సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ వచ్చినవారు ఉన్నారు. అలాగే స్టార్ డమ్ అనుభవించి, ఆ తరువాతి కాలంలో అన్నిటిని పొగొట్టుకుని, సాధారణ జీవితం గడుపుతున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ దేవయాని ఒకరు.
ప్రేమలేఖ మూవీని చూసినవారెవ్వరూ హీరోయిన్ దేవయానిని అంత ఈజీగా మరిచిపోలేరు. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణించింది. అయితే ప్రస్తుతం ఆమె ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఆ పరిస్థితి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
దేవయాని ముంబయిలో 1974లో జూన్ 22న జన్మించింది. ఆమె తండ్రి కర్నాటకలోని మంగళూరుకు చెందిన కొంకణికి చెందినవారు. తల్లి మలయాళీ. ఆమె 1995 లో ‘దిల్ కా డాక్టర్’ అనే మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత బెంగాలీ మూవీ ‘షాత్ పొంచోమి’ లో నటించింది. ఆమెకు గురింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆమె తమిళం, తెలుగు, కన్నడ , మలయాళం , హిందీ, బెంగాలీ భాషల్లో పలు చిత్రాలలో నటించింది. దేవయాని కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది.
సౌత్ ఇండియాలో ఒక ఎపిసోడ్ లో నటించడానికి గాను లక్షరూపాయల అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన తొలి సీరియల్ నటి దేవయాని. 30 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగిన దేవయాని ఆ తరువాత అవకాశాలు తగ్గాయి. దానికి కారణం కోలీవుడ్ ఇండస్ట్రీలో శరత్‌కుమార్, అజిత్ వంటి హీరోలతో ఎఫైర్ సాగించినట్లు పలు వార్తలు రావడంతో అక్కడ అవకాశాలు రాలేదని టాక్. 2001లో దేవయాని కోలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ను ప్రేమించారు. కానీవారి ప్రేమ దేవయాని తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక గుడిలో వివాహం చేసుకుందని తెలుస్తోంది.
దీంతో దేవయాని తల్లిదండ్రులు ఆమె అప్పటి దాకా సంపాదించిన మొత్తం నుండి ఏమి ఇవ్వలేదట. ఆమె చేతిలో డబ్బు లేకపోవడం, వివాహం తరువాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు. రోజుకు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా నిలిచిన దేవయాని జీవితం మళ్లీ దారిలోకి వచ్చింది. ఈ జంటకి ఇనియ, ప్రియాంక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అలా సంపాదించిన డబ్బుతో సినిమా నిర్మాణం మొదలుపెట్టింది.
ఆమె భర్త డైరెక్షన్ లో కొన్ని సినిమాలు తీయగా, అవి ప్లాప్ అయ్యి, డబ్బు అంతా పోయి, అప్పుల పాలయ్యారట. వాటిలో కొంత చెల్లించి రుణాల బాధ నుండి నుండి బయటపడ్డారట. ఆ తరువాత దేవయాని యాక్టింగ్ మానేసి, తమిళనాడులోని అన్నాసాలైలో చర్చ్‌పార్కు కాన్వెంట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు చిన్నప్పటి నుండి టీచర్ కావాలనే కోరిక ఉండేదని, అందుకే తన పిల్లల స్కూల్ లోనే టీచర్ గా చేస్తున్నానని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది.
Also Read: స్కంద… SVSC..! ఈ 2 సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ గమనించారా..?

తెలుగు ఇండస్ట్రీలో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే బోయపాటి శ్రీను అని అంటారు. బోయపాటి ఇప్పటి దాకా 9 చిత్రాలు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఇక స్కంద సినిమాను వాటికి మించిన మాస్ తో తెరకెక్కించాడు. ఇక బోయపాటి చిత్రాలలో లాజిక్ లు ఉండవు. హీరో ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నవారి నైన సులభంగా కొట్టగలడు. ఇక స్కందలో అయితే 2 అడుగులు ముందుకేశాడని అంటున్నారు.
ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కి మాస్ ప్రేక్షకులు ఈలలు వేస్తే, సాధారణ ఆడియెన్స్ కు మాత్రం చాలా సిల్లీగా అనిపించాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ మూవీని నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. రీలిజ్ అయినప్పటి నుండి ఈ మూవీ నెట్టింట్లో ఏదో ఒక విధంగా హల్చల్ చేస్తూనే ఉంది. స్కంద లాంటి మాస్ సినిమాకు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ సినిమాకు కామన్ పాయింట్ ఉంది.
తాజాగా కోతిమీర.కట్ట అనే ఇన్ స్టా ఖాతాలో స్కంద మూవీలోని రామ్, శ్రీలీల, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వెంకటేష్, మహేష్ బాబు ఫోటోలను షేర్ చేస్తూ, ‘కాస్త వీళ్ళ పేర్లు ఏంటో చెప్పండయ్యా’ అంటూ పోస్ట్ చేశారు. ఆ మూవీలో వెంకటేష్, మహేష్ బాబును పెద్దోడు, చిన్నోడు అని పిలుస్తారు. ఇక స్కంద మూవీలో రామ్ ని సీఎం అల్లుడు, శ్రీలీల సీఎం కూతురు, యావరేజ్ అని పిలిచినట్టు తెలుస్తోంది. రెండు సినిమాలలో మెయిన్ క్యారెక్టర్లకు పేర్లు లేవు. ఇక ఈ పోస్ట్ పై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.




పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారికి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె స్టార్ హీరోయిన్గా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ వైవిధ్యభరితమైన చిత్రాలలో అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ 



ఎవరైన తమ భావాలను ఇతరులతో ఎక్కువగా షేర్ చేసుకుంటుంటే, వారిని బలహీనులు అని అంటుంటారు. అందువల్ల ఎవరైతే వారు బలంగా ఉన్నానని నిరూపించుకోవడానికి తన భావాలను, బాధలను వారిలోనే ఉంచుకుంటారట. వెల్నెస్ కోచ్, ఎన్సో వెల్నెస్ ఫౌండర్ అరుబా కబీర్ మగవారు వారి ఆలోచనలు బయటకు చెప్పకపోవడానికి కారణాలను వెల్లడించారు.
మగవారిని సమాజంలో బలమైనవారిలా సమాజంలో చిత్రీకరించారు. అందువల్ల, వారి ఆలోచనలను ఎప్పుడు బయటికి చెప్పుకోరు. వారు బాధను వారిలోనే దాచుకుంటారు. కానీ ఎదుటివారికి చెప్పుకోరు. వారు ఒకవేళ ఇతరులతో వారి బాధలను కానీ, ఆలోచనలను కానీ పంచుకుంటే, వారు తమను చులకనగా చూస్తారని, అలా చేయడం వల్ల బాధ పడాల్సి వస్తుంది. కాబట్టి, మగవారు వారి ఆలోచనలను ఇతరులకు చెప్పడానికి భయపడతారట.
అయితే, అసలు మగవారు వారి బాధలు చెప్పుకుంటే వచ్చే ప్రయోజనం గురించిన నిపుణులు చెబుతున్నారు. మగవారు వారి ఆలోచనల గురించి ఇతరులకు చెబితే వారి ఒత్తిడి తగ్గుతుంది. వారి భావాలను సంతోషంగా ఎక్స్‌ప్రెస్ చేసినపుడు నిరాశ మరియు మానసిక సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు. బాధలు, మానసిక ఆరోగ్యం, ఎమోషన్స్ గురించి ఇతరులతో మాట్లాడటానికి మగవారికి అవగాహన పెంచడం ముఖ్యం. వారి ఆలోచనల్ని స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో షేర్ చేసుకోవడం ముఖ్యం అని అంటున్నారు.
రిడిల్స్ అంటే పిల్లలు దగ్గర నుండి పెద్దవారి వరకు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఒక రిడీల్ ఎలా ఉండాలనే దాని గురించి ఎటువంటి రూల్స్ లేవు. అవి ఒక లైన్ వలె చిన్నగా ఉండవచ్చు. లేదా పెద్ద పేరా రూపంలో కూడా కావచ్చు. కొన్ని రిడిల్స్ రైమ్ లా కూడా ఉంటాయి. మరి కొన్ని కవితల రూపంలో కూడా ఉండవచ్చు.
