు.
అప్పుడు రోమపాద మహారాజు ఋషిశృంగుని దగ్గరకు వెళ్లి యజ్ఞం చేయమని అడుగుతాడు. యజ్ఞం చేయడంతో వర్షాలు పడి, దేశంలో కరువు తగ్గుతుంది. అందుకు సంతోషించిన రోమపాదుడు శాంతా దేవీను ఋషిశృంగునికి ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. దశరథుడు సంతానం కోసం తలపెట్టిన పుత్రకామేష్ఠి యజ్ఞంను ఋషిశృంగుడు జరిపిస్తాడు. ఆ యజ్ఞం వల్ల రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో కులులో శాంతా దేవీ, ఋష్యశృంగుని ఆలయం ఉంది. దేశం నాలుగు మూలల నుంచి భక్తులు వచ్చి శ్రీరాముడి అక్క శాంతాదేవిని పూజిస్తారు. విజయదశమి సందర్భంగా ఈ గుడిలో ప్రత్యేక పూజలను చేస్తారు.
500 ఏళ్ళ పోరాటం తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సాకారం అయ్యింది. ఇది కోట్లాది మంది హిందువుల కల. అందువల్లే రామ మందిరం నిర్మాణం కోసం కోట్ల రూపాయల రామ భక్తులు అందించారు. అయోధ్య రామ మందిర నిధి సేకరణలో దేశంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రామమందిరం కోసం కావాల్సిన 118 దర్వాజాలు హైదరాబాద్ లోనే రూపొందాయి.
ఇక అయోధ్య రామయ్య కోసం బంగారు పాదుకలను తయారు చేసే అదృష్టం కూడా హైదరాబాద్ కే దక్కింది. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ వారు దాదాపు రూ.1.03 కోట్ల విలువ కల బంగారం పాదుకలను అయోధ్యకు పంపించింది. భక్తుల ఈ పాదుకలను శ్రీరామ భజనలతో పాదయాత్రగా తీసుకెళ్లారు. శ్రీ రాముడికి పాదుకలు తయారు చేసి పంపించడం తమ సంస్థ చేసుకున్న భాగ్యమని సీతారామ ఫౌండేషన్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి వెల్లడించారు.
సుమారు పదమూడు కేజీల బరువుతో చేసిన వెండి పై బంగారు తాపడంతో తయారు చేసిన పాదుకలను సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో హస్మత్ పేటలోని శ్రీ మద్విరాట్ కళా కుటీర్ లో రూపొందించారు. లోహశిల్పి పిట్టంపల్లి రామలింగా చారి ఈ పాదుకలను ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించి రూపొందించారు. ఆలయ ట్రస్ట్ ఈ బంగారు పాదుకలను ఇప్పటికే అయోధ్య రామ మందిరంకు చేర్చారు.



విగ్రహాం కింది భాగంలో 3 ఫ్లోర్లు కలవు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 4 హాళ్లను నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున నిర్మించారు. వీటిలో ఒక సినిమా హాలు, మూడు హాళ్లలో డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి ఫ్లోర్లో 4 హాళ్లు, రెండవ ఫ్లోర్లో 4 హాళ్లు కలవు. అంబేద్కర్ విగ్రహం మరియు స్మృతివనంకోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే తెలంగాణలో మాజీ సీఎం కేసిఆర్ 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గత ఏప్రిల్ లో ఆవిష్కరించారు. అయితే ఆ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
తాజాగా విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంను టిడిపి దళిత నాయకులు సందర్శించారు. ఈ క్రమంలో తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని రూ.150 కోట్ల రూపాయలలోపే ఏర్పాటు చేశారు. విజయవాడలో అంతే ఎత్తు అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు మాత్రం 400 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయ్యిందని టీడీపీ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. నక్కా ఆనంద్ బాబు “తమ ప్రభుత్వం ఉన్నప్పుడే 137 కోట్ల రూపాయలతో స్మృతివనం ఏర్పాటుకోసం పనులను మొదలుపెట్టామని, 26 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.
అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పీఎం మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఆయన చేతుల మీదుగా అయోధ్య రామమందిర గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. ఈ క్రమంలోనే జనవరి 12న అనుష్ఠాన కార్యక్రమాన్నిమొదలుపెట్టారు. అప్పుడే 11 రోజుల పాటు అనుష్ఠాన దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు నుండి ప్రధాని నరేంద్ర మోదీ కఠిన దీక్ష చేస్తున్నారు.
ఈ దీక్షలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. ప్రధాని మోదీ ఆహారం తీసుకోకుండా కొబ్బరి నీళ్లను మాత్రమే తీసుకుంటూ, నేలపై నిద్రపోతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఈ దీక్షలో భాగంగా ఎనిమిదవ రోజు సైతం ఆహారం తినకుండా కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించాయి. మోదీ ఈ దీక్షలో భాగంగా కఠినమైన నియమాలు, వ్యాయామాన్ని పాటిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రధాని మోదీ కఠిన దీక్షలో ఉన్నా, పర్యటనలు విస్తృతంగా చేస్తూనే ఉన్నారు. గత వారంలో కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పర్యటించి, పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. శంకుస్థాపనలు చేశారు. అంతే కాకుండా ఆ రాష్ట్రాలకు వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న పలు దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రతినిధిగా తనను ఆ అయోధ్య రాముడు ఎంపిక చేసుకున్నాడని ప్రధాని చెప్పుకొచ్చారు.