దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ రెండవ త్రైమాసిక ఫలితాలను బుధవారం నాడు ప్రకటించారు. నికర లాభం భారీగా పెరిగి, రూ. 11,342 కోట్లుగా నమోదైంది. ఇదే విధంగా రూ. 17 వేల కోట్ల వాల్యూ షేర్ల బైబ్యాక్ ను ప్రకటించింది. ఒక్కో షేర్ కు రూ.4150 కాగా, రూ. 9 డివిడెండ్ ఒక్కో షేరు పై ప్రకటించింది.
అయితే ఫలితాల ప్రకటనతో పాటు షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. రెండవ త్రైమాసికంలో ఈ సంస్థ ఉద్యోగుల సంఖ్య 6,333 తగ్గినట్టుగా తెలిపింది. టీసీఎస్ అట్రిషన్ రేటు కూడా త్రైమాసికంలో 14.9శాతానికి తగ్గిపోయింది.
ఐటీ మేజర్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024 రెండవ త్రైమాసికంలో 6,333 మంది ఉద్యోగుల తగ్గి, మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కి చేరుకుంది. అయితే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7,186 తగ్గింది. టీసీఎస్ మొదటి త్రైమాసికంలో కేవలం 523 మంది ఉద్యోగుల్ని మాత్రమే కొత్తగా తీసుకుంది. అయితే ఉద్యోగుల వలసలు (అట్రిషన్ రేటు) 17.8 శాతం – 14.9 శాతానికి తగ్గిపోయింది.
టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గుదలతో ఐటీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో అయితే ఉద్యోగుల సంఖ్య వరుసగా పెరుగుకుంటూ వెళ్ళేది. ఈ కంపెనీలో సగానికిపైగా ఉద్యోగులు దాదాపు 2020 తర్వాత చేరారని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుకుంటూ వెళ్తోందంటే ఇది ఐటీ రంగానికే ప్రమాదం అని తెలుస్తోంది. ఇక ఐదే విధంగా ఇతర ఐటీ సంస్థలు అయిన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రోలో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గేపోయే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ అయిన అసెంచర్ ఇటీవల ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. కేవలం 951 మంది ఎంప్లాయీస్ ను మాత్రమే కొత్తగా తీసుకున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్లనే ఈ విధంగా జరుగుతున్నట్లుగా పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: టికెట్ లేకుండా “వందే భారత్ ఎక్స్‌ప్రెస్” ఎక్కిన పోలీస్..! కానీ ఆ తరువాత ఏం జరిగిందంటే..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ఐటీ ఉద్యోగులు దగ్గర నుండి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఖండిస్తూ వచ్చారు. నందమూరి కుటుంభ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఈ విషయం పై ఆ కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాకవపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన తారక్, కొంతకాలం నుండి పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండడం పై పార్టీ నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ కి మద్ధతుగా మాట్లాడుతున్నారు.
తాజాగా ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడం గురించి అడుగగా, రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఎన్టీఆర్ స్పందించకపోవడానికి రీజన్ సినిమాలతో బిజీగా ఉండడమే కారణం” అని తాను అనుకుంటున్నట్లుగా తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ తరువాత కరోనా, ఈ విరామంలో ఎన్టీఆర్ కనీసం 4 చిత్రాలు అయినా చేసేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ మీద దృష్టి పెట్టారని, పూర్తి సమయాన్ని దేవర కోసం కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ దృష్టి మొత్తం చిత్రాలపైనే పెట్టాలని అనుకుని ఉండొచ్చని తాను భావిస్తున్నట్టు” గా రాజీవ్ కనకాల తెలిపారు.
టోవినో థామస్-ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన మాయానది 2017లో మలయాళంలో రిలీజ్ అయిన డిఫరెంట్ ప్రేమ కథ. మొదటి షోతో యావరేజ్ టాక్ తెచ్చుకొంది. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టోవినో థామస్ ఉత్తమ నటుడు, ఉత్తమ క్రిటిక్స్ అవార్డ్, స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నారు. ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మాధవ్ (టోవినో థామస్) తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయి, ఒంటరిగా జీవిస్తుంటాడు. మాధవ్ డబ్బు కోసం తప్పుడు దారిలో నడుస్తుంటాడు. అయితే ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో కలిసిన అపర్ణ (ఐశ్వర్య లక్ష్మి)ని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వలన వారు విడిపోతారు. మాధవ్ కొన్ని రోజుల తరువాత ఒక మాఫియా డీలింగ్ సమయంలో అనుకోకుండా పోలీస్ అధికారిని చంపి, అక్కడి నుండి పారిపోతాడు.