అయితే ఇప్పుడు ఒక డిటెక్టివ్ రిడిల్ గురించి చూద్దాం. ఒక రైలు పట్టా మీద మీ సోదరుడు ఉన్నాడు. మరో రైలు పట్టా సోదరి ఉంది. వీళ్ళిద్దరూ భయంతో కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు. కానీ మీరు ఒక్కరినే కాపాడగలరు. అయితే వీళ్లిద్దరిలో మీరు ఎవరిని కాపాడుతారు. ఈ రిడీల్ కి పది సెకన్లలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ రిడిల్ కి సమాధానం ఏమిటంటే మీరు బాగా గమనించినట్లయితే మీ సోదరుడి వైపు రెడ్ సిగ్నల్ పడింది. అంటే ట్రైన్ మూవ్ కాదు. మీ సోదరి వైపు చూస్తే గ్రీన్ సిగ్నల్ పడింది. అంటే ట్రైన్ మూవ్ అవుతుంది. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ముందుగా మీ సోదరిని కాపాడాలి.
వినాయకచవితి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. గణేష్ నిమజ్జన సందర్భంగా జరిగే ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు ప్రతి ఏడాది మందు షాపులను క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా 3 రోజుల పాటు అంటే 26, 27, 28 మందు షాపులను మూసేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. అంటేకాకుండా మద్యం సేవించి నిమజ్జంలో పాల్గొనటాన్ని కూడా నిషేధించారు.
అయితే కొందరు మందు షాప్స్ మూసేస్తారని 3 రోజుల ముందుగానే మద్యాన్ని కొని, పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా గణేష్ నిమజ్జంలో భాగంగా జరిగే ఊరేగింపులో కొందరు మద్యం సేవించారు. అది కూడా పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే మద్యం సేవించారు. ఇలా చాలా చోట్ల కనిపించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ హుస్సేన్‌సాగర్‌లో జరిగిన నిమజ్జనంలో చైన్ స్నాచింగ్‌లు, పిక్ పాకెటింగ్, మొబైల్ ఫోన్ల దొంగతనాలు పెద్ద సంఖ్యలో జరిగాయి.
గురువారం నాడు ఒక్కరోజే ఆ పరిసరాలు 67 దొంగతనాల కేసులు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రజలందరు గణేష్ నిమజ్జనం చూస్తుంటే, జేబు దొంగలు తమ చేతివాటాన్నిప్రదర్శించారు. ఈ దొంగతనాల పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ దృశ్యాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కోలీవుడ్ టాప్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన మూవీ ‘కిక్’. ఈ చిత్రంలో తాన్య హోప్ మరియు రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌రాజ్ దర్శకత్వం వహించారు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత బ్రహ్మానందం తమిళ సినిమాలో నటించాడు. ఈ మూవీ లో సైంటిస్ట్ వాలి అనే క్యారెక్టర్ నటించాడు. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
2016లో సూపర్ హిట్ అయిన కన్నడ సినిమా జూమ్ కి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. డీడీ రిటర్న్స్‌తో విజయాన్ని సాధించిన సంతానం ఈ మూవీతో మరో విజయాన్ని అందుకోవాలనుకున్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరించింది. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వరస్ట్ సినిమా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా, “అసలు ఇలాంటి సినిమాలో బ్రహ్మానందం ఎలా నటించారు?” “ఏం చూసి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు?” అంటూ బ్రహ్మానందంని కూడా కామెంట్ చేస్తున్నారు. తమిళ్ వాళ్ళు అయితే మన స్టార్ కమెడియన్ ని అలాంటి సినిమాలో చూసి ఏకంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా రెండున్నర గంటల పాటు సమయాన్ని వృథా చేసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి అని కామెంట్ చేస్తున్నారు. సినిమా అంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఉందని దారుణంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.