తమిళ ఇండస్ట్రీలో హిట్ ప్లాప్ లకు అతీతంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరో శింబు. నేషనల్ అవార్డు గ్రహీత అయిన డైరెక్టర్ సుశీంద్రన్ శింబు హీరోగా తెరకెక్కించిన తమిళ సినిమా ఈశ్వరన్. ఈ చిత్రం తెలుగులో ఈశ్వరుడు అనే టైటిల్ తో అనువాదం అయ్యింది.
ఈశ్వరుడు సినిమా ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, నందితా శ్వేత నటించారు. రీసెంట్ గా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హీరో శింబు నటించిన ఈశ్వరుడు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
పెదరాయుడు (భాగ్యరాజా) ఆయన భార్య పాపాయి, తమ నలుగురు పిల్లలతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటాడు. ఆ ఊరిలో పెదరాయుడు చెప్పిందే వేదం. ఫ్యామిలీ జోతిష్యుడు చెప్పినట్టుగానే జాతకం ప్రకారం పెదరాయుడు భార్య చనిపోతుంది. దాంతో పెదరాయుడే తన పిల్లల బాధ్యత తీసుకుంటాడు. పిల్లలు పెరిగి, సిటీలో స్థిరపడతారు. ఆస్తి కోసం కొడుకులు, కూతురు గొడవలు పడి, ఆ ఊరికి రావడం మానేస్తారు.
ఆ ఊరిలో పెదరాయుడి బాగోగులు ఈశ్వర్ (శింబు) చూసుకుంటూ ఉంటాడు. ఇక పెదరాయుడు కోరిక ప్రకారం అతడి పిల్లలను ఈశ్వర్ ఊరికి వచ్చేలా చేస్తాడు. వారి మధ్య ఉన్న గోడవలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే రత్నస్వామి పెదరాయుడు ఫ్యామిలీ పై పగపట్టి, కుటుంబం మొత్తాని హత్యమార్చాలని చూస్తుంటాడు. అలాంటి టైం లోనే జోతిష్యుడు పెదరాయుడు కుటుంబంలో ఒకరు మరణిస్తారని హెచ్చరిస్తాడు.
ఇక జోతిష్యుడు చెప్పినట్లుగా జరిగిందా? ఈశ్వర్ పెదరాయుడు ఫ్యామిలీని ఎందుకు కాపాడుతాడు? ఈశ్వర్ కి పెదరాయుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? ఈశ్వర్ ప్రేమించిన వాసుకి (నందితా శ్వేత) కి దూరమవడానికి కారణం ఏమిటి? ఈశ్వర్ లైఫ్ లోకి వచ్చిన పూజ (నిధి అగర్వాల్)ఎవరు అన్నదే మిగతా కథ.
ఈశ్వరుడు సినిమా రొటీన్ గా వచ్చే ఫ్యామిలీ కథ. రెగ్యులర్ కుటుంబ కథకు ఓ రివేంజ్ డ్రామా, బావమరదళ్ల లవ్ స్టోరిని కలిపి దర్శకుడు సుసీంద్రన్ ఈ మూవీని తెరకెక్కించాడు. మొదటి నుంచే సినిమా ఆర్టిపీషియల్గా సాగుతుంది. లవ్ ట్రాక్ కూడా కథలో బలవంతంగా ఇరికించిన భావన కలుగుతుంది. శింబు ఈశ్వర్‌గా మాస్ పాత్రలో కొత్తగా కనిపించాడు. గ్రామీణ నేపథ్యంలో శింబు ఎక్కువగా చిత్రాలు చేయకపోవడంతో ఈశ్వర్ పాత్రలో ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ డైరెక్టర్ రొటీన్ టేకింగ్ వల్ల శింబు పడ్డ కష్టం వృథా అయ్యింది.

ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రామాయణం ఆధారంగా వచ్చాయి. కానీ ఆదిపురుష్ సినిమా పై వచ్చినన్ని విమర్శలు, వివాదాలు ఏ సినిమా పై రాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో నుండే విమర్శల పాలవుతూ వస్తోంది. ఈమూవీలోని పాత్రల వేషధారణ, హనుమంతుడి డైలాగ్స్, ముఖ్యంగా రావణుడి పాత్ర తీరు పై ఆడియెన్స్ నుండి ప్రముఖుల వరకు విమర్శించారు. కొన్ని సీన్స్ ను రామాయణానికి విరుద్ధంగా తీశారనే విమర్శలు కూడా వచ్చాయి.
దాంతో ఈ మూవీని నిలిపివేయాలని పలువురు కోర్టులో పిటిషన్స్ కూడా దాఖలయ్యాయి. ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలని అలహాబాద్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు కాగా, దానిపై ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు సెన్సార్ బోర్డుని తప్పు బట్టింది. మూవీని సెన్సార్‌కు పంపించిన టైంలో ఇలాంటి సంభాషణలు ఎందుకు సమర్థించారని సెన్సార్ బోర్డుని ప్రశ్నించింది.
ఇటువంటి సంభాషణలతో భవిష్యతు తరాలకు ఎటువంటి సందేశాలను ఇవ్వాలనుకుంటున్నారని మండిపడింది. ఆదిపురుష్ దర్శకుడు, నిర్మాత విచారణకు కోర్టులో హాజరుకాకపోవడం పై అలహాబాద్ హైకోర్టు అసహనం తెలిపింది. ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు రావడంతో మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ని తొలగించింది.
ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్-కే. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలకపాత్రలో నటించబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. దాంతో నెట్టింట్లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మూవీలో హీరోగా ప్రభాస్ నటిస్తుండగా, కమల్ హాసన్ విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో విలన్ గా నటించడానికి కమల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారని? కమల్ చేసే క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేశారో? విలన్ గా కమల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీలో కమల్ ఎంట్రీ క్లైమాక్స్ లో ఉంటుందని సమాచారం. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఉత్కంఠభరితంగా ఉంటుందని టాక్. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
సెకండ్ పార్టు సినిమా పై హైప్ పెంచడం కోసం మొదటి పార్ట్ క్లైమాక్స్ లో కమల్ ఎంట్రీ ఉంటుందని వినిపిస్తోంది. చెప్పాలంటే ‘విక్రమ్’ మూవీలో రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ ఇచ్చినట్లుగా, కమల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి భాగాన్ని 2024 జనవరిలో, రెండవ భాగాన్ని 2025 జనవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.
ఇషాంత్ శర్మ మాట్లాడుతూ, ధోనీ సైలెంట్ గా ఒక కార్నర్ లో కూర్చున్నాడంటే, సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని, ఆ టైంలో ఎవరైనా ధోనీని డిస్టర్బ్ చేసినట్లయితే అతడిని బూతులు తిట్టేవాడని, ధోనీని అందరు మిస్టర్ కూల్ అని పిలుస్తారు. కానీ అతను అంత కూల్ కాదని అన్నాడు.
అయితే ధోనీ తరుచూగా ఆగ్రహించేవాడు కాదు. మైదానంలో తప్పులు చేస్తే మాత్రం అరిచేవాడు. తనని కూడా ఎన్నో సార్లు తిట్టాడని అన్నారు. ఒకటి రెండు సార్లు అయితే ధోనీని చూసి భయపడినట్లుగా తెలిపాడు. ఫీల్డర్ వేసిన త్రో ధోనీ గ్లోవ్స్ వరకు వెళ్లకుంటే ధోనీకి చాలా కోపం వస్తుందని, చెయ్యికి ఇవ్వచ్చుగా అంటూ కొప్పడతాడని అన్నారు. 2013 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తాను చేసిన ఒక మిస్టేక్ వల్ల ధోనీకి చాలా కోపం వచ్చింది.