ఇక ఆ రోజు నుండి పోలీసులు మాధవ్ కోసం వెతుకుతూ ఉంటారు. దాంతో మాధవ్ తన వద్ద ఉన్న డాలర్స్ ను ఇండియన్ కరెన్సీ లోకి మార్చి, దుబాయ్ వెళ్లి స్థిరపడాలని అనుకుంటాడు. అయితే తనతో పాటుగా తాను ప్రేమించిన అపర్ణను దుబాయ్ తీసుకుని వెళ్లాలని భావిస్తాడు. అయితే అపర్ణ అప్పటికే అతన్ని మర్చిపోయి, హీరోయిన్ గా స్థిరపడడానికి ప్రయత్నిస్తుంటుంది. తనను వెతుకుతున్న పోలీసుల నుండి తప్పించుకుని, మాధవ్ ఎలా అపర్ణను దుబాయ్ తీసుకువెళ్లాడు? ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
‘యాత్ర 2’ సినిమా నుంచి తాజాగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్ ల క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ గా కోలీవుడ్ హీరో జీవా నటించనున్నారు. ఈ పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఇద్దరు ఇన్టెన్స్ లుక్స్‌తో కనిపిస్తున్నారు.
మరో వైపు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఏం వైఎస్ జగన్ లైఫ్ లో జరిగిన పలు సంఘటనల ఆధారంగా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి వ్యూహం అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ను ప్రకటించాడు. ఈ సీక్వెల్‌కు శపథం అనే పేరు ఖరారు చేస్తూ, ఒకే పోస్టర్ లో వ్యూహం, శపథం చిత్రాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు. ఈ సినిమాలలో జగన్ క్యారెక్టర్ లో తమిళ హీరో అజ్మల్ నటిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ రెండు సినిమాలలో జగన్ పాత్రలలో నటిస్తున్న ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోలు ఒక మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా పేరు రంగం. ఈ సినిమాకి కె. వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. కార్తీక నాయర్ హీరోయిన్ గా నటించింది. జీవా, అజ్మల్ ఇద్దరు ఫ్రెండ్స్ గా నటించారు.
వందేభారత్ ట్రైన్స్ తో రైల్వే డిపార్ట్మెంట్ లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ రైళ్లు వేగవంతంగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. అది మాత్రమే కాకుండా ప్రయాణికుల కోరిక మేరకు ప్రతి నెలా కొత్త వందే భారత్ రైళ్లను మొదలుపెడుతున్నారు. ఇక ఇప్పటిదాకా మధ్యాహ్న సమయంలో మాత్రమే ఈ ట్రైన్స్ నడుస్తున్నాయి. అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
అయితే రైలు, బస్సు, విమానం వంటి వాటిలో ప్రయాణం చేయాలంటే ఎవరైనా సరే టికెట్ ఉండాల్సిందే. అయితే తాజాగా యూపీకి చెందిన కానిస్టేబుల్ వందే భారత్ రైలులో టికెట్ లేకుండా ప్రయాణించాడు. ఆయన తన పక్క సీట్లో తన లగేజ్ పెట్టుకున్నారు. టీసీ ప్రయాణికులందరి దగ్గర టికెట్ చెక్ చేస్తూ వచ్చారు. కానిస్టేబుల్ ను టికెట్ చూపించమని ఆడడడంతో టికెట్ లేదని, తాను ఎక్కాల్సిన రైలు మిస్ అవడంతో, ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందని చెప్పారు.
దాంతో టికెట్ లేకుండా ఎలా ఎక్కుతారని, అలా అసలు ఎక్కకూడదని టీసీ చెప్పారు. నెక్స్ట్ స్టేషన్లో అతన్ని దిగిపోమని సూచించారు. ఈ ఘటనను రైల్లో ఉన్న పాసింజర్లు వీడియో తీసి, నెట్టింట్లోషేర్ చేశారు. ఆవీడియో వైరల్ అవడంతో ఈ విషయం రైల్వే శాఖ వరకూ వెళ్లింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. https://twitter.com/razzbsingh/status/1711266701483159844?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1711266701483159844%7Ctwgr%5E9112c634cf91eb6f719a50387a6ea7f88a8eab96%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fnational%2Fviral-video-up-police-personnel-boarded-vande-bharat-without-ticket-tte-reprimanded-719966.html 
ఇజ్రాయెల్‌లో భారత సంతతికి చెందిన యూదులు సుమారు 95,000 మంది, భారతీయులు 18,000 మంది నివసిస్తున్నారని తెలుస్తోంది. యుద్ధం జరుగుతున్నప్పటికీ కొందరు భారతీయులు పెద్దగా ఆందోళన పడడం లేదు. సెక్యూరిటీకి సంబంధించిన సూచనలను పాటించినట్లయితే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. దాడి ఎక్కువగా ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోనే జరుగుతుందని, మిగతా ప్రాంతాల్లో అంతగా దాడులు జరగట్లేదు. అందువల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటే దాడుల వల్ల కలిగే ప్రమాదం తక్కువ అని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు.
