ప్రతివారం లాగే ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు విడుదల అవుతుండగా, వీటిలో డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అలాగే రీ రిలీజ్ సినిమా కూడా బాక్సాఫీస్ సందడి చేయబోతుంది.
ఈ వారం కాస్త హైప్ ఉన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న మరియు మీడియం రేంజ్ హీరోలు థియేటర్లలోకి వస్తున్నారు. మరి ఈ వారం థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. కింగ్ ఆఫ్ కొత్త:
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పవర్ఫుల్ యాక్షన్ సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’. ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా దుల్కర్ నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్లతో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు భాషల్లో ఆగస్ట్ 24న రిలీజ్ కానుంది.
2. గాండీవధారి అర్జున:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా గాండీవధారి అర్జున. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ మూవీలో వరుణ్‌తేజ్ గూఢచారిగా నటిస్తున్నారు. హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ మూవీ 25న రిలీజ్ కానుంది.
3. బెదురులంక 2012:
కార్తికేయ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న మూవీ బెదురులంక. 2012 యుగాంతం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 25న విడుదల కానుంది.
4. పార్ట్నర్ :
తమిళ హీరో ఆది, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా పార్ట్నర్. ఈ చిత్రానికి మనోజ్ దామోధరన్ దర్శకత్వం వహించారు. కీలక పాత్రలో కోలీవుడ్ కమెడియన్ యోగీబాబు నటించారు. డబ్బింగ్ మూవీ 25న రిలీజ్ కాబోతుంది.
5. బాయ్స్ హాస్టల్:
కన్నడలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలలో ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ ఒకటి. యూత్ పుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన చిన్న సినిమా, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘బాయ్స్ హాస్టల్’ టైటిల్ తో తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ మూవీ 26న రిలీజ్ కాబోతుంది.
6. మన్మధుడు:
హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు 2002 లో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. సోనాలి బెంద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు.
ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా 29న రీరిలీజ్ కానుంది.
Also Read: రజనీకాంత్ యోగి కాళ్ళకి ఎందుకు మొక్కారు..? దానికి కారణం ఇదేనా..?

అనసూయ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియో షేర్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం చర్చకు దారి తీసింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాక, నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ తరువాత అనసూయ ఆ వీడియో గురించి మాట్లాడుతూ మళ్ళీ ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే అప్పటికీ ఆమె ఎందుకు ఏడుస్తుందో క్లారిటీగా రాలేదు. ఈ క్రమంలోనే నటి శ్రీ రెడ్డి అనసూయ వీడియో పైన ట్విట్టర్ వేదికగా స్పందించింది.
శ్రీరెడ్డి తన ట్వీట్ లో ” అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా. ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు, పాపం అవి తనని బాగా బాధిస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బీటెక్’ మూవీ తెలుగులో కూడా బ్లాక్బాస్టర్ గా నిలిచింది. నిరుద్యోగి కష్టాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అనుబంధాలు, హీరో కెరీర్ లో ఎదిగే విధానంతో పాటు, డైలాగ్స్, సాంగ్స్, ఇలా అన్ని అంశాలు ‘రఘువరన్ బి.టెక్’ ను యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. రిలీజ్ అయిన ఎనిమిదేళ్ళ తరువాత ఈ మూవీ తాజాగా రీరిలీజ్ అవగా ఈ చిత్రానికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
యూత్ థియేటర్లో ఒక పాటకు పాట పాడుతూ హోరెత్తించారు. వారి పాటతో థియేటర్ మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో ధనుష్ తమ్ముడు కార్తీక్ గా నటించిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. అతని పేరు హృషికేశ్. ఇతను ధనుష్ కు బావమరిది అవుతాడని తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కి బంధువు.
హృషికేశ్ పీస్బిబి స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ లో విజువల్ కమ్యూనికేషన్‌ను అభ్యసించారు. ఆ తర్వాత హృషికేశ్ యాడ్స్, డాక్యుమెంటరీలలో పని చేశారు. ‘వేలై ఇల్లా పట్టదారి’ మూవీలో ధనుష్ తమ్ముడి పాత్రలో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తరువాత రమ్ అనే మూవీలో లీడ్ రోల్ లో నటించారు. ఆమూవీ తరువాత వీఐపీ 2, పెద్దన్న, బొమ్మలకొలువు అనే తెలుగు సినిమాలోనూ నటించాడు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జైలర్’ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పలు దేవాలయాల దర్శిస్తూ, ఉత్తరప్రదేశ్ కు చేసరుకున్నారు. ఈ క్రమంలో రజనీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ని కలిసి, ఆయనతో ‘జైలర్’ మూవీని చూశారు. అయితే రజినికాంత్ కు స్వాగతం పలికిన సీఎం యోగి కాళ్లకు రజినికాంత్ నమస్కారం చేశారు.