ఇంగ్లండ్‌తో మ్యాచ్ లో క్రీజులో ఉన్న రవి బోపారా క్యాచ్ మిస్ చేయడం వల్ల ధోనీకి విపరీతమైన కోపం రావడంతో, ఫీల్డింగ్ చేయలేకపోతే అక్కడ నుండి వెళ్ళమని అరిచాడు. దాంతో తాను నిశబ్దంగా వెళ్లిపోయానని, తనను మాత్రమే కాకుండా కోహ్లీని కూడా ధోనీ చాలా సార్లు తిట్టాడు. ఆ తరువాత తమ్ముడిలా భావించి చెప్పానని అనేవాడు. ఎందుకిలా తిడతావని ధోనీ అడిగినపుడు, నువ్వంటే నాకు అంత ఇష్టం అని సమాధానం చెప్పేవాడు’ అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఉపాసన డెలివరీ అనంతరం చాలా త్వరగా డిశ్చార్జ్ అయ్యారు. ఉపాసన హాస్పటల్ లో ఉన్నది 3 రోజులే. అంటే ఆమె కొన్ని గంటలలోనే హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే చాలామంది పుట్టిన బిడ్డ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ, ఉపాసన తక్కువ సమయంలో ఎలా డిశ్చార్జ్ అయ్యారు అనే విషయన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఉపాసన అడ్మిట్ అయింది సొంత హాస్పటల్ లోనే. వారికి వేల కోట్లు ఆస్తులు, ఆమె చుట్టూ ఎందరో డాక్టర్లు ఉంటారు. కాబట్టి త్వరగా డిశ్చార్జ్ అయ్యిందని చాలామంది అనుకున్నారు.
అయితే ఉపాసన అంట త్వరగా డిశ్చార్జ్ కావడానికి కారణం ఆమె ఆహారపు అలవాట్లే అని, వాటి వల్లే ఉపాసన అంత హెల్దీగా ఉందని తెలుస్తోంది. సిజేరియన్ తరువాత ఎలాంటి వారికైనా రికవరీ కావడానికి, కుట్లు మానడానికి 10-15 రోజుల సమయం తీసుకుంటారు. అయితే ఉపాసన పాటించే ఆహారపు అలవాట్లతోనే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంది. అందువల్లే ఆమె డెలివరీ అయిన 2 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యిందని ప్రముఖ డాక్టర్ రఘు తేజ ఒక వీడియో ద్వారా ఉపాసన తన డైట్ గురించి గతంలో చెప్పిన విషయాలను తెలిపారు.
ఆ వీడియోలో ధోనీ ఫ్లైట్‌లో కూర్చొని ట్యాబ్‌లో గేమ్ ఆడుతుంటే, ఒక ఎయిర్ హోస్టెస్ ధోనికి చాక్లెట్‌ని ఇచ్చింది. ధోనీ ఆమెను పలకరించి, మాట్లాడుతూ ఆ చాక్లెట్స్ తీసుకుంటాడు. ఇక ఆ సమయంలో ధోనీ ట్యాబ్‌లో ఆడుతున్న గేమ్ క్యాండీ క్రష్ అనేది వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది.
ధోనీ క్యాండీ క్రష్ ఆడటంతో ధోనీ ఫ్యాన్స్ తో సహా క్రీడాభిమానులలో ఇంట్రెస్ట్ ను కలిగించింది. ట్విట్టర్లో #Candycrush ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో పై నెటిజన్లు, ధోని ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘క్యాండీక్రష్ డౌన్లోడ్ ఇప్పుడు చేయాలనిపిస్తుంది’ అని ఒకరు, ‘ధోని దెబ్బతో క్యాండీక్రష్ డౌన్లోడ్స్ పెరుగుతాయి’ అని మరొకరు, ‘ధోని క్యాండిక్రష్‌లో ఏ లెవెల్లో ఉన్నాడో’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోతో కొన్ని గంటల్లోనే క్యాండీ క్రష్ గేమ్ డౌన్లోడ్స్ బాగా పెరిగాయి.