రాకెట్లు ఎక్కువగా అష్కెలోన్ సిటీలోనే పడ్డాయి. ఇక ఈ ప్రాంతంలో ఉండే తెలంగాణకు చెందిన ఎల్లే ప్రసాద్ ”చాలా అలర్ట్ గా ఉండాలి, సైరన్ మోగిన వెంటనే షెల్టర్‌కు వెళ్ళాలి” అని అన్నారు. హిబ్రూ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ స్టూడెంట్ బిందు మాట్లాడుతూ సేఫ్టీ ప్రోటోకాల్‌లను ఫాలో అయ్యానని, సురక్షితంగా ఉన్నానని వెల్లడించారు. అలాగే ఇండియన్ స్టూడెంట్స్ అందరూ పరస్పరం టచ్‌లోనే ఉన్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారని తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నివసించే దీక్షిత జోషి, 2022లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో 58వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, దీక్షితా సివిల్స్ ఎగ్జామ్ రాయడం కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. స్వయంగా సివిల్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయింది.
దీక్షితా జోషి తండ్రి ఫార్మసిస్ట్, తల్లి ఇంటర్ కళాశాలలో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఆమె ఆర్యమాన్ విక్రమ్ బిర్లా పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. 12వ క్లాస్ లో ఉత్తీర్ణత పొందిన తరువాత జిబి పంత్ యూనివర్సిటీ పంత్నగర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత ఐఐటీ మండిలో మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ చేసే టైమ్ లోనే దీక్షిత యూపీఎస్సీ రాయాలని నిర్ణయించుకున్నారు. 
ప్రేమ విమానం సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించారు. అనసూయ భరద్వాజ్, ‘వెన్నెల’ కిశోర్, అనిరుధ్ నామా, దేవాన్ష్ నామా ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రెండు గ్రామాలలో 1990 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఒక గ్రామంలో శాంతమ్మ(అనసూయ) తన భర్త నాగరాజు(రవివర్మ), పిల్లలు రామ్ (దేవాన్ష్ నామా) లక్ష్మణ్ అలియాస్ లచ్చు (అనిరుథ్ నామా)లతో కలిసి చిన్న గుడిసెలో జీవిస్తూ ఉంటుంది. అప్పులతో వారి కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది.
అయితే శాంతమ్మ చిన్న కొడుకు లచ్చుకు విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. తన కోరికను తండ్రికి చెబితే, నాగరాజు పంట చేతికివచ్చిన తర్వాత విమానం ఎక్కిస్తాను అని చెప్తాడు. కానీ కొన్నిరోజులకే అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకొని చనిపోతాడు. శాంతమ్మ కూలి పనులు చేస్తూ, పిల్లలను పోషించుకుంటుంది.
ఇంకో గ్రామంలో మణి (సంగీత్ శోభన్) తండ్రి (గోపరాజు రమణ)తో కలిసి కిరాణా కొట్టు నడుపుతూ జీవిస్తుంటారు. మణి ఆ గ్రామ సర్పంచ్ కూతురు అభిత (శాన్వీ మేఘన)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరు తమ పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోరని లేచిపోతారు. ఈ క్రమంలో ఈ జంట ఎలాంటి ఇబ్బందులు పడుతుంది? విమానం ఎక్కాలనే కోరికతో శాంతమ్మ పిల్లలు ఏం చేశారు? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
రజాకార్ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తుండగా, బిజీపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్‌కు రాలేదంటూ ఈ టీజర్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు.చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయని, అందుకే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
రోజా అసలు పేరు శ్రీ లతారెడ్డి. 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నవంబర్ 17న జన్మించారు. ఆ తరువాత కాలంలో వారి కుటుంబం హైదరాబాద్ కు వచ్చారు. రోజా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పొందారు. ఆమె ఇండస్ట్రీలో రాకముందు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నారు.
రోజా 1991 లో ప్రేమ తపస్సు అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత సర్పయాగం మూవీలో నటించింది. 1992 లో ఆర్ కె. సెల్వమణి దర్శకత్వంలో చెంబరుతి అనే మూవీ ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రాలు విజయం సాధించడంతో ఆమెకు వరుస సినిమాలలో నటించి, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, జగపతిబాబు, వినోద్ కుమర్, శ్రీకాంత్ వంటి హీరోలతో నటించింది. రజినికాంత్, శరత్ కుమార్, సత్యరాజ్, విజయ్ కాంత్, అర్జున్ సర్జా, మమ్ముట్టి, ప్రభుదేవా వంటి వారితో నటించి మెప్పించింది. 1991 నుండి 2002 వరకు హీరోయిన్ గా నటించింది. 2002 లో ఆగస్ట్ 21న కోలీవుడ్ దర్శకుడు ఆర్ కె. సెల్వమణిని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రోజా, సెల్వమణి వెడ్డింగ్ ఫోటోలను మీరు చూసేయండి..
2.