రజినికాంత్ లాంటి పెద్ద హీరో తన కన్నా చిన్న వయసులో ఉన్న యోగి ఆదిత్య నాథ్ కాళ్ళకు నమస్కరించడం ఇటు తమిళనాడులో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో చేతులతో నమస్కరించడమో లేదా షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి కాకుండా యోగి పాదాలకు ఎందుకు నమస్కారం చేశారని అభిమానులు, నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
రజనీకాంత్‌కు 72 సంవత్సరాలు కాగా, సీఎం యోగి వయసు 51 ఏళ్లని, రజిని తనకంటే వయసులో చాలా చిన్నవాడైన యోగి కాళ్లకు మొక్కడం ఆయన అభిమానులు బాధపడుతున్నారు. రజనీకాంత్ యాంటీ ఫ్యాన్స్ రజిని సినిమాలలోని కొన్ని సన్నివేశాలతో ట్రోల్ చేస్తున్నారు. ‘రజనీకాంత్ ఆత్మగౌరవాన్ని తమిళనాడులోనే వదిలేసి, యోగి కాళ్లకు నమస్కరించారు’ అని విమర్శిస్తున్నారు. అయితే కొందరు సీఎం యోగి సన్యాసి కావడం వల్లనే రజనీ అలా నమస్కరించాడని, అందులో తప్పులేదని వాదిస్తున్నారు. రజనీ ఆథ్యాత్మిక కోణంలో అలా చేశారని కొందరు అంటున్నారు.
పదేళ్లు అమెరికాలో ప్రయత్నించినప్పటికీ కెరీర్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో 1971లో మళ్ళీ హాంకాంగ్ కి వెళ్ళిపోయారు. అక్కడే ‘ది బిగ్ బాస్’, ‘ఫస్ట్ ఆఫ్ ఫ్యూరీ’, ‘ది వే ఆఫ్ డ్రాగన్’ అనే 3 యాక్షన్ చిత్రాలతో విజయం సాధించారు. ది వే ఆఫ్ డ్రాగన్ మూవీకి కు బ్రూస్ లీ దర్శకుడుగా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన నటించిన మూవీ ఎంటర్ ది డ్రాగన్. ఈ మూవీ 1973 ఏప్రిల్ లో షూటింగ్ పూర్తయింది. అయితే మూవీకి డబ్బింగ్ చెప్పే సమయంలో బ్రూస్ లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే హాస్పటల్ కి తరలించారు.
అప్పుడే సెరిబ్రల్ ఎడెమీ(మెదడువాపు) వ్యాధి అని తెలిసింది. అయితే ఆ వ్యాధి రావడానికి కారణం వైద్యులు చెప్పలేకపోయారు. బ్రూస్ లీ కోలుకుని తిరిగి సినిమాల్లో నటిస్తారని వైద్యులు హామీ ఇచ్చారు. 2 నెలల తర్వాత బ్రూస్ లీ ప్రేయసి బెట్టీ టింగ్ పెయి ఇంట్లో ఉన్న సమయంలో బ్రూస్ లీ స్పృహ తప్పారు. అలా బ్రూస్ లీ 1973 జులైలో తన 32 ఏళ్ల వయసులో ఈలోకాన్ని విడిచారు. బ్రూస్ లీ చనిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికి అంతుచిక్కలేదు. ఆయన మరణానికి కారణం పెయిన్ కిల్లర్లు ఎక్కువగా తీసుకోవడం అని అప్పట్లో డాక్టర్లు ప్రకటించారు.
టార్జాన్ లక్ష్మీనారాయణ మొదటిసారిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘గాయం’ మూవీలో శ్రీశైలం అనే క్యారెక్టర్ లో నటించాడు. ఆ తరువాత అనేక చిత్రాలలో విలన్ గ్యాంగ్ లో ఉండే మెంబర్ గా నటిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన మూవీలో మెయిన్ విలన్ గా నటించాడు. కానీ ఆ మూవీ హిట్ కాలేదు. దాంతో సినిమాల కన్నా తమ సొంత ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బెటర్ అని భావించి, అటు వైపుగా వెళ్ళాడు.
అలా పది ఏళ్లపాటు ఆ బిజినెస్ చూసుకుంటూ గడిపిన టార్జాన్ లక్ష్మినారాయరణ, ఆ తరువాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు. అలా పోకిరి మూవీలో నటించిన టార్జాన్, మహేష్ బాబు చేతిలో పన్ను విరగొట్టుకునే పాత్రలో నటించి, గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా శ్రీ ఆంజనేయం, ఆర్య 2, అతనొక్కడే, అనుకోకుండా ఒక రోజు, ఖతర్నాక్, ఆంజనేయులు, సెల్ఫీ రాజా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, నన్ను దోచుకుందువటే, అలా వైకుంఠపురములో వంటి సినిమాలలో నటించాడు.
టార్జాన్ లక్ష్మీనారాయణ చాలా సినిమాలలో హాస్యనటుడు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు. ప్రస్తుతం తన నటన మెరుగుపరచుకోవడం కోసం నాటకాలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వందల సినిమాలలో నటించిన లక్ష్మీనారాయణ గుప్త తన కెరీర్ లో వివిధ రకాల పాత్రలను పోషించారు.