స్వయంగా క్యాండీ క్రష్ ఈ విషయాన్ని తమ అఫిషియల్ పేజీలో వెల్లడించింది. క్యాండీ క్రష్ మేనేజ్మెంట్ తమ గేమ్ ఆడుతున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది. అనంతరం 3 గంటల్లో 30 లక్షలకు పైగా క్యాండీ క్రష్ గేమ్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లుగా తెలిపింది. మహేంద్ర సింగ్ ధోనీ గేమ్ ఆడుతూ ఇలా కనిపించడం మొదటిసారి కాదు. గ్రౌండ్ లో క్రికెట్ ఆడే ధోనీ, మైదానం బయట ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతూ కనిపిస్తాడు. ధోనీ పబ్జీ, ఫిఫా, కాల్ ఆఫ్ డ్యూటీ ఎక్కువగా ఆడుతూ ఎంజాయ్ చేస్తాడు.
ఆనంద్ వర్ధన్ మూడున్నర సంవత్సరాలకే బాలరామాయణం చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ఆనంద్ వర్ధన్ వాల్మీకి మరియు బాలాంజనేయుడిగా రెండు క్యారెక్టర్లలో నటించాడు. ఆ తరువాత ప్రియరాగాలు మూవీలో బోర్ అనిపించగానే ఎవరో ఒకరి బర్త్ డే డేట్ ను ఫోన్ నెంబర్ గా డయల్ చేసి ఫోన్ ఎత్తినవారిని ఆటపట్టించే అబ్బాయిగా నటించాడు. ప్రియరాగాలు మూవీలో నటనకుగానూ ఆనంద్ వర్ధన్ నంది అవార్డు అందుకున్నాడు.
మనసంతా నువ్వే సినిమాలో చిన్నప్పటి ఉదయ్ కిరణ్ గా నటించాడు. తూనీగా తూనీగా పాటలో అలరించాడు. వెంకటేశ్ తో సూర్యవంశం, యాక్షన్ కింగ్ అర్జున్ తో శ్రీ మంజునాధ సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘నిదురించు జహాపన’. రీసెంట్ గా నిర్వహించిన మూవీ ప్రెస్ మీట్లో హీరో ఆనంద్ వర్ధన్ మాట్లాడారు.
‘బాలనటుడుగా ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు హీరోగా కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. సినిమాలే నాకు ప్రాణం. జీవితాంతం వరకు నటిస్తూనే ఉంటా’ అని అన్నారు. ఈ మూవీ సముద్రం నేపథ్యంలో సాగే స్టోరీ అని దర్శకుడు ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో అనూప్ రూబెన్స్, హీరోయిన్స్ రోషిణి, నవమి పాల్గొన్నారు.
కోరాలో “ఆదిపురుష్ సినిమా flop అవ్వడానికి ఒక్క సీన్ చెప్పండి” అని అడిగిన ప్రశ్నకు సంతోష్ కుమార్. కె అనే యూజర్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “లాస్ట్ ఆదివారం మా అబ్బాయి, వాళ్ళ పెద నాన్న మరియు వాళ్ళ పిల్లలతో కలసి ఆదిపురుష్ సినిమాకు ఐనాక్స్ కి వెళ్లారు. మా అబ్బాయి వయస్సు 8 ఏళ్ళు. మూవీ చూసి వచ్చిన తరువాత సినిమా ఎలా ఉంది అని అడిగితే, మా అబ్బాయి ఏం బాలేదు డాడి, విలన్ హీరోయిన్ ని ఎత్తుకెళ్తాడు. హీరో వెళ్ళి విలన్ ని చంపి, హీరోయిన్ ని కాపాడుతాడు. అతనికి కోతులు, చింపాజీలు సహాయం చేస్తాయి.
