సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి లాంటి ఒక్క సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు యానిమల్ అంటూ బాక్సాఫీస్ ను వణికిస్తున్నాడు. వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీలో యాక్టర్ల నటన అన్నిటికంటే హైలెట్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ చిత్రాన్ని ముఖ్యంగా నలుగురు తమ భుజాన మోశారు.. అందులో ఒకరు హీరో రణబీర్ కపూర్ అయితే ఇంకొకళ్ళు విలన్ బాబీ డియోల్. వీళ్ళిద్దరి తర్వాత ఆ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించింది రష్మిక ,అనిల్ కపూర్.

ఇంత భారీ చిత్రాని హిట్ దశగా నడిపించిన ఈ నలుగురు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. 250 కోట్ల బడ్జెట్ తో తరికెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 1000 కోట్లకు పైగా వసూళ్లు తన ఖాతాలో వేసుకుంది. భార్య అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ మూవీ కోసం రణబీర్ కపూర్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు అన్న విషయం అతను బిల్ చేసిన మాసివ్ బాడీని చూస్తే అర్థమవుతుంది. ఏ మూవీ కోసం అతను అందుకున్న పారితోషకం అక్షరాల 70 కోట్లు. మరి సినిమాకి ప్రేక్షకులను పరుగులు పట్టించిన హీరో ఆ మాత్రం తీసుకోవాలి కదా.

రణబీర్ కపూర్ కి దీటుగా మంచి ఎక్స్ప్రెషన్స్ తో క్యారెక్టర్ ఇంటెన్సిటీని బాగా మెయింటైన్ చేసింది రష్మిక. ఇక ఈ చిత్రం కోసం ఆమె తీసుకున్న పారితోషకం అక్షరాల నాలుగు కోట్లు. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా చలామణి అయ్యి ఆ తర్వాత పెద్దగా చాన్స్ లేక సైలెంట్ అయిపోయిన నటుడు బాబి డియోల్. తిరిగి ఈ చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ ..ఈ మూవీకి తీసుకున్న పారితోషకం నాలుగు కోట్లు. మిస్టర్ ఇండియా గా బాలీవుడ్ లో ఇప్పటికీ యంగ్ హీరోలకి ధీటుగా గ్లామర్ మెయింటైన్ చేసే నిన్నటి తరం హీరో అనిల్ కపూర్.. ఈ మూవీ కోసం అతను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రెండు కోట్లు.
















ఇక చెన్నై బ్యూటి త్రిష ఇండస్ట్రీకి ఇచ్చి ఇరవైమూడు ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్స్ పది ఏళ్లలోనే పరిశ్రమ నుండి ఫేడ్ అవుట్ అయ్యే రోజుల్లో కూడా 23 ఏళ్లుగా అగ్ర నటిగా నిలదొక్కుకున్న ఘనత త్రిషాకే దక్కింది. ఆ మధ్య సరైన హిట్స్ లేక కాస్త వెనక్కి తగ్గిన ఆమె ps-1 సినిమాతో కమ్‌బ్యాక్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్రిష కెరీర్‌ను మళ్ళీ మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి మ్యాజిక్ చేసింది.
ఇక అసలు విషయంలోకి వస్తే త్రిష, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ ఒకే హీరోయిన్ కి లవర్ గా, మామగా, నాన్నగా, అన్నగా ఇలా అన్ని పాత్రల్లోనూ చేసిన ఒకే ఒక నటుడు ప్రకాష్ రాజ్, ఆ హీరోయిన్ త్రిష. ఇలా వీరు నటించిన ఆ సినిమాల్లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఆ ఘనత విరిద్దరికే దక్కుతుంది. ఆకాశమంతా సినిమాలో తండ్రి కూతుర్లుగా జీవించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ప్రేమించిన అబ్బాయి తండ్రిగా, కాబోయే కోడలికి మంచితనం గుర్తించే మామగా, సైనికుడు సినిమాలో విలన్ బావమరిదిగా, త్రిషకి వరుసకి అన్నగా చేసాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన గిల్లీ సినిమా,ఇది తెలుగులో మహేశ్ ‘ఒక్కడు’ సినిమాకి రీమేక్. ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటించగా, తమిళ్ లో త్రిష నటించింది.త్రిషను ప్రేమించే విలన్ గా రెండు చోట్లా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలా తండ్రీ కూతుళ్లు గా, నాయికా ప్రతినాయకులుగా ఎలా కనిపించినా కూడా ప్రకాశ్‌రాజ్, త్రిష కాంబోను ఇటు తెలుగు ఆడియెన్స్ , అటు తమిళ ఆడియెన్స్ ఆదరించారు. తాజాగా వీరిద్దరు ముఖ్య పాత్రలు పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’సూపర్ హిట్ అయ్యింది.