మహేష్ బాబు ఈ చిత్రంలో సరికొత్తగా, గ్యాంగస్టర్ గా కనిపించారు. ఈ సినిమాలో సాధారణ వ్యక్తి, ముంబైకి వెళ్ళి సూర్య భాయ్ గా ఎదుగుతాడు. ఈ క్యారెక్టర్ లో మహేష్ బాబు నటనకు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ నటించింది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం మర్చిపోలేని మూవీ అని చెప్పవచ్చు. మూవీ అంతా ముంబై నేపథ్యంలోనే సాగుతుంది.
అయితే బిజినెస్ మెన్ మూవీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కథ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. అలా ముంబైకి వెళ్లి గ్యాంగస్టర్ గా ఎదిగిన వ్యక్తి పేరు సతువాచారి వరదరాజన్ ముదలియార్. ఆయన 1960 లో సాధారణ వ్యక్తిగా ముంబైకి వెళ్లి, ఒక ముంబై డాన్ వరదా బాయ్ గా ఎదిగారట. సతువాచారి 1926 లో అక్టోబర్ 9న జన్మించారు.
వరదా బాయ్ ని వర్ధ అని కూడా అనేవారంట. అంతేకాకుండా ఇండియన్ క్రైమ్ బాస్ అని కూడా పిలిచేవారట. వరదా బాయ్ 1988లో జనవరి 2న మరణించారు. వరదా బాయ్ నిజ జీవిత కథ ఆధారంగానే డైరెక్టర్ పూరి జగన్నాధ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మెన్ మూవీని తీశారు. కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమా కూడా వరదా బాయ్ ని కథతో తెరకెక్కింది.
చిరుత దాడిలో చిన్నారి చనిపోవడం ఇటు ప్రజల్లో, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు, లేదా ఇతర క్రూరమృగాలు ఎందుకు వస్తున్నాయనే అంశం తెరపైకి వచ్చింది.
తిరుమల కొండల పై అకేసియా చెట్లు పెంచడం వల్ల ఈ సమస్య వచ్చిందని భూమన్ తెలిపారు. గంటా మండపం, నామాల గవి వద్ద 225 ఎకరాలు ఉండేదని, అక్కడ 1985లో చెట్లు లేవని, టీటీడీ అకేసియా చెట్లను అక్కడ నాటింది. ఈ చెట్ల కారణంగా అక్కడ పెరిగే ఈత, శ్రీగంధం వంటి మిగతా చెట్లు ఎదగవని, ఇతర మొక్కలు కూడా బతకవని చెప్పారు. చెట్లు పెరిగినప్పటికీ, వాటికి కాయలు కాయకపోవడంతో అక్కడ ఆహారం లభించక ఇతర జంతువులు వెళ్లిపోయాయని అన్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు.
అయితే రీసెంట్ గా సుమారు ముప్పై ఎకరాల్లో ఉన్న అకేసియా చెట్లను కొట్టేశారు. అప్పటి దాకా ఆ చెట్ల నీడలో ఉండే చిరుతలు మనుషులకు సమీపంలో వాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయని భూమన్ చెప్పుకొచ్చారు. కానీ టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడుతూ అకేసియా చెట్లను కొట్టేసింది నిజమేనని, అయితే వాటిని కొట్టేయడం కారణంగా చిరుత పులులు నడకదారి వైపు వస్తున్నాయని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పారు.
అనసూయ పెట్టిన పోస్టు సారాంశం, నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాను సమాచారం, కమ్యూనికేషన్ కోసం మొదట్లో వాడాం. ఆ తరువాత ప్రపంచంలోని జీవన శైలి, డిఫరెంట్ సంస్కృతి, సంప్రదాయల గురించి, నాలెడ్జ్ కోసం ఉపయోగించేవాళ్ళం. ఇక్కడికి ఒకరికొకరు సపోర్ట్ గా నిలవాలనే వస్తాం. ఆనందం, బాధ వంటి వాటిని పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంటాం. నే సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి జ్ఞాపకం, ఫోటోలు, డాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్లు, కంబ్యాక్ లు అన్ని నా జీవితంలో భాగమే.
గత ఏడాది ‘పోకిరి’ తో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి కెరీర్ లో హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ కూడా రీరిలీజ్ లో మంచి వసూళ్లను సాధించింది.
అయితే గతంలో నిరాశపరిచిన రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో రీరిలీజ్ చేశారు. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత యావరేజ్ గా నిలిచిన చిన్న సినిమా ‘ఈనగరానికి ఏమైంది’ రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించి, పెద్ద సినిమాల లిస్ట్ లో నిలిచింది.
తాజాగా రీరిలీజ్ అయిన యోగికి కూడా అలాంటి రెస్పాన్స్ రావడంతో వరుసగా కొన్ని ప్లాప్ సినిమాలు రీరిలీజ్ సిద్ధం అయ్యాయి. అయితే స్టార్ హీరోలందరికి కాలంతో పని లేకుండా ఎప్పుడు రిలీజ్ అయినా ఫ్లాపే అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు. రాఖీ, ఒక్క మగాడు, లయన్ సినిమాలను త్వరలో రీరిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటి పై సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.