మా ఆవిడ బాబుకి ఆ మూవీ రామాయణ కథ అని చెప్పడానికి ప్రయత్నిస్తే వద్దని వారించాను. వాడిని అదే ఆలోచనతో నే ఆ మూవీని చూడనీ లేదంటే అదే రామాయణం అని పొరపాటు పడే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. దాదాపు అదే వయసులో ఉన్నప్పుడు మేము చూసిన రామాయణ సినిమాలు ఇప్పటికి కళ్ళ ముందు ఉన్నాయి. ఆ మూవీ చూసి వచ్చిన తరువాత మా నానమ్మను ప్రశ్నలతో విసిగించేవాళ్ళం, బాగా ఆకట్టుకున్న మూవీ మాత్రం సీతా కళ్యాణం” అని సమాధానం ఇచ్చారు.
ఒక ఆరేళ్ల బాబు రోజు తాను చేయాలనుకున్న పనులతో ఒక టైం టేబుల్ ను తయారుచేసుకున్నాడు. దానిలో ఆడుకోవడానికి, చదువుకోవడానికి, తినడానికి ఇలా అన్ని పనులకి సమయం కేటాయిస్తూ రాసుకున్న టైం టేబుల్ ను ఆ పిల్లాడి బంధువు ఒకరు సామాజిక మాధ్యమంలో షేర్ చేయడంతో ఆ టైం టేబుల్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
లైబా అనే ట్విటర్ యూజర్ తన ఖాతాలో ఆ పిల్లాడి టైం టేబుల్ ను పోస్టు షేర్ చేశారు. టైం టేబుల్ ను చూసిన వారు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆ ఆరేళ్ల పిల్లాడు తన క్రియేటివీటితో 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్ టేబుల్ తయారుచేసుకున్నాడు. అందులో ఈ పిల్లాడు చేయాల్సిన అన్ని పనులకు ఎక్కువ సమయంను కేటాయించాడు. కానీ చదువుకునేందుకు మాత్రం 15 నిముషాలే కేటాయించాడు. ఈ విషయమే అందరిని నవ్విస్తోంది.
ఆ పిల్లాడు టైమ్ టేబుల్లో నిద్ర లేచిన దగ్గర నుండి వాష్‌రూమ్, బ్రేక్‌ఫాస్ట్, స్నానం చేసే సమయం, టీవీ టైమ్, లంచ్, ప్లే విత్ రెడ్ కార్, అత్త ఇంటికి వెళ్లే సమయం నిద్రించే సమయం అంటూ అన్నింటికీ ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. కానీ చదువుకునేందుకు 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇక ఈ పోస్టుకు ఇప్పటి దాకా 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
మహేష్ నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. గత ఏడాది ప్రకటించిన ఈ చిత్రం షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. అయితే త్రివిక్రమ్ మళ్ళీ స్క్రిప్ట్ మార్చేశారని తెలుస్తోంది. మళ్ళీ ఫ్రెష్ స్టొరీతో షూటింగ్ మొదలు పెట్టారట. మొదట అనుకున్న మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే ను ఈ మూవీ నుండి తప్పించేశారు. దీనిపై గత కొన్ని రోజుల నుండి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుండి పూజాహెగ్డే తప్పుకున్నారని ఆ వార్తల సారాంశం.
మహేష్ బాబుతో గతంలో మహర్షి చిత్రంలో పూజాహెగ్డే నటించింది. మరి ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది. దానికి కారణం ఏమిటని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం నుండి పూజా హెగ్డేని తొలగించారని తెలుస్తోంది. పూజాహెగ్డే ప్రవర్తన పై మహేష్ బాబు మరియు గుంటూరు కారం చిత్ర బృందం విసిగిపోయిందని తెలుస్తోంది.
షూటింగ్ కి పూజా అందుబాటులో లేకపోవడం, ఆమె ప్రవర్తన వల్ల గుంటూరు కారం మూవీ యూనిట్ విసిగిపోవడం వల్ల పూజాహెగ్డేను ఈ సినిమా నుండి తొలగించారని తెలుస్తోంది. ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లుగా టాక్